చిరంజీవి, బాలకృష్ణ..ఇద్దరు పని రాక్షసులే: బాబీ | Director Bobby Kolli Talks About Daaku Maharaaj Movie And Balakrishna | Sakshi
Sakshi News home page

'డాకు మహారాజ్'లో కొత్త బాలయ్యను చూస్తారు.: బాబీ

Published Sat, Jan 11 2025 2:31 PM | Last Updated on Sat, Jan 11 2025 3:10 PM

Director Bobby Kolli Talks About Daaku Maharaaj Movie And Balakrishna

‘నేను చిరంజీవి(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ ఇద్దరితో కలిని పని చేశాను. ఇద్దరిలో ఎంతో ‍క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. నిర్మాలతకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు యంగ్‌ డైరెక్టర్‌  బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటింరు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 12) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. 'నరసింహానాయుడు', 'సమరసింహారెడ్డి' తర్వాత 'సింహా' ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.

హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.

నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు 'డాకు మహారాజ్'తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.

నిర్మాత నాగవంశీ, బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.

బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement