మొన్న టిల్లు స్వ్కేర్‌.. ఇప్పుడు మ్యాడ్‌ స్వ్కేర్‌ | Sithara Entertainments youthful comedy blockbuster MAD to get a MAD MAX entertaining sequel MAD Square | Sakshi
Sakshi News home page

మొన్న టిల్లు స్వ్కేర్‌.. ఇప్పుడు మ్యాడ్‌ స్వ్కేర్‌

Published Fri, Apr 19 2024 4:02 PM | Last Updated on Fri, Apr 19 2024 5:02 PM

Sithara Entertainments youthful comedy blockbuster MAD to get a MAD MAX entertaining sequel MAD Square - Sakshi

డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ బాక్సాఫీస్‌నిషేక్‌ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఓ సాలిడ్‌ హిట్‌ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్‌లో మరో హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్‌’చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ స్వ్కేర్‌’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement