Victory Venkatesh's 'Saindhav' Movie Shooting At Bidar - Sakshi
Sakshi News home page

వెంకటేశ్ 'సైంధవ్‌' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్

Published Mon, Aug 21 2023 4:27 AM | Last Updated on Mon, Aug 21 2023 11:00 AM

Victory Venkatesh Saindhav Shooting ay bidar - Sakshi

వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్‌ పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్  సీక్వెన్స్ ను ప్లాన్  చేశారట శైలేష్‌ కొలను.

తాజాగా మొదలైన బీదర్‌ షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్  చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్‌’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, సంగీతం: సంతోష్‌ నారాయణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement