ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్‌: ప్రగ్యా జైస్వాల్ | Pragya Jaiswal Talk About Daaku Maharaaj Movie | Sakshi
Sakshi News home page

ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్‌, ఎందుంటే.. : ప్రగ్యా జైస్వాల్

Published Thu, Jan 9 2025 2:26 PM | Last Updated on Thu, Jan 9 2025 2:29 PM

Pragya Jaiswal Talk About Daaku Maharaaj Movie

జనవరి 12న నా బర్త్‌డే. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే అదే రోజు బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్‌ విడుదల అవుతుంది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్‌డేకి రిలీజ్‌ అవ్వడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి బాలయ్య ఇస్తున్న ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను’ అన్నారు హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌(Pragya Jaiswal ). బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగ్యా జైస్వాల్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.

బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమా చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీను గారు అఖండ కథ చెప్పి, అంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించి, నా సినీ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు డాకు మహారాజ్( Daaku Maharaaj Movie) లాంటి మరో మంచి సినిమాలో బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుందని, ఈ చిత్రంలోని నా పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను.

డాకు మహారాజ్ లో నేను నేను కావేరి పాత్ర పోషించాను. నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర ఇది. డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు బాగుంది. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.

బాబీ(bobby kolli) గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. మంచి మనిషి. సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. బాబీ గారు కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలకృష్ణ గారిని సినిమాలో చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.

మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో తమన్(ss thaman) గారు ఒకరు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఆయన సంగీతం మరింత గొప్పగా ఉంటుంది. 'డాకు మహారాజ్' చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. నాకు ది రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ఎంతగానో నచ్చింది. దబిడి దిబిడి, చిన్న సాంగ్స్ కూడా బాగున్నాయి. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది.

ఎస్.ఎస్. రాజమౌళి గారు, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలు పోషించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలని ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement