'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.
ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్‌లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment