Sitara Entertainments
-
‘లక్కీ’ హీరోయిన్.. వరుస ఫ్లాపులు.. తగ్గని ఆఫర్స్
మాములుగా హీరోహీరోయిన్లకు ఫ్లాప్ వస్తే ఆఫర్స్ తగ్గిపోతాయి. స్టార్ హీరోలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. వాళ్లకు ఫ్లాప్ వచ్చినా కొత్త సినిమాలకు కొదవ ఉండదు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )కి వరుస ఫ్లాపులు వచ్చినా..ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్ 2తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది. అయితే వాటిల్లో లక్కీ భాస్కర్ మినహా మిగతా చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలు భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకున్నారు అంతా. ఇక ఆమె తెలుగు తెరకు దూరమైపోతుందని ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటికీ మీనాక్షిని ‘లక్కీ’గానే చూస్తోంది. ఫ్లాపులను పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు అందిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనగనగా ఒక రాజుతో పాటు మరో రెండు సినిమాల్లో మీనాక్షి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు, నాలుగు చిత్రాలతో అలరించబోతుంది. -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
అమెరికాలో రొమాంటిక్ కామెడీ
అశోక్ గల్లా హీరోగా, రాహుల్ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా, ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.తొలి సన్నివేశానికి నమ్రత ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా – మంజులా స్వరూప్‌లు స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: భరద్వాజ్ .ఆర్. -
టాలీవుడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
రవితేజ, శ్రీలీల జోడీ రిపీట్.. సంక్రాంతికి విడుదల
కొన్నేళ్లుగా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ వంటి చిత్రాలతో దూకుడు మీద ఉన్నాడు రవితేజ. హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అయితే తాజాగా రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ అయింది. తాజాగా నేడు ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. తొలి సన్నివేశంలో రవితేజ, శ్రీలీల జంటగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్‌లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
RT75: రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను రిలీజ్ చేశాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు మాస్ మహారాజా. ఉగాది పర్వదినం సందర్భంగా తన 75వ సినిమా అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా 'దావత్'లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది. అలాగే పోస్టర్ మీద "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి", "హ్యాపీ ఉగాది రా భయ్" అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది. అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎 We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥 వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు... రెడీ అయిపొండ్రి 🥳 We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO — Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024 . -
'టిల్లు స్క్వేర్': ఇట్ల నవ్వే మా బతుకులు నవ్వులపాలు చేస్తరు!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆహా ఇట్ల నవ్వే.. మా బతుకు నవ్వులపాలు చేస్తారు తర్వాత.., పోయినసారికన్నా ఈసారి గట్టిగ తగిలేటట్లుంది దెబ్బ.. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్‌బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడిని..' అన్న డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. డీజే టిల్లు మాదిరే ఈ సినిమా కూడా అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరిస్తుందని మేకర్స తెలిపారు. ‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా మరో మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
NBK109: పదునైన గొడ్డలికి కళ్ల జోడు.. పోస్టర్ అదిరింది
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. భగవంత్ కేసరితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు. వాల్తేరు వీరయ్యతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ బాబీ.. బాలయ్య 109వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది. నేడు (నవంబర్ 8) 'NBK109'వ చిత్రం ప్రారంభం అయిందని తెలియజేస్తూ.. ఓ పోస్టర్ని వదిలారు మేకర్స్. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బాలయ్యను ఒకవైపు ఊరమాస్ లుక్‌లో చూపిస్తూనే.. స్టైలీష్‌గా కూడా ప్రజెంట్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. Blood Bath Ka Brand Name 🩸 𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂 𝑽𝑰𝑺𝑰𝑻𝑰𝑵𝑮 𝑪𝑨𝑹𝑫 🪓👓 #NBK109 Shoot begins today!! 📽️ Beginning a new journey with our Natasimham #NandamuriBalakrishna garu 😍 I seek your blessings and support, as always. 🙏❤️#NBK109ShootBegins 💥@vamsi84… pic.twitter.com/bYl7izkWAB — Bobby (@dirbobby) November 8, 2023 -
Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’
‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సిద్ధుకి తగిన గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మూవీ మాత్రం ఈ యంగ్ హీరో జీవితాన్నే మార్చేసింది. సిద్దుని టిల్లు పాత్రలో మరోసారి చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. డీజే టిల్లు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అనూహ్యం వాయిదా వేస్తూ.. రిలీజ్ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిల్లుగాడు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. డీజే టిల్లు చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికే సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని మేకర్స్ అంటున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
ఊరమాస్‌గా సాయి ధరమ్ తేజ్.. గత్తరలేపిన ‘గాంజా శంకర్’ గ్లింప్స్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 15) సాయి తేజ్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అని టైటిల్ ఖరారు చేశారు. మాస్‌కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్’ వీడియో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. -
‘మ్యాడ్’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యాడ్ నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ:మ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: అక్టోబర్ 06, 2023 కథేంటంటే.. ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. ప్రెండ్షిప్, ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్స్‌తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్ నుంచి మొన్నటి హాస్టల్ డేస్ వరకు చూసినవే. కానీ మ్యాడ్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా.. ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్‌కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్.. ఇలా సరదాగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ఫస్ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్‌తో కలిసి లేడీస్ హాస్టల్‌కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్’ గ్యాంగ్ సక్సెస్ అయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్ శోభన్..తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఇక లవర్‌బాయ్ మనోజ్‌గా రామ్ నితిన్ చక్కగా నటించాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అనుదీప్ ఒక సీన్లో కనిపించి వెళ్తాడు. కాలేజీ ప్రిన్సిపల్‌గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
సినిమా చూసి నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తాం: నిర్మాత
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. సూర్యదేవర నాగవంశీ ముందుడి మరీ ఈ నిర్మాణ సంస్థను నడిపిస్తున్నాడు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అదించిన ఈ నిర్మాణ సంస్థ..తాజాగా ‘మ్యాడ్’తో అలరించడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ బామ్మర్థి నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతి రత్నాలు సినిమా కంటె ఎక్కువగా ఈ చిత్రం నవ్విస్తుందన్నారు. జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేశాడు. ‘సినిమా మీద నమ్మకంతో ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది యూత్‌ఫుల్ సినిమా అయినప్పటికీ..కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది’ అని నాగవంశీ అన్నారు. -
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ‘మ్యాడ్’..టీజర్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ కథ మొత్తం కాలేజ్ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్‌తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
సితార చేతికి విజయ్ 'లియో'.. అన్ని కోట్లు పెట్టి!
దళపతి విజయ్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. పాజిటివో నెగటివో పక్కనబెడితే ఈ హీరో గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. కొన్నిసార్లు ట్రోల్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్లందరూ విజయ్ 'లియో' కోసం ఎదురుచూస్తున్నారు. అయితే దీని రిలీజ్‌కి ఇంకా మూడు నెలల టైముంది. అంతలోనే ఇతడు టాలీవుడ్లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'లియో'. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఇతడి లాస్ట్ మూవీ 'విక్రమ్'.. తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజులో అలరించింది. అలానే ఆ సినిమాతో 'లియో'కు కనెక్షన్స్ ఉందనే టాక్.. దీనిపై మరింత హైప్‌ని తీసుకొచ్చింది. దీంతో తెలుగులో థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా రూ.23 కోట్లకు అమ్మారనే టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) 'లియో'.. తెలుగు థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. అయితే విజయ్ మూవీ హక్కులు ఇంత మొత్తానికి అమ్మారనేది మాత్రం రికార్డే. ఎందుకంటే 'వారసుడు' చిత్రాన్ని రూ.18 కోట్లకు అమ్మారని టాక్ వినిపించింది. అప్పుడు ఇప్పుడు నంబర్స్‌ని పోల్చి చూస్తే.. దళపతి విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించినట్లే! లోకేశ్ కనగరాజ్ తీస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ మధ్యనే వచ్చిన 'నా రెడీ' అనే పాట ఎంతలా ట్రెండ్ అయిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా విడుదలకు ఇంకా చాలా సమయమున్నప్పటికీ 'లియో' బిజినెస్ గట్టిగానే జరుగుతోంది. We are elated and extremely proud to be associated with one of the most awaited films of this year! 🤩 Sithara Entertainments is venturing into distribution with immaculate action spectacle, #Thalapathy @actorvijay and Sensational director @Dir_Lokesh 's #LEO in Telugu States.… pic.twitter.com/pt9yhZrvNH — Sithara Entertainments (@SitharaEnts) July 19, 2023 (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) -
గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా?
రవితేజ యమా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాలు ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబరు 20న, ‘ఈగిల్’ జనవరిలో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ చిత్రాల తర్వాత రవితేజ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అనే చర్చ కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని, అనుదీప్ వంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా జీవీఆర్ వాసు చెస్పిన ఓ స్టోరీ లైన్‌కు రవితేజ ఇంప్రెస్ అయ్యారని, పూర్తి కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకుంటారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి.. జీవీఆర్ వాసు కథకి రవితేజ ఫైనల్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? లేదా? వేచి చూడాలి. -
వాయిదా పడ్డ 'బుట్ట బొమ్మ', రిలీజ్ ఎప్పుడంటే..
అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఎస్.నాగవం శీ, సాయిసౌజన్య నిర్మిం చిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం జనవరి 26న విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా 'బుట్టబొమ్మ' సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. -
నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? ..నవ్వులు పూయిస్తోన్న ‘జాతిరత్నం’వీడియో
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నవీన్పొలిశెట్టి. 2021 మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. . ఈ మూవీ విడుదలై ఏడాదిన్నరకు పైనే అవుతున్నా హీరో నవీన్ పొలిశెట్టి నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో `అనగనగ ఒక రాజు` మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలకు సంబంధించి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ ఫన్నీ వీడియో ద్వారా తన సినిమాల అప్డేట్స్ని ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టి స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ `అరేయ్ ఏం చెప్పమంటావురా `జాతిరత్నాలు` తరువాత ఫ్యాన్స్ లవ్వు అరే ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి లేదు పరిస్థితి.. అనగానే ఫ్యాన్స్ అంటూ ఇద్దరు నవీన్ పొలిశెట్టి వద్దకు వచ్చారు. అందులో ఒకతను నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? అనడంతో కంగుతిన్న నవీన్ `ఉన్నారా.. షూటింగ్ చేస్తున్నా.. అనడం.. అయితే నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఏదీ అని మరో అభిమాని ప్రశ్నించడం..దానికి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న కదా షూటింగ్ జరుగుతోంది. చాలా బాగా వస్తున్నయ్ అని నవీన్ అనడం...ఆ వెంటనే అది అందరికి తెలిసిందే కదా.. అప్ డేట్ లు లేవు పదా అని ఫ్యాన్స్ వెళుతుండటం.. మరో అభిమాని కొడుకుతో కలిసి తనెవరో తెలుసా.. జాతిరత్నాలు టైమ్ లో ఎత్తుకుని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడు వీడు థర్డ్ స్టాండర్డ్.. త్వరగా అప్ డేట్ ఇవ్వండి లేదంటూ వీడి కొడుకు థర్డ్ స్టాండర్డ్ కి వచ్చేలా ఉన్నాడని పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. వీడియో చివరల్లో న్యూ ఇయర్ లో న్యూ మూవీస్ అప్ డేట్ లని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో అందించబోతున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2022లో తనకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ కొత్త ఏడాదిలో వరుస రిలీజ్ లతో తెరపై సందడి చేయబోతున్నారు. -
దసరా శభాకాంక్షలతో రానున్న 'స్వాతిముత్యం'
Ganesh Varsha Bollamma Swathi Muthyam Release Date Announced: ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కథానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ పోస్టర్‌ను బుధవారం (ఆగస్టు 10) విడుదల చేశారు. "స్వాతిముత్యం" సినిమాను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం 'స్వాతిముత్యం'. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారని యూనిట్ పేర్కొంది. చదవండి: ఎప్పుడూ మీరే కరెక్ట్.. ప్రతిసారి మాదే తప్పు: తాప్సీ చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగా జోడీ కట్టిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ The date is set!! A Beautiful tale of our Bhagyalakshmi & Balamurali is ready to take you on a fun & exquisite ride on OCT 5th, in theatres near you! 🤩❤️#SwathimuthyamOnOct5th ✨#Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @vamsi84 @adityamusic pic.twitter.com/jFIWocdzmS — Sithara Entertainments (@SitharaEnts) August 10, 2022 -
ప్రముఖ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
మెగా మేనల్లుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు(జనవరి 13) వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రనిర్మాత నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు', చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.