అశోక్ గల్లా హీరోగా, రాహుల్ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా, ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
తొలి సన్నివేశానికి నమ్రత ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా – మంజులా స్వరూప్‌లు స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: భరద్వాజ్ .ఆర్.
Comments
Please login to add a commentAdd a comment