దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్‌.. డిసెంబర్‌ 22న తెలుస్తుంది | Shraddha Srinath First Look from Venkatesh Saindhav | Sakshi
Sakshi News home page

Shraddha Srinath: దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్‌.. డిసెంబర్‌ 22న తెలుస్తుంది

Published Sun, Apr 16 2023 12:50 AM | Last Updated on Sun, Apr 16 2023 7:18 AM

Shraddha Srinath First Look from Venkatesh Saindhav - Sakshi

క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్‌ ముగించాలనుకుంది. బాక్స్‌ ఓపెన్‌ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్‌’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ.

ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్‌ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్‌ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్‌ 22న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement