త్వరలో ఫైనల్‌ మిషన్‌ | Venkatesh Saindhav Wraps Up Another Kickass Schedule | Sakshi
Sakshi News home page

త్వరలో ఫైనల్‌ మిషన్‌

Published Thu, Jun 29 2023 3:48 AM | Last Updated on Thu, Jun 29 2023 3:48 AM

Venkatesh Saindhav Wraps Up Another Kickass Schedule - Sakshi

మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్‌ రెడీ అవుతున్నారు. వెంకటేశ్‌ హీరోగా ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘సైంధవ్‌’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ,  శ్రద్ధా శ్రీనాథ్‌ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్‌ మిషన్‌ (ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement