తెలుగులోకి రావడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’తో కుదిరింది. వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్‌గానే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో చాలావరకూ ఆయన డూప్ లేకుండా చేశారు. సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా, చాలా సహనంతో ఉంటారు. వెంకటేశ్‌గారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్ చూశాను. వెంకటేశ్‌గారి ‘అనారి’ (‘చంటి’) చిత్రం కూడా చూశాను.
‘సైంధవ్’లో కొంత తెలుగు, కొంత హిందీ మాట్లాడే ఓ హైదరాబాదీ పాత్ర నాది. సెట్స్‌లో నా తొలి రోజు చిత్రీకరణ యాక్షన్‌తో మొదలు కావడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఇక బెస్ట్ మూమెంట్స్ అంటే.. శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం బోట్ పై స్పీడ్‌గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి ఎగిరాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్లోనే ల్యాండ్ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్ సినిమాలో ఉంటుంది. నా నటనకు మరొకరు డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా డైలాగ్స్ నేర్చుకుని ఆ భాషలో డబ్బింగ్ చెప్పడమే ఇష్టం. అప్పుడే నా పాత్రలో ఉన్న ఇంటెన్స్, డెప్త్ తెలుస్తాయి.
శైలేష్ చాలాప్రోఫెషనల్ డైరెక్టర్. నటుడిగా నాది సుధీర్ఘమైన ప్రయాణం. శైలేష్ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయమే అవుతోంది. అయితే ఫిల్మ్ మేకింగ్ పరంగా అతనికి ఎంతో విషయ పరిజ్ఞానం, ఉందనిపించింది. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ ప్రోఫెషనల్ ప్రోడక్షన్ హౌస్. ∙టాలీవుడ్ చాలాప్రోఫెషనల్. ఇక రజనీకాంత్‌గారి ‘పేట’ (2019) సినిమా తర్వాత తమిళ, తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ కుదర్లేదు. అప్పుడు ‘పేట’లా ఇప్పుడు ‘సైంధవ్’ సంక్రాంతికే విడుదలవుతుండటం హ్యాపీ. ఇక ఓషోగారి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment