Shraddha Srinath
-
సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు వచ్చేవి
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్‌తో ఈ 14న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పుడూ రిక్వెస్ట్‌లు వచ్చేవి. ఒక రోజు సిద్ధు ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా రిలీజ్‌కి వేలంటైన్స్ డే పర్ఫెక్ట్ టైమ్. నేను ఆడియన్స్‌కు డిఫరెంట్ కథలు చూపించేందుకు ఇష్టపడతాను. కథ ఎంత కొత్తగా ఉంది? ఆడియన్స్‌కు మనం ఏం చెబుతున్నాం? అనేది కూడా చూస్తాను’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసి ఉంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఈ సినిమాతో అందరూ రిలేట్ అవుతారు’’ అని పేర్కొన్నారు రవికాంత్. -
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
-
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్ బాబీ ఓ మంచి మాస్ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ పవర్ఫుల్ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్ బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్ పడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 3.25 రేటింగ్ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్ మంచి మాస్ ఎంటర్టైనర్.కానీ సెకండాఫ్ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్ కాంబో మరోసారి సాలిడ్ మాస్ మూమెంట్స్‌ని అందించారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను సెట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025 -
చిరంజీవి, బాలకృష్ణ..ఇద్దరు పని రాక్షసులే: బాబీ
‘నేను చిరంజీవి(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ ఇద్దరితో కలిని పని చేశాను. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. నిర్మాలతకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటింరు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 12) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. 'నరసింహానాయుడు', 'సమరసింహారెడ్డి' తర్వాత 'సింహా' ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.→ హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.→ నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు 'డాకు మహారాజ్'తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.→ ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.→ రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.→ నిర్మాత నాగవంశీ, బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.→ బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. -
స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్
‘‘ఏ సినిమాలోనైనా నా స్క్రీన్ టైమ్ గురించి నేను ఆలోచించను. మనసుకి నచ్చి చేసిన పాత్రకు ఓ నటిగా వంద శాతం న్యాయం చేశామా? లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. ‘డాకు మహారాజ్’ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా... ఇలా మిగతా పాత్రలు కూడా ముఖ్యంగానే ఉంటాయి’’ అన్నారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(shraddha srinath). బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) మూవీలో నందిని అనే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశాను. చాలా ఓర్పు ఉన్న పాత్ర. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది.→ నా గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం నాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పాను. ఈ మూవీలో బాలకృష్ణ, బాబీ డియోల్గార్లతో నటించాను. నటిగా కొత్త విషయాలు నేర్చుకున్నాను.→ సెట్స్ లో బాలకృష్ణ అందరితో సరదాగా ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.→ నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.→ బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.→ సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘జెర్సీ’ మూవీ చేశాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చేశాను. ‘జెర్సీ’లో నేను చేసిన సారా, ‘డాకు మహారాజ్’లోని నందిని... ఈ రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.→ ఇక పదేళ్లుగా ఇండస్ట్రీలో స్థిరంగా రాణిస్తున్నాను. కేవలం ఇది లక్ మాత్రమే కాదు... నా పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఓ నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా పొన్నియిన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ మూవీలో నటించాలని ఉంది. -
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కలియుగమ్ 2064.. వచ్చే నెలలోనే రిలీజ్
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064’’. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధం కానుంది. అసలే కలియుగమ్.. ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబోతున్నారు? ఎలా చావబోతున్నారు? అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల విడుదల చేశారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే దక్షిణాది భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్ర పోషించారు.ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నార్వేలో చేశారు. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరమని, ఇది యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు. -
ఆ టైమ్‌లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. -
ఆ హీరోయిన్ నో చెప్పడంతో బాధపడ్డా: విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్లో విశ్వక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెప్తూనే శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.ఫలక్‌నుమా దాస్ సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్‌నే తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.చదవండి: ‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు -
‘మెకానిక్ రాకీ’ఈవెంట్లో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్‌గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్‌లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది. -
గులాబీలు గుప్పే పిల్లడే...
‘‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే...’ అంటూ మొదలవుతుంది ‘మెకానిక్ రాకీ’ సినిమాలోని ‘గుల్లేడు గుల్లేడు...’ పాట. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ‘గుల్లేడు గుల్లేడు..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జేక్స్ బిజోయ్ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ‘జాతి రత్నాలు’ దర్శకుడితో... మంగళవారం విశ్వక్ 13వ సినిమా ప్రకటన రాగా, బుధవారం ఆయన 14వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
'మెకానిక్ రాకీ' కోసం సింగర్ మంగ్లీ సాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. 'నడుము గీరుతూ..' అంటూ సాగే ఈ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ రచించగా సింగర్ మంగ్లీ ఆలపించారు. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. -
'మెకానిక్ రాకీ' గ్లింప్స్.. ఎల్ అంటే సరికొత్త చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్‌ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
Shraddha Srinath: గెటప్ శ్రీను భార్య.. తర్వాత వెంకీతో లవ్.. సైంధవ్‌లో మెప్పించిన బ్యూటీ (ఫోటోలు)
-
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్‌కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్‌లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్‌గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్‌తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్‌తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్‌ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్‌తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్‌కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్‌గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
‘జెర్సీ’భామ సినీ జర్నీ..ఎల్ఎల్బీ పట్టా పొంది సినిమాల్లోకి
శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు.. ► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకుంది. ► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్‌గా పనిచేసింది. ► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్‌కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్‌ను ఆమె సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌నూ అందుకుంది. ► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది. ► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్‌ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్‌తెర చాన్స్లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్ -
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఇంతకుముందు సరైన సినిమాలు చేయలేకపోయా.. ఆ బాధే..: హీరో
నటుడు విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ శ్రద్ధా శ్రీనాథ్, సానియా అయ్యప్పన్, అపర్నిధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. ఎస్సార్ ప్రభు తన పొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించాడు. యువరాజ్ దయాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం గోకుల్, సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఇళ్లల్లో తాత శివాజీ గణేషన్ ఫోటో ఉంటుందన్నారు. ఈ ఇరుగప్పట్రు చిత్రం కూడా అలా ప్రతి ఇంటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కొన్ని సరైన చిత్రాలు ఇవ్వలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశానని.. ఆ విచారమే ఈ చిత్ర విజయానికి కారణమని పేర్కొన్నారు. దర్శకుడు యువరాజ్ దయాళన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలైన అక్టోబర్ 6న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సంఘటన జరిగిందన్నారు. సాధారణంగా భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు బాగా ఆడతాయా, ఆడవా అని ఆలోచించకుండా చేస్తామన్నారు. అయితే ఎవరైనా కులచిత్రాలను నిర్మిస్తున్నట్లు తర్వాత చెబితే బాగా ఆలోచించి నిర్మించండి అని చెప్తానన్నారు. దాంతో చాలామంది తనపై ఆగ్రహించుకునేవారని చెప్పారు. అదేవిధంగా కరోనా కాలం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని, మంచి కథా చిత్రాలను యువత చూడడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కథ, కథనాలతో రూపొందిస్తే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా సక్సెస్ అవుతాయని తమ ఇరుగప్పట్రు చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. చదవండి: 'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం -
బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తమిళ మూవీ!
హీరో విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రద్ధ శ్రీనాథ్, అపర్ణతి, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్ దయాళ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్. ప్రభు తన పొటన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు. ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్గా 'జెర్సీ' బ్యూటీ
శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ నాని 'జెర్సీ' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 'విక్రమ్ వేద' మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేర్కొండ పార్వై' చిత్రంతో సత్తాచాటింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. తమిళంలో చేసిన కొత్త సినిమా 'ఇరుగపట్రు'. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, విధార్థ్, శ్రద్ధా శ్రీనాథ్, మహిమా నంబియార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత జనరేషన్ ఈగో సమస్యల కాన్సెప్ట్‌తోనే 'ఇరుగపట్రు' తీశారని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) -
ఏమవుతుంది?
ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కేఎస్ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె. రామ్‌చరణ్. -
Shraddha Srinath: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలియుగం మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
భార్యకు బహుమతిగా ఆ సినిమా.. స్టార్ హీరో కామెంట్స్!
మానగరం, మాన్స్టర్, టాణాకారన్ లాంటి డిఫరెంట్ హిట్ సినిమాలని నిర్మించిన పొటాన్షియల్ స్టూడియోస్ సంస్థ తీసిన కొత్త మూవీ 'ఇరుగప్పట్రు'. విక్రమ్‌ప్రభు, విధార్థ్, శ్రీ, శ్రద్ధాశ్రీనాథ్, సానియా అయప్పన్, అపర్నది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'ఎలి' ఫేమ్ యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) రిలీజ్ దగ్గరపడిన సందర్భంగా చైన్నెలోని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ టైలర్‌మేడ్ పాత్ర పోషించారని, ఈ మూవీ కోసం బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. నటుడు విధార్ధ్ పారితోషికం లేకుండానే ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారని తెలిపారు. నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. అక్టోబరు తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. అక్టోబరు 6 తన తాతగారు శివాజీగణేశన్ పుట్టినరోజు అని, అలానే తన భార్య పుట్టినరోజు కూడా అని చెప్పాడు. అందుకే ఆ చిత్రాన్ని తన భార్యకు బహమతిగా ఇస్తానని చెప్పానని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: 'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
అందుకే గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తున్నా: ‘జెర్సీ’ మూవీ హీరోయిన్
తన అందాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని నాని జెర్సి మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బ్యూటీ విక్రం వేదా చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయమైందిఈ బెంగళూరు బ్యూటీ. ఆ మూవీ విజయంతో ఆమెకు ఇక్కడ అనేక అవకాశాలు వచ్చాయి. అలా ఆమె అజిత్ కథానాయకుడుగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదేవిధంగా మాధవన్‌కు జంటగా మారా అనే చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. జెర్సీ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకుంది. అదేవిధంగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. చదవండి: ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పిన అల్లు అరవింద్ అయితే 2015లో నటిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇంకా స్టార్ ఇమేజ్ను మాత్రం పొందలేదనే చెప్పాలి. అదేవిధంగా చేతిలో ప్రస్తుతం పెద్దగా చిత్రాలు కూడా లేవు. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామర్ మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఫొటో షూట్ ఏర్పాటు చేసుకుని తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలను దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది. దీంతో వారు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల మాట్లాడుతూ తన అందమైన ముఖాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని అందుకే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. -
వార్నీ, అది కూడా రాదా? చెడుగుడు ఆడేసుకున్న హీరోయిన్
జెర్సీ సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు శ్రద్ధా శ్రీనాథ్. ఇవేకాదు.. ఆరట్టు, కృష్ణ అండ్ హిస్ లీల, విక్రమ్ వేద.. ఇలా మరెన్నో సినిమాలు చేసింది. అయితే ఓ మీడియా శ్రద్దా శ్రీనాథ్ ఫొటో షేర్ చేస్తూ శ్రద్దా దాస్ అని ప్రచురించింది. అది కాస్తా ఈ హీరోయిన్ కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది. 'వార్నీ, అన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మీకు నా పేరు కూడా సరిగా రాయడానికి రావట్లేదా?' అని మండిపడింది. ఇక తన పేరును సరిగ్గా పలుకుతున్నవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 'నా పేరును సరిగా ఉచ్ఛరించేవారిని అభినందిస్తున్నాను. మీ కీబోర్డ్‌లో దాస్ లేదా కపూర్ అని చూపించినా శ్రద్దా శ్రీనాథ్ అని సరిగ్గా టైప్ చేస్తున్నారంటే అది మీరు నామీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్‌లో నా పేరును శ్రద్దా రామా శ్రీనాథ్ అని మార్చుకున్నాను. ట్విటర్లో కూడా ఇలాగే మార్చుకుంటే బెటరేమో.. రామా మా అమ్మ పేరు. కాబట్టి ఇకపై నన్ను శ్రద్దా రామా శ్రీనాథ్ అనే పరిచయం చేసుకుంటాను. మీరే చూస్తారుగా!' 'ఇక దీని గురించి మీరేం చింతించకండి. నన్ను శ్రద్దా దాస్ అనో శ్రద్దా కపూర్ అనో కాకుండా కేవలం శ్రద్దా శ్రీనాథ్ అని పిలవండి చాలు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు నా పేరు కూడా సరిగా రాయడం లేదు. బహుశా మీరు జర్నలిజం స్కూలులో పెద్దగా క్లాసులు వినకపోయి ఉండొచ్చు, కానీ ఇకనైనా నా పేరు కరెక్ట్‌గా రాయండి. సరే మరి, మరో నాలుగు నెలల వరకు నేను ట్విటర్‌కు బ్రేక్ ఇస్తున్నాను' అంటూ వరుస ట్వీట్లు చేసింది శ్రద్దా శ్రీనాథ్. I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved. — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 Okay enough Twitter for the next 4 months thank you for your sassy replies byeeee — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే? ఎంత బిజీగా ఉన్నా నా ఇద్దరు మాజీ భార్యలను తప్పకుండా కలుస్తా.. -
Fashion: శ్రద్ధ శ్రీనాథ్ ధరించిన ఈ డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?
పింక్ సల్వార్... ముత్యాల లోలాకులు.. గాజులతో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టే ఉంటారు. ‘మేమూ జెర్సీ సినిమా చూశాం లెండి’ అంటారా! అవునవును.. ఆ చిత్ర కథానాయికే ఈమె.. శ్రద్ధ శ్రీనాథ్. తెలుగుతోపాటు తన మాతృ భాష కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాల్లో తాను మెచ్చిన పాత్రలకే ఓకే చెప్తుంది. వాసికే ఆమె ప్రాధాన్యం. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టించుకునేది కాదుట. సినిమాల్లోకి వచ్చాకే ఫ్యాషన్ మీద శ్రద్ధ పెరిగింది అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్ ఫాలో అయ్యే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... రా మ్యాంగో చేనేతకు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్ ఇది. ఫ్యాషన్ ప్రపంచంలో దీని ప్రయాణం 2008లో మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వారణాసి మొదలైన ప్రాంతాల్లోని చేనేత కళతో అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను డిజైన్చేయడం రా మ్యాంగో ప్రత్యేకత. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: రా మ్యాంగో ధర: రూ. 32,800 BCOS ఇట్స్ సిల్వర్ బి అంటే బ్రాస్.. సీఓ అంటే కాపర్.. ఎస్ అంటే సిల్వర్... మొత్తంగా బికాజ్ ఇట్స్ సిల్వర్ బ్రాండ్. 2010లో.. ఇంట్లో మొదలై ఈ రోజు బెంగళూరులోని అతి పెద్ద జ్యూయెలరీ షో రూమ్ స్థాయికి ఎదిగిందీ బ్రాండ్. ఫ్లారెన్స్ ఎస్తర్, ప్రిసిల్లా పాల్, సిండ్రెల్లా రెంజి.. ఈ ముగ్గురు దీని వ్యవస్థాపకులు. ఆధునిక మహిళల అవసరాలు.. ఆలోచనలు.. అభిరుచులకు నాణ్యత, కళను మేళవించి రూపుదిద్దుకునేవే ఆఇౖ ఇట్స్ సిల్వర్ డిజైన్స్. ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. జ్యూయెలరీ బ్రాండ్: BCOS ఇట్స్ సిల్వర్ ధర: రూ. 14,430 అందం, ఆరోగ్యం రెండూ వేర్వేరు కాదు. ఆరోగ్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టిపడుతుంది. అందుకే నా దృష్టిలో ఆరోగ్యమే అందం! – శ్రద్ధ శ్రీనాథ్ చదవండి: Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ! -
పాన్ ఇండియా సినిమాలో జెర్సీ హీరోయిన్.. ఫస్ట్‌లుక్ విడుదల
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన తారాగణంగా నటించిన బహుభాషా చిత్రం ‘విట్ నెస్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ వెంకటేశ్ నిర్మించారు. ఈ సినిమాకు దీపక్ దర్శకత్వం వహించడంతో పాటు కెమెరామేన్ బాధ్యతలు నిర్వహించారు. మే డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘విట్ నెస్’ చిత్రంలో మంచి ఆశయం కోసం పోరాడే ఆర్కిటెక్ట్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: రమేష్ తమిళమణి. With the world of conservancy workers at its center, the movie WITNESS presents a never-seen-before view of metropolitan cities and the invisible corridors of power lying underneath them.#WITNESS First Look pic.twitter.com/JxyBweGxam — Shraddha Srinath (@ShraddhaSrinath) May 1, 2022 -
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ సూపర్ లుక్ (ఫొటోలు)
-
హీరోయిన్‌కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్‌స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్‌పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్‌స్టా గ్రామ్‌లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!
తెలుగులో ఎప్పుడూ ముంబయ్ భామలదే హవా. ఆ తర్వాత మలయాళ బ్యూటీలది. బెంగళూరు భామలు ఇక్కడ తక్కువే. అప్పట్లో సౌందర్య ఓ వెలుగు వెలిగారు. తర్వాత అనుష్క కూడా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. ఇలా అప్పుడప్పుడూ ఒకరిద్దరు వస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కన్నడ భామలు అరడజను పైనే తెలుగుకి వచ్చారు శాండల్‌వుడ్ నుంచి వచ్చిన చందన పరిమళాలు రష్మికా మందన్నా, నభా నటేశ్, కృతీ శెట్టి, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, రచితా రామ్, కావ్యా శెట్టి చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రష్మికా మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దక్కిన చాన్స్ రష్మిక కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మికాయే హీరోయిన్. తెలుగులో ఆమె సంపాదించుకున్న క్రేజ్ బాలీవుడ్ వరకు చేరింది. హిందీలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ (అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, మరో సినిమా ప్రకటన త్వరలో రానుంది) రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకోవడం ఏ కొందరికో కుదురుతుంది. కృతీ శెట్టి ఈ కోవలోకే వస్తారు. ‘ఉప్పెన’ ద్వారా పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందే నానీతో ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్న కృతి ఇటీవల రామ్ కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యారు. మరో తెలుగు సినిమాకు కూడా కృతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు కృతీ శెట్టి. మరోవైపు కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీ లీల. అలాVó హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీ లీలయే కథానాయిక. సేమ్ కృతీ శెట్టి మాదిరిగానే తెలుగులో తనది ఒక్క సినిమా విడుదల కాకుండానే శ్రీ లీల రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. ఇక హైదరాబాద్‌లో పుట్టి నప్పటికీ బెంగళూరులోనే పెరిగారు కథానాయిక నభా నటేష్. ఆమె మాతృభాష కన్నడ. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ నభా ఖాతాలో ఉంది. ప్రస్తుతం నితిన్ ‘మ్యాస్ట్రో’ (హిందీ చిత్రం ‘అంధాధున్’ తెలుగు రీమేక్)లో నభా నటేష్ హీరోయిన్. జాతీయ అవార్డు సాధించిన నాని ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కొత్త అయినప్పటికీ రచితా రామ్ శాండల్‌వుడ్‌లో పాపులర్ హీరోయిన్. ‘సూపర్ మచ్చి’తో ఆమె తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఇందులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరో. కన్నడంలో మంచి ఫామ్‌లో ఉన్న మరో బ్యూటీ కావ్యా శెట్టి కన్నడ హిట్ ‘లవ్ మాక్ౖటైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా.. శీతాకాలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్. చూశారుగా.. ఇప్పుడు తెలుగులో చందన పరిమళం ఎక్కువగా వీస్తోంది. శాండల్‌వుడ్ నుంచి ఇంకెంతమంది కథానాయికలు వస్తారో చూడాలి. -
నటుడిగా మారిన రెహమాన్
సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్ రెహమాన్. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్ నటుడిగా మారారు. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్ డైరెక్టర్. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది. చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
లోకం ఎలా ఉంది నాయనా?
మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్‌గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
వచ్చే ఉగాదికి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా
‘‘స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు.. తప్పకుండా వచ్చే ఏడాది ఉగాదికి నా స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలవుతుంది’’ అన్నారు హీరో విశాల్. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విశాల్ చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలో నటించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ– ‘‘డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎంఎస్ ఆనందన్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. నా తమ్ముడు యువన్ శంకర్ రాజా మంచి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా తమ్ముడు వరంగల్ శ్రీను సహా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ‘విశాల్ చక్ర’ తో తప్పకుండా జాక్ పాట్ కొడతారు’’ అన్నారు. ఎంఎస్ ఆనందన్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది విశాల్‌గారే. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రతి సీక్వెన్స్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. నాకు తెలుగు సినిమా అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం.. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను. దర్శకుడు రాజమౌళిగారు అరంటే చాలా ఇష్టం ’’అన్నారు. ‘మిస్ ఇండియా’ దర్శకుడు నరేంద్రనాథ్, పవన్‌తేజ్ కొణిదెల, మేఘన, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శోభన్ తరుపున నరసింహసాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమనియం. -
పట్టరాని సంతోషంలో ఇద్దరు హీరోయిన్లు!
అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరితే ఆనందంతో ముఖం కళకళలాడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్లు కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకున్నారు. నాజూకు సుందరి కృతీకి ఎప్పటినుంచో బైక్ నడపాలని కోరిక. బైక్ బరువైనా మోయగలుగుతావా? అని స్నేహితులు సరదాగా అంటే, ‘మీరే చూద్దురుగానీ’ అన్నారామె. అనడమే కాదు.. నేర్చేసుకుని రయ్ రయ్‌మంటూ ద్విచక్ర వాహనాన్ని నడిపేశారు కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’లో నటిస్తున్నారు కృతీ సనన్. ఈ షూటింగ్ లొకేషన్లో కాస్త గ్యాప్ దొరకడంతో బైక్ నడిపారు. ‘ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావ్?’ అని ఓ ఫ్రెండ్ అడిగితే ‘ఇవాళే మొదలుపెట్టాను. నేర్చేసుకున్నాను’ అన్నారు కృతీ సనన్. దీన్నిబట్టి ఈ బ్యూటీ ఎంత త్వరగా నేర్చేసుకున్నారో ఊహించవచ్చు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వద్దాం. విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు... ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకుంటారు శ్రద్ధా. హాలిడే కోసం ఇటీవల ఓ రిసార్ట్‌కి వెళ్లారామె. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ‘ఎప్పటినుంచో ఓ కుండ తయారు చేయాలనుకున్నా. ఇదిగో చేసేశా’ అంటూ ఫొటో షేర్ చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బైక్ నడిపినందుకు కృతీకి, కుండ తయారు చేసినందుకు శ్రద్ధాకి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో) -
ముప్ఫై ఏళ్లు ముందుకు...
2020 నుంచి ఏకంగా ముప్ఫై ఏళ్లు ముందుకు వెళ్లి 2050లోకి అడుగుపెట్టబోతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఎందుకు అంటే? ఆమె అంగీకరించిన తాజా చిత్రం ‘కలియుగం’ కథ 2050 నేపథ్యంలో సాగుతుంది. ‘జెర్సీ’లో మంచి నటన కనబరచిన శ్రద్ధా ఈ చిత్రకథ వినగానే అంగీకరించారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రమోద్ సుందర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. అంత గొప్పగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘అద్భుతమైన కథతో హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా ఉంటుంది. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం. 2050 బ్యాక్‌డ్రాప్ కాబట్టి సెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అసిస్టెంట్ రామ్‌చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు. -
ఐఏఎస్ ఆఫీసర్‌గా..
‘జెర్సీ’ చిత్రంలో మిడిల్‌క్లాస్ హౌస్‌వైఫ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా ఐఏఎస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘పులిమురుగన్’ ఫేమ్ బి. ఉన్నికృష్ణన్ దర్శకుడు. శ్రద్ధాకు ఫోన్లో ఈ కథను చెప్పారట దర్శకుడు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఎక్కువ డేట్స్‌ను ఈ సినిమాకు కేటాయించారట శ్రద్ధా. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విశాల్‌తో ‘చక్ర’, మాధవన్‌తో ‘మారా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో శ్రద్ధా శ్రీనాథ్ బిజీ బిజీగా ఉన్నారు. -
నరుడి బ్రతుకు నటన
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి వీరిద్దరూ జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నటించనున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా దీపావళికి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. హెడ్‌ఫోన్స్, హార్ట్ సింబల్.. ఓ జంటతో ఈ ప్రచార చిత్రాన్ని డిజైన్ చేశారు. మామూలుగా హార్ట్ సింబల్ ఎరుపు రంగులో ఉంటుంది. కానీ నీలం రంగులో కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, సంగీతం: కాలభైరవ, కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
ఓటీటీలోనే మారా!
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’. నూతన దర్శకుడు దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్. దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రను మాధవన్ చేశారు. హీరోయిన్ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. లాక్డౌన్ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందట. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. -
టొరంటో చిత్రోత్సవంలో జెర్సీ
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గతేడాది విడుదలైన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో పలు ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రబృందం మరో తీపి కబురు అందుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘‘మన దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కెనడాలో మా చిత్రం ప్రదర్శితం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఇదిలా ఉంటే ‘జెర్సీ’ హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా ఈ రీమేక్‌ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. -
ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?
సాధారణంగా హీరోలు వివాహం తర్వాత కూడా కథకు అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. పెళ్లనేది వారి అవకాశాలకు అడ్డుకాదు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. పెళ్లయిందంటే చాలు.. అవకాశాలు తగ్గుతాయి. ఇక రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే ‘పెళ్లయ్యాక కూడా ఇలాంటి సీన్లు చేయడం ఏంటి?’ అని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. దీనిపై కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ (‘జెర్సీ’ ఫేమ్) సోషల్ మీడియా వేదికగా ఓ చర్చకు తెరతీశారు. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆమె ఇంకా మాట్లాడుతూ –‘‘నా ఫ్రెండ్, నటి త్వరలో వివాహం చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత కూడా తను నటిస్తుందా? అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తి అడిగారు. అది కూడా చాలా నిర్లక్ష్యంగా. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాను. తను అలా అడగడం నాకు కోపం తెప్పించడంతో పాటు నన్ను ఆలోచనలో పడేసింది. వివాహం అయిన నటులు రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కాదు. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఆమె పోస్ట్‌కి పలువురు ఫాలోయర్స్ స్పందిస్తూ –‘‘మీరు చెప్పింది కరెక్ట్. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా? ఒక నటిని అలాంటి ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదు. పెళ్లయితే యాక్టింగ్ మానేయాలనో, ఫలానా సీన్స్‌లో నటించకూడదనో అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం సరికాదు. వారి ఇష్టానికి తగ్గ పాత్రలు చేసుకోవచ్చు’ అని సమాధానమిచ్చారు. సమాధానం అవుదాం – హితా శ్రద్ధా శ్రీనాథ్ పోస్ట్‌కి కన్నడ నటి హితా కూడా సమాధానమిస్తూ –‘‘పెళ్లైన తర్వాత కూడా నటిస్తారా? అంటూ లెక్కలేనన్ని సార్లు నన్ను అడిగారు. నా వైవాహిక జీవితానికి, నా వృత్తికి ఎటువంటి సంబంధం లేదని నేను ఎప్పుడో చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిశాక దర్శకులు నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. అయితే పెళ్లి అనేది నా పనిని మాత్రం కొనసాగించకుండా ఆపలేదు. ప్రతిభను కోరుకునే వ్యక్తులు ఎలాగైనా నాలోని ప్రతిభని గుర్తిస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి, అలాంటి అర్థం లేని ప్రశ్నలకు మనం సమాధానంగా నిలబడాలి’’ అన్నారు. గత ఏడాది హితా వివాహం జరిగింది. -
‘జెర్సీ’ మూవీ హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్ ఫోటోలు
-
'హిందూ దేవుళ్లను కించపరుస్తున్న నెట్‌ఫ్లిక్స్'
కృష్ణ అండ్ హిజ్ లీల.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే వ్యక్తి అనేక మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ దేవత పేరు పెట్టుకున్న రాధను కూడా బాధితురాలిగా చూపించారని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలకు హిందూ దైవాల పేర్లు వినియోగించడమే కాక, హిందూ మతాన్ని కించపరిచే వాటిని ప్రోత్సహిస్తుందంటూ నెట్‌ఫ్లిక్స్‌పై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. దీంతో ట్విటర్లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది. (‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ ఫస్ట్‌లుక్ టీజర్) "ఇంతకుముందు వచ్చిన సాక్క్డ్ గేమ్స్, లైలా, ఘౌల్, ఢిల్లీ క్రైమ్ వంటి పలు వెబ్ సిరీస్‌లు హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించింది. ఇప్పుడొచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల కూడా హిందూ దేవుళ్లను కించపరుస్తోంది", "మా డబ్బుతో, మా విశ్వాసాలకు వ్యతిరేకంగా వెబ్ సిరీస్‌లు తీసేందుకు నెట్ఫ్లిక్స్కుఎంత ధైర్యం? ఒక మనిషిని చంపడం కన్నా వారి నమ్మకాన్ని చంపడమే పెద్ద నేరం. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించం" అంటూ నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం దీనిపై మీమ్స్ చేస్తూ సమస్యను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన "కృష్ణ అండ్ హిజ్ లీల" చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. శ్రద్దా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. (మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ హ్యాక్!) -
ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ
‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ అనే ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. View this post on Instagram Krishna’s #FirstLove, Satya!! #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 22, 2020 at 4:33am PDT చిత్రంలో ప్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హఫ్ ఆఫ్ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్) View this post on Instagram Radha the other half of Krishna! #HalfOfKrishna #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 23, 2020 at 3:52am PDT -
ఆట మొదలైంది
విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ లుక్‌లో విశాల్ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్ చెప్పే డైలాగ్‌తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్ దోపిడీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్ విజయ్, సృష్టి డాంగే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం. -
అరచేతి సిందూరం
రక్తం ఆడపిల్లల్ని భయపెట్టదు. రక్తంతో సహజీవనం వాళ్లది!! మగపిల్లలే.. రక్తమంటే కళ్లు మూసుకుంటారు. పడి, దెబ్బలు తగిలినప్పుడే.. ఈ ధీశాలురు రక్తాన్ని చూడటం. ఇక పీరియడ్ బ్లడ్ అయితే.. అదొక ‘స్త్రీ గ్రూప్’ బ్లడ్ వీళ్లకు. ‘‘ఛుక్ చుక్ రైలు వస్తోంది.. దూరం దూరం జరగండి..’’ మెన్ కూడా బాయ్సే ఈ స్టేషన్లో! ఎలా వీళ్లతో కలిసి ప్రయాణించడం? ‘అరచేతి సిందూరం’తో గోప్యాల చీకట్లను పోగొట్టడమే. తెలియనివాళ్లకు తెలియజెప్పడం దేనికి? మొదట వచ్చే ప్రశ్న! నిజమే కదా.. పూర్తిగా వ్యక్తిగత విషయం అయినప్పుడు.. ‘నేను పీరియడ్స్‌లో ఉన్నాను’ అని అరిచేతిలో ఎర్రచుక్క పెట్టుకోవడం దేనికి.. గుసగుసల్ని రేపడానికి కాకపోతే?! అయితే గుసగుసలు లేకుండా చెయ్యడానికే ‘యూనిసెఫ్’.. రెడ్ డాట్ ఛాలెంజ్‌ని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’ కి సరిగ్గా రెండు నెలల ముందు ఈ ఏడాది మార్చినెలలో మొదలుపెట్టింది. రెడ్ డాట్ చాలెంజ్ అంటే నెలసరి రోజుల్లో అరిచేతిలో ఎర్ర చుక్కపెట్టుకోవడం. మహిళలంతా దీన్నొక నియమంగా పాటిస్తే కొన్నాళ్లకు, లేదా కొన్నేళ్లకు అదొక మామూలు సంగతైపోయి, మెన్సెస్ చుట్టూ పురుషులలో, మగపిల్లల్లో, కొందరు మహిళల్లో కూడా ఉండే అపరిశుభ్రమనే భావనలు తొలగిపోతాయని! యూనిసెఫ్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ని మొదట నేహా దుపియా, దియా మీర్జా స్వీకరించారు. తర్వాత డయానా పెంటీ, ఖుబ్రా సయాత్, మానుషీ చిల్లర్, అనితా ష్రాఫ్, అతిదీరావ్ హైద్రీ ఫాలో అయ్యారు. సెలబ్రిటీలు కాకుండా యూత్‌లో చాలామంది అమ్మాయిలు ఈ చాలెంజ్‌ని తీసుకుంటున్నారు. కొందరు ఆ చాలెంజ్‌ని నేరుగా తీసుకోనప్పటికీ తమ ‘తొలిసరి’ అనుభవాలను, ఇబ్బందులను షేర్ చేసుకుంటున్నారు. పెద్ద సెక్సెస్.. ఈ రెడ్ డాట్ చాలెంజ్! మే 28 న మెన్స్ట్రువల్ హైజీన్ డే రోజు సోషల్ మీడియాలోని అన్ని వేదికల మీదా అరచేతి సిందూరాలు గోరింటలా పూచాయి. మూడు రోజుల క్రితం శ్రద్ధా శ్రీనాథ్ తన రెడ్ డాట్ డే గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. శ్రద్ధ ఫెమినిస్టు. మగవాళ్లలో స్త్రీల సమస్యల పట్ల సహానుభూతిని (సానుభూతి కాదు) కలిగించే అనేక విషయాలను సోషల్ మీడియాలో ఆమె వివరంగా మాట్లాడుతుంటారు. శ్రద్ధ కశ్మీరీ అమ్మాయి. సినీ నటి. నాలుగు దక్షిణాది భాషా చిత్రాలలో నటించారు. తెలుగులో జెర్సీ, జోడీ íసినిమాల్లో ఉన్నారు. తను నటిస్తున్న మరో ఆరు సినిమాలు లాక్డౌన్ సడలింపులతో మళ్లీ షూటింగ్‌కి రెడీ అవుతున్నాయి. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఫెమినిస్టుగానే శ్రద్ధకు సోషల్ మీడియాలోనే గుర్తింపు. అసలు తనను తన ఫస్ట్ పీరియడే ఫెమినిస్టుగా మార్చిందని అంటారు శ్రద్ధ. ‘‘అప్పుడు నాకు 14 ఏళ్లు. ఇంట్లో పూజ జరుగుతోంది. పూజలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అప్పుడు నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది. పక్కన అమ్మ లేదు. శానిటరీ ప్యాడ్స్ లేవు. పూజలో ఉన్న పిన్నిని మోచేత్తో పొడిచి విషయం చెప్పాను. చెబుతున్నప్పుడు పిన్ని పక్కనే ఉన్న బంధువులావిడ విని, నా వైపు చూసి నవ్వింది. ‘పర్వాలేదు చిన్నా, దేవుడు క్షమిస్తాడు’ అని అభయం ఇచ్చింది! ఆమె ఉద్దేశం.. పూజలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినందుకు దేవుడు కోపగించుకోడని, క్షమిస్తాడని. అప్పుడే నేను ఫెమినిస్టుగా మారాను. నాన్–బిలీవర్గా కూడా’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు శ్రద్ధ. ఇంట్లో చేసి పెడుతుంటే.. బాగున్నాయి అనో, బాగోలేదనో అనడం మాత్రమే మనకు తెలిసింది. ఆ చేసిపెట్టేవాళ్లకు ఒంట్లో ఎలా ఉందోనన్న ఆలోచన మరో స్త్రీకి మాత్రమే వస్తుంది. ఆఫీస్‌లలో, ఇంకా కలిసి పని చేసే అనేక చోట్ల కూడా అంతే. ఏ రోజైనా పని సరిగా చేయలేక పోతుంటేనో, అసలే చెయ్యలేక పోతుంటేనో అంతవరకే కనిపిస్తుంది. అందుకు కారణం పైకి తెలిసేది కాదు, చెప్పుకునేదీ కాదు. అయితే ఈ గోప్యనీయత వల్ల ప్రయోజనం ఉండదు అంటుంది యూనిసెఫ్. ‘నేను పీరియడ్స్ లో ఉన్నాను’ అని సంకేత పరచకపోవడంవల్లే కావచ్చు.. మహిళల పని సామర్థ్యంపై అపోహలు, పీరియడ్స్ చుట్టూ ఇన్ని అస్పృశ్య ఆలోచనలు! వీటిని పోగొట్టడానికి రెడ్ డాట్ ఛాలెంజ్‌లు, శ్రద్ధ వంటì æవారి సొంత అనుభవాల పోస్టింగ్‌లు తప్పకుండా తోడ్పడతాయి. -
సుదీప్‌కు జోడీ
సౌత్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్. తాజాగా కన్నడలో మరో సినిమాకు సై అన్నారీ బ్యూటీ. సుదీప్ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్‌వుడ్ టాక్. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్’తో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!
చెన్నై : ఎలా ఉండే తాను ఇలాగయ్యానని అందం కోసం తను పడినపాట్లు గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్ ఏకరువు పెట్టింది. ఈ కన్నడ భామ మాతృభాషలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తోంది. కన్నడంలో యూటర్న్ చిత్రంతోనూ, టాలీవుడ్లో జెర్సీ చిత్రంలోనూ పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్‌లో విక్రమ్ వేదా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనా«థ్ ఆ తరువాత కే–13, నేర్కొండపార్వై చిత్రాల్లో నటించింది. విశాల్ సరసన ఇరుంబుతిరై–2 చిత్రంలో నటించడానికి సిద్ధంఅవుతోంది. ఈ అమ్మడు బాగా లావుగా ఉన్న తన ఒకప్పటి ఫొటోనూ, ఇప్పటి ఫొటోనూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఆ కథేంటో చూద్దాం. అంతకుముందు... ఆ తర్వాత ’అది నేను అంతర్జాతీయ విహారయాత్ర చేసిన రోజులు. న్యాయశాఖలో పని చేశాను. ఆ వృత్తిలో ఏడాది గడిచింది. అప్పుడు ఇంతకు ముందెప్పుడూ చేయనంత ఖర్చు చేయడం ప్రారంభించాను. అంటే ఆహారం, దుస్తులు, సినిమాలు చూడడం వంటి అన్ని విషయాలకు ఎడాపెడా ఖర్చు చేసేదాన్ని. చేతినిండా ఆదాయం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేశాను. నెలకొకసారి మాత్రమే శరీరవ్యాయామం చేసేదాన్ని. నచ్చింది తినేసేదాన్ని. దీంతో బరువు పెరిగిపోయాను. నచ్చిన దుస్తులు ధరించేదాన్ని. అంతే కాదు నన్ను నేనెప్పుడూ అందం తక్కువగా భావించేదాన్ని కాదు. అప్పట్లో పలు వ్యక్తిగత సంతోషాలు నాలో ఉండేవి. అయితే నా బద్ధకం కారణంగా అవేవీ అనుభవించలేకపోయాను. అప్పుడు తీసుకున్న ఫొటోను చూసినప్పుడు ఇంత పరువ వయసులోనే అంత బరువు ఉండకూడదన్నది గ్రహించాను. దీంతో అపార్టుమెంట్లోనే ఉన్న జిమ్‌కు వెళ్లడం మొదలెట్టాను. మొదట్లో ఐదు నిమిషాలు, ఆ తరువాత 15 నిమిషాలు. ఆపై గ్యాప్ లేకుండా 40 నిమిషాలు పరుగులు పెట్టాను. అలా ఐదేళ్లలో 18 కిలోల బరువు తగ్గాను. అందుకు చాలా శ్రమించాను. నిజానికి నేనంత ఫిట్నెస్ కాదు. అయినా అంతగా వర్కౌట్లు చేశాను. క్యాలరీల గురించి, కసరత్తుల గురించి తెలిసింది. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. దీంతో క్రమబద్ధమైన ఆహారనియమాలకు, వ్యాయామాలకు మధ్య సమతుల్యతను పాటించలేకపోయాను. అయినా శ్రమించాను. నన్నిలా చేయిండానికి కారణం చాలా సింపుల్. నేను చూడడానికి అందంగా ఉండాలని భావించడమే. మీరు అందంగా ఉండడానికి హద్దులు అంటూ ఉండవు. సామాజిక మాధ్యమాలు భయాన్ని పెంచుతూనే ఉంటాయి. వాటి ప్రలోభాలకు గురి కాకుండా ఆరోగ్యం కోసం ఎంత వరకూ సాధ్యమో అంత వరకే కసరత్తులు చేయండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించండి. సామాజిక మాధ్యమాల కోసం ఎలాంటి శ్రమ తీసుకోవద్దు‘ అని నటి శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంది. -
కేవలం మీకోసం చేయండి
‘‘నాలుగేళ్ల క్రితం నేను ఉండాల్సిన దానికంటే కొంచెం బరువు ఎక్కువే ఉన్నాను. అలా ఉండటానికి నేనేం ఇబ్బంది పడలేదు. మునుపటి కంటే లుక్స్ పరంగా బావుండాలనే ఉద్దేశంతో వర్కౌట్ మొదలుపెట్టాను. ‘గుడ్ లుక్స్’కి అంతం అనేది ఉండదు’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. ఈ ఏడాది ‘జెర్సీ’ సినిమాలో తన నటనకు మంచి ప్రసంశలు పొందారు ఈ కన్నడ బ్యూటీ. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుత ఫొటోను, నాలుగేళ్ల క్రితం ఫొటోను పోస్ట్ చేసి శారీరకంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. ‘ ‘లాయర్‌గా ఉద్యోగం వచ్చి, 2014లో నా తొలి ఇంటర్నేషనల్ హాలిడేకు (బాలి) Ðð ళ్లినప్పుడు దిగిన ఫొటో అది. ఉద్యోగంతో నా లైఫ్ స్టయిల్ మారిపోయింది. నాకు నచ్చినంత తినేదాన్ని. నన్ను నేను బాగా కష్టపడి మోటివేట్ చేసుకొని నెలకోసారి జిమ్‌కి వెళ్లేదాన్ని. చేతులు బొద్దుగా ఉన్నాయి అని సంకోచించకుండా నాకు నచ్చిన దుస్తులు వేసుకునేదాన్ని. ఈ ఫొటో దిగిన కొన్నిరోజులకే మరీ చిన్న వయసులోనే ఇలా కనబడకూడదనే ఆలోచనతో జిమ్‌లో జాయిన్ అయ్యాను. ముందు ట్రెడ్మిల్ మీద 5 నిమిషాలు, ఆ తర్వాత 15 నిమిషాలు, ఆ తర్వాత బ్రేక్ లేకుండా 40 నిమిషాలు పరిగెత్తగలిగాను. రైట్లో ఉన్న ఫొటో 2019 డార్జిలింగ్‌లో దిగాను. ఐదేళ్ల తర్వాత 18 కిలోలు తగ్గా. పొట్ట ఇంకాస్త ఫ్లాట్‌గా ఉంటే బావుండూ, ఆ డ్రెస్‌లో అమ్మాయి ఇంకా బావుంది అనిపిస్తూనే ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అభద్రతాభావానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కోసం తగ్గండి. ఇంకొంచెం ఎక్కువకాలం మీ గుండె పని చేయడానికి, చివరి వరకూ మీ మోకాళ్లు మిమ్మల్ని మోసేవరకూ, అనారోగ్యం లేని శరీరం కోసం, హాయిగా నిద్రించగలిగే రాత్రుల కోసం.. ముఖ్యంగా మీకోసం చేయండి’’ అన్నారు. -
మరోసారి విలన్‌గా..
ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్ హీరోగా ఆనంద్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. -
‘జోడి’ మూవీ రివ్యూ
టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్‌లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్‌ల వేటలో వెనుకపడ్డాడు. ఇటీవల ఆది హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా ‘జోడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. మరి జోడితో అయినా ఆది సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ : కమలాకర్ రావు (నరేష్) బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్ (ఆది సాయి కుమార్). సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసే కపిల్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇన్సిస్టిట్యూట్‌లో పనిచేసే కాంచనమాల(శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్ అవినాష్ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు: కెరీర్ స్టార్టింగ్‌లోనే లవర్ బాయ్‌గా ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ కపిల్ పాత్రలో ఈజీగా నటించేశాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఒదిగిపోయారు. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ మరోసారి సూపర్బ్ అనిపించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. వెన్నెల కిశోర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన కడుపుబ్బా నవ్వించాడు. ఇతర పాత్రల్లో సత్య, శిజ్జు, గొల్లపూడి మారుతీరావు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది, ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడు. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల ప్రేమకథతో పాటు మంచి సందేశం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా కథను రెడీ చూసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా లవ్ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్‌గా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది. ఫణి కల్యాణ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : కథ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం రొటీన్ టేకింగ్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’
అత్యాచారం మాత్రమే నేరం కాదు అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది పచ్చి నిజం. ఇలా సంఘంలో జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్న వారిలో పలువురు మహిళలు వివాహంపై వివిధ రకాల భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెళ్లే చేసుకోను అని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు. ఇవన్ తందిరన్, విక్రమ్‌వేదా, నేర్కొండ పార్వై వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఈ శాండిల్‌వుడ్ భామ మాతృభాషలోనూ, తెలుగులోనూ నటిస్తోంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ అత్యాచారం మాత్రమే నేరమని చాలా మంది భావిస్తున్నారని, అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూస్తూ మాట్లాడడం, అనుసరించడం కూడా నేరమేనని అంది. అయితే అత్యాచారాల వ్యహారంలో సమాజంలో త్వరలోనే మార్పు వస్తుందని భావిస్తున్నానంది. ఎందుకంటే కాలంతో పాటు మహిళలు మారుతున్నారని, అయితే మహిళలపై సమాజం దృష్టే ఇంకా మారలేదని పేర్కొంది. తన తాతయ్య, బామ్మలకు 15 మంది పిల్లలని, తన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే జన్మనిచ్చారని చెప్పింది. ఇక తాను అసలు పిల్లలనే కనరాదని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా తన ఈ నిర్ణయంతో తానెలాంటిదాన్నో తీర్మానం చేయకండని, తన చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించాలని శ్రద్ధాశ్రీనాథ్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో జోడి అనే చిత్రంలోనూ కన్నడంలో గోద్రా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ఇరుంబుతిరై 2, మార చిత్రాల్లో నటించనుంది. -
ఇద్దరు భామలతో విశాల్
చెన్నై : విశాల్‌కు ఇద్దరు సెట్ అయ్యారు. నటుడు విశాల్ ఆయోగ్య చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. టైటిల్ చూస్తేనే తెలిసి పోతుంది ఇది పుల్ యాక్షన్ చిత్రమని. ఎంటర్టైన్ చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడైన సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన హిట్ చిత్రం ఇరుంబుతిరై ద్వారా పీఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటి సమంత హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్‌కు జంటగా నటి రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారన్నది తాజా సమాచారం. చెన్నై చిన్నది రెజీనా ఇంతకు ముందు పలు తమిళ చిత్రాల్లో నటించి సక్సెస్‌లు అందుకున్నా, స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించలేకపోయ్యింది. కండనాళ్ ముదల్ చిత్రంతో పరిచయ్యమై గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత అళగియ అసుర, పంచామృతం చిత్రాల్లో నటించినా అవి తన కేరీర్‌కు ఉపయోగపడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు విశాల్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం అయినా రెజీనాకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెడుతుందేమో చూద్దాం. ఇక శ్రద్దాశ్రీనాథ్ విషయానికి వస్తే వేదా చిత్రంతోనే తమిళ సినీ ప్రరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. ఇటీవల అజిత్‌తో నటించిన నేర్కొండ పార్వై చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ భామలు ఇద్దరూ విశాల్‌తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. కాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ ప్రస్తుతం శివకార్తీకేయన్‌తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విశాల్‌తో ఇరుంబుతిరై 2 చేయనున్నట్లు సమాచారం. -
అసలు సంగతి ఏంటి?
‘అస్సలు ఈ టైమ్‌లో ఇంత హైట్‌లో కూర్చుని బీరు కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది’ అంటూ ఆది సాయికుమార్ డైలాగ్‌తో విడుదలైన ‘జోడి’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జోడి’. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో భావన క్రియేషన్స్ పతాకంపై శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేమ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆది, శ్రద్ధల మధ్య అందమైన ప్రేమకథతో పాటు వీకే నరేష్ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆది, శ్రద్ధ లుక్స్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అవుట్ డోర్ ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా ఉన్న మా చిత్రానికి ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న మా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. గొల్లపూడి మారుతీరావు, సత్య, ‘వెన్నెల’ కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణికళ్యాణ్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్. -
స్పెషల్ రోల్
టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఏర్పడే అనర్థాలను చూపిస్తూ విశాల్ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) తీశారు. పీయస్ మిత్రన్ తీసిన ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఎళిల్ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో రెజీనా కనిపిస్తారని సమాచారం. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని తెలిసింది. విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’
ఆది సాయి కుమార్ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేస్ మరోసారి మంచి కామెడీతో పాటు బరువైన సెంటిమెంట్‌ను కూడా పండించారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కొత్తగా ఉన్నావు అంటున్నారు
‘‘నేను ఓ రియలిస్టిక్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న టైమ్‌లో విశ్వనాథ్ ఈ కథ గురించి చెప్పాడు. చాలా బాగుంది. మిమ్మల్ని ఈ సినిమాతో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా అనే నమ్మకముంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో విజయలక్ష్మీ నిర్మించారు. విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆమె చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ చిత్రం టీజర్ రిలీజయ్యాక అందరూ ఫోన్ చేసి ‘నువ్వు చాలా కొత్తగా ఉన్నావు’ అని అభినందించారు’’ అన్నారు. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో మొదౖలై ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నిర్మాత విజయలక్ష్మీ ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది అంటే, హీరో అది ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు. హీరోయిన్ శ్రద్ధా కథ వినగానే చేస్తున్నా అన్నారు. నరేశ్‌గారికి పాత్ర చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు ఫణికుమార్, నేను కొత్త ట్యూన్స్ కోసం ప్రయత్నించాం’ అన్నారు. శ్రద్ధా మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను మరచిపోలేను. ‘జోడి’ కథ వింటూ చాలాసార్లు నవ్వుకున్నాను’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలు మోహమాటంతో, కొన్ని సినిమాలు ఆ సినిమా స్పాన్ చూసి చేస్తాం. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో న చ్చి చేశాను’’ అన్నారు. ‘‘నేచురల్‌గా ఉండే సినిమా చేద్దాం అనుకున్నాను. విశ్వనాథ్ ఈ కథ చెప్పగానే ఆదిగారు కరెక్ట్ అనిపించి ఆయనకు చెప్పాం. కథ వినగానే ఆది ఓకే అన్నారు. శ్రద్ధా మా సినిమాకు ఎస్సెట్ అవుతుంది’’ అన్నారు విజయలక్షి. -
సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల
బుర్రకథ సినిమాతో రీసెంట్గా ఆడియెన్స్‌ను పలకరించిన ఆది సాయికుమార్‌కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్‌క్రియేట్ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇటీవలె టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
అలా చేశాకే అవకాశమిచ్చారు!
సినిమా: అలా చేసిన తరువాతనే అవకాశం ఇచ్చారు అని చెప్పింది నటి శ్రద్ధాశ్రీనాథ్. శాండిల్‌వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న ఈ కన్నడ భామ ఈ మూడు భాషల్లోనూ సక్సెస్‌లు అందుకుంది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యూటర్న్ కన్నడ చిత్రం. ఇక తమిళంలో విక్రమ్‌వేదా, తెలుగులో జెర్సీ చిత్రాలు మంచి విజయాలతో ప్రాచుర్యం పొందేలా చేశాయి. నటిగా ఇంత సక్సెస్ రేటింగ్ ఉన్నా ఆడిషన్స్ తప్పడం లేదట. అలా ఒక్క అవకాశం రావాలంటే ఎంత కష్టపడాల్లో నటి శ్రద్ధాశ్రీనా«థ్‌ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. దీనికి హెచ్.వినోద్ దర్శకుడు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం నేర్కొండపార్వై. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్బంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ అసలు ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తుందా?రాదా? అన్న సందేహం తనకు కలిగిందని చెప్పింది. అందుకు కారణం నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి తనను ఫోన్ చేసి పిలిపించారని చెప్పింది. అందుకోసం ఆడిషన్ నిర్వహించినట్లు తెలిపింది. అయితే ఆడిషన్ ముగిసిన తరువాత చాలా రోజుల వరకూ ఆ చిత్ర వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదని అంది. అలాంటి పరిస్థితుల్లో మరో మూడు వారాల తరువాత పిలిచారని చెప్పింది. అప్పుడు తనతో మళ్లీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపింది. అప్పుడు దర్శకుడు వినోద్ తన వద్దకు వచ్చి అభిమానులు మీమ్మల్ని అసహ్యంచుకునేంతగా నటించమని చెప్పారని అంది. దీంతో తనలోని ప్రతిభనంతా చూపుతూ ఆయన చెప్పినట్లు నటించానని, ఆ తరువాతనే నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చారని తెలిపింది. ఈ చిత్రంలో అజిత్‌తో కలిసి నటించడం తీయని అనుభవంగా పేర్కొంది. తనకు కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నట్లు చెప్పిన శ్రద్ధాశ్రీనాథ్ నటుడు విశాల్ సరసన ఒక చిత్రం, మాధవన్‌తో మారన్ అనే చిత్రంలోనూ నటించనున్నట్లు చెప్పింది. అలా తానిప్పుడు చాలా బిజీ తెలుసా. అని దీర్ఘాలు తీస్తూ చెప్పింది -
ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు
తమిళసినిమా: నేను అందగత్తెను కాను అంటోంది నటి శ్రద్ధాశ్రీనాథ్. ఈ కన్నడ నటి మాతృభాషలో నటించిన యూటర్న్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ఇవన్ తందిరన్ చిత్రంతో రంగప్రవేశం చేసి విక్రమ్ వేదా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత జెర్సీ చిత్రంతో టాలీవుడ్‌లోనూ సక్సెస్‌ను అందుకున్న శ్రద్ధాశ్రీనాథ్ నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలే వస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా అజిత్ కథానాయకిగా నటించిన నేక్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. ఇది బాలీవుడ్ హిట్ చిత్రం పింక్‌కు రీమేక్. హిందీలో నటి తాప్సీ నటించిన పాత్రను తమిళంలో శ్రద్ధాశ్రీనాథ్ పోషించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ నెల ద్వితీయార్థంలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం తెలుగులో జోడి అనే చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా ఆమె స్థాయిలో ఉన్న ఏ నటి అయినా కథానాయకిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తుంది. అలాంటిది కథానాయకిగా నటిస్తున్న శ్రద్ధాశ్రీనాథ్ మాత్రం తాను కథానాయకిని కాదు నటినే అంటోంది. అదేంటని అడిగితే కథానాయకుడు, కథానాయకి అన్న పదాల్లో నటుడు, నటి అనే పేర్లు ప్రతిధ్యనించడం లేదని అంది. ఇకపోతే కథానాయకుడు అనగానే పలువురిని చితకబాదాలని అంది. ఇక కథానాయకి అంటే అందంగానూ, గ్లామర్ గానూ ఉండాలంది. తాను అలా లేనని చెప్పింది. తానిప్పుడు కథానయకి పేరుతో నటిస్తున్నానని, తాను నటినేనని శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంది. నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్‌తో నటించిన అనుభవం గురించి తెలుపుతూ తాను తొలి రోజు షూటింగ్‌కు కారులో వెళ్లానని, కారు షూటింగ్ స్పాట్ దగ్గరకు వెళుతుండగా దూరంలో అజిత్ తొలిసారిగా చూశానని చెప్పింది. పెద్ద స్టార్. ఆయనతో ఎలా మాట్లాడాలి, నటించాలి అని సంకోచంతోనే కారు దిగానని చెప్పింది. అప్పుడు ఆయన షేక్‌హ్యాండ్ ఇచ్చి విక్రమ్ వేదా చిత్రంలో మిమ్మల్ని చూశాను అని అన్నారంది. ఆయన గురించి పెద్ద స్టార్, తల అని ఊహించుకున్న ఇమేజ్ అయన ప్రవర్తనతో పటాపంచలైందని చెప్పింది. అసలు ఆయన స్టార్ నటుడిగానే నడుచుకోలేదని, చాలా నిడారంబరంగా ఉన్నారంది. ఏదైన చెబితే స్వాగతించేవారని, సాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదంది. కొన్ని పెద్ద సన్నివేశాల్లో నటించడానికి ఎక్కువ టేక్‌లు తీసుకుంటే సెట్లో ఉన్న వారందరికీ సారీ చెప్పేవారని, ఆయన ఉన్నతమైన నటుడని పేర్కొంది. -
‘విశాల్‌తో ఓకే’
విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్ సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ భామ కోలీవుడ్‌లో విక్రమ్‌వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల అరుళ్‌నిధితో జతకట్టిన కే 13 చిత్రం కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్‌తో కలిసి నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీలో సూపర్‌హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్ట్ 10న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి నానీకి జంటగా జెర్సీ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.కాగా ఇప్పుడు నటుడు విశాల్‌తో నటించే అవకాశాన్ని అందుకుంది. విశాల్ నటించిన అయోగ్య చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రస్తుతం ఆయన సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా నాయకిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్రానికి రెడీ అయిపోతున్నారు. విశాల్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఇరుంబుతిరై చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నటి సమంత కథానాయకిగా నటించారు. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోనే నటి శ్రద్ధాశ్రీనాథ్ విశాల్‌తో రొమాన్స్కుసై అన్నారు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా ఆనంద్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎళిల్ శిష్యుడు. ఇకపోతే నటుడు విశాల్ ఈ సినిమాలో పోలీస్అధికారిగా నటించబోతున్నట్లు, నటి శ్రద్ధాశ్రీనాథ్ కూడా పోలీస్అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో ఈ అమ్మడు పలు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించనుందని తెలిసింది. సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి విశాల్ ఇరుంబుతిరై–2లో పాల్గొననున్నట్లు సమాచారం. ఆ తరువాత మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్–2 చిత్రం చేస్తారని టాక్. -
అభిమన్యుడుతో శ్రద్ధ
‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ తో మంచి హిట్ అందుకున్నారు విశాల్. ఇప్పుడాయన ‘అభిమన్యుడు’ కి సీక్వెల్‌గా రూపొందనున్న ‘అభిమన్యుడు 2’ లో నటించనున్నారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో విశాల్‌కి జోడీగా సమంత నటించారు. అయితే సీక్వెల్లో మాత్రం విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ని తీసుకున్నారట చిత్రబృందం. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రద్ధాశ్రీనాథ్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ‘అభిమన్యుడు’ సినిమాని తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ‘అభిమన్యుడు 2’ కి దర్శకత్వం వహించకపోవడం. ఈ సీక్వెల్‌కి కొత్త డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పందెంకోడి 2’ కి మీరాజాస్మిన్ ప్లేస్‌లో కీర్తీసురేష్ని తీసుకున్నారు. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’కి సమంత ప్లేస్‌లో శ్రద్ధాశ్రీనాథ్ని, మిత్రన్ స్థానంలో ఆనంద్‌ని తీసుకోవడం ఆసక్తికరం. త్వరలోనే ‘అభిమన్యుడు 2’ సినిమా పట్టాలెక్కనుందట. -
‘జెర్సీ’ థ్యాంక్యూ మీట్
-
మళ్లీ మళ్లీ చూసి మెసేజ్ చేస్తున్నారు
‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో నాని మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ రిలీజ్ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నెనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫీలింగ్. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్‌లో మాకు థ్యాంక్యూ మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే టీమ్ అందరి తరఫున ఒక ఫైనల్ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్ ఏర్పాటుచేశాం. చాలా ఎమోషన్ ఉన్న సినిమా కదా రిపీట్‌గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్‌లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్‌లెటర్స్‌లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్ చేసినప్పుడు ఆ వాయిస్ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్మోస్ట్ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షనికి పిలుద్దామనుకున్నా. లాస్ట్ మినిట్‌లో ఫోన్ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ‘జెర్సీ’ కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన చినబాబు, పీడీవీ ప్రసాద్, వంశీగార్లకు, నానీ సర్కి థ్యాంక్స్. సినిమా నేను డైరెక్షన్ చేసినా సరే నా బలం అంతా నా డైరెక్షన్ టీమ్. ఇంకా ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడండి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధా శ్రీనాథ్, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
వెండితెర మీద చూసుకోవడం పీడకలలా ఉంది!
‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘సారా’గా పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. లాయర్‌గా ప్రాక్టీస్ చేసి మరీ యాక్టర్ అయ్యారు. ‘‘భవిష్యత్‌లో చేయబోయే తెలుగు సినిమాలలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అంటున్న శ్రద్ధా గురించి కొన్ని ముచ్చట్లు... లాయరమ్మ శ్రద్ధా తండ్రి ఆర్మీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. నాన్నగారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరఖాండ్, అస్సాం...రాష్ట్రాలలో చదువుకుంది. ఇక సికింద్రాబాద్‌లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది. నాటకాలు బెంగళూర్‌లో ‘లా’ పూర్తయిన తరువాత అదే నగరంలో రియల్ ఎస్టేట్ లాయర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా పనిచేసింది. ఫుల్–టైమ్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో నటించింది. ‘ఏ బాక్స్ ఆఫ్ షార్ట్స్’ ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’...మొదలైన నాటకాలు శ్రద్ధాకు మంచి పేరు తీసుకువచ్చాయి. వ్యాపార ప్రకటనలు చేస్తున్న రోజుల్లో ఒక కన్నడ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఇదంతా ఒక ఎత్తయితే 2016లో పనన్ కుమార్ దర్శకత్వంలో నటించిన కన్నడ సినిమా ‘యూ టర్న్’ పదిమంది దృష్టిలో పడేలా చేసింది. ఊహించని ఛాన్సు! మొదటిసారి అడిషన్‌కు వెళ్లినప్పుడు... ‘‘మీ కన్నడ కన్విన్సింగ్‌గా లేదు’’ అన్నాడు డైరెక్టర్.‘‘అయ్యో!’’ అనుకుంది శ్రద్ధా.‘‘ఈ సినిమాల్లో నాకు ఛాన్సు రావడం కష్టమే’’ అనుకుంది నిరాశగా. అయితే, మూడో అడిషన్‌కు మాత్రం తనను తాను రుజువు చేసుకుని మంచి మార్కులు కొట్టేసింది. ‘యూ టర్న్’ (కన్నడ)లో జర్నలిస్ట్ రచన పాత్రకు ఎంపికైన తరువాత... ఆ పాత్ర కోసం రీసెర్చ్ కూడా చేసింది. బాలీవుడ్లో... ఈ సంవత్సరం ‘మిలన్ టాకీస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది శ్రద్ధా. తిగ్మాంశు ధూలియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ శ్రద్ధా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మైథిలి పాత్రకు ప్రాణం పోసింది’ అని రాశారు సినీ విమర్శకులు. పీడకల! ‘నాటకాల్లో సరే...మిమ్మల్ని మీరు వెండి తెర మీద చూసుకోవడం ఎలా అనిపించింది?’ అని అడిగితే– ‘ప్రేక్షకుల సంగతేమిటోగానీ, నా వరకైతే నన్ను నేను వెండితెర మీద చూసుకోవడం పీడకలలా అనిపిస్తుంది’ అంటూ నవ్వేస్తుంది శ్రద్ధా శ్రీనాథ్!