shedule release
-
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో రామ్ పోతినేని కొత్త మూవీ ఆరంభం
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీ లీల కథానాయిక. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టింది యూనిట్. స్టంట్ శివ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డి. -
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
-
25 నుంచి నీట్ పీజీ–2021 కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పీజీ–2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(ఎంసీసీ) శుక్రవారం విడుదల చేసింది. మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 25 నుంచి 29 వరకు జరుగనుంది. రెండో రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుంచి 19 వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి.రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సెలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఏఎఫ్ఎంఎస్ (ఎండీ/ఎంఎస్/డిపొ్లమా/పీజీ డీఎన్బీ) సీట్ల భర్తీకి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుంది. కాగా డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు, పీజీ డీఎన్బీ సీట్ల ప్రవేశానికి అదనపు మోప్–అప్ రౌండ్ నిర్వహించనున్నారు. ఆఖరున మిగిలిన సీట్ల కోసం ప్రత్యేకంగా మరో రౌండ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. -
ఆరు రాజ్య సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
సెప్టెంబర్ 25న ఐరాసలో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) 76వ ఉన్నత స్థాయి వార్షిక సమావేశానికి భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా హాజరై ప్రసంగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన వివిధ ప్రభుత్వాధినేతలతో కూడిన తాత్కాలిక మొదటి షెడ్యూల్ జాబితాలో భారత ప్రధాని పేరుంది. ఐరాస షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం ప్రసంగించే నేతల్లో మోదీ పేరు మొదటిది. కాగా, సెప్టెంబర్ 21న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో ఐరాసలో ఆయన ప్రసంగించడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 14–27వ తేదీల మధ్య జరిగే ఐరాస సమావేశాల్లో 167 దేశాధి నేతలు, ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులు, రాయబారులు ప్రసంగిస్తారు. ఇందులో ఇరాన్, ఈజిప్టు, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, నేపాల్ తదితర 46 దేశాల నేతలు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్ష హోదాలో ఏడాదిపాటు కొనసాగుతారు. సమావేశాల సమయానికి ఆతిథ్య నగరం న్యూయార్క్ నగరంలో అమలయ్యే కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తామని ఐరాస సెక్రటరీ జనరల్ గ్యుటెర్రస్ ప్రతినిధి స్టిఫానీ తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం 193 సభ్య దేశాలతో మాట్లాడతామన్నారు. 2019లో మొదటిసారిగా భారత ప్రధాని మోదీ ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. గత ఏడాది సర్వప్రతినిధి సభలో ప్రసంగించాల్సిన ప్రధాని మోదీ సహా వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రికార్డు చేసిన ప్రసంగాన్ని పంపించారు. ఐరాస 75 ఏళ్ల చరిత్రలో వర్చువల్‌గా ఐరాస ఉన్నత స్థాయి భేటీ జరగడం అదే ప్రథమం. -
నేటి నుంచి ఐపీఎల్–2021
-
క్రికెట్ కుంభమేళా: నేటి నుంచి ఐపీఎల్–2021
ఐపీఎల్ ఆటకు వేళయింది. టైటిల్ వేటకు రంగం సిద్ధమైంది. ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్’ల గోల మొదలైంది. డగౌట్లో మాస్క్‌లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్ రెడీ రెడీ అంటోంది. ఓ విధంగా ఇది క్రికెట్ కుంభమేళానే! కానీ వైరస్ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలకే అతుక్కుపోయే క్రికెట్ మేళా ఇది! ఒకప్పుడు ఐపీఎల్ అంటే బౌండరీ మీటర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్‌లే తారుమారయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్, ఐసోలేషన్లు లీగ్‌లో భాగమయ్యాయి. ఆటగాళ్లు తేల్చుకుంటారు మైదానంలో! మనం మాత్రం చూసుకుందాం టీవీల్లో! ఎందుకంటే కరోనా వైరస్ కాచుకుంది. గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా... అది పరాయిగడ్డ! కానీ మన నగరాల్లో మెరుపులు మెరిపిస్తున్నా... అవి మనకు బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. ఈల గోల ఉండదు. ఆడే ఆటగాళ్లు, తీర్పులిచ్చే అంపైర్లు, ఖాళీగా కుర్చీలు కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్ తగ్గదు. బౌలింగ్ పదును తగ్గదు. తొలి పంచ్ విసిరేందుకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమంటోంది. -
జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా శివ భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారు అయ్యాయి. గతేడాది కోవిడ్–19 మహమ్మారి కారణంగా రదై్దన యాత్రను ఈ ఏడాది జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించాలని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయించింది. శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన 40వ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్‌తో పాటు, పలు కీలక అంశాలపై చర్చించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ కచ్చితంగా పాటిస్తూ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర బాల్టాల్ మార్గం ద్వారా మాత్రమే జరిగే అవకాశాలున్నాయి. ప్రయాణం పహల్గామ్, చందన్వాడి, శేష్నాగ్, పంచతర్ని గుండా సాగుతుంది. అమర్నాథ్ గుహలో మంచు స్ఫటికాలతో ఏటా 10–12 అడుగుల ఎత్తైన మంచు శివలింగం ఏర్పడుతుంది. అంతేగాక అమర్నాథ్ శివలింగం ఎత్తు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి నాడు శివలింగం దాని పూర్తి పరిమాణంలో ఉండగా, అమావాస్య రోజున శివలింగ పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది. అమర్నాథ్ గుహ శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ సుమారు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉంటుంది. ఈ గుహ సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ: దేశవ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ , యస్ బ్యాంక్‌ల 446 బ్రాంచుల్లో ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా అమర్నాథ్ యాత్రను సాధువులకు మాత్రమే పరిమితం చేశారు. 2019లో 3.42 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. -
ఐపీఎల్... ప్రేక్షకుల్లేకుండానే!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ ఏమాత్రం ఆలస్యం కాకుండా అలరించేందుకు త్వరలోనే మన ముందుకొస్తోంది. కానీ ప్రేక్షకులకు మాత్రం గత సీజన్‌లాగే ఎంట్రీ లేదు. అయితే అది యూఏఈలో జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ స్వదేశంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వెళ్లి చూడలేకపోవడం మాత్రం భారత క్రికెట్ ప్రేమికులకు కాస్త నిరాశ కలిగించే అంశం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తదుపరి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ► మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్–2021 మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టుకు సొంత వేదికలో మ్యాచ్‌లు ఉండవు. అన్ని జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ► ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌తో విరాట్ కోహ్లి నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. ► బెంగాల్లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరంభ దశ మ్యాచ్‌లను కోల్‌కతాకు కేటాయించలేదు. ఎన్నికల కౌంటింగ్ మే 2న ముగిశాక కోల్‌కతాలో మే 9 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ► ప్రతీ జట్టు నాలుగు వేదికల్లో తలపడుతుంది. మొత్తం 56 లీగ్ దశ మ్యాచ్‌ల్లో చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో పదేసి మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలపై ఎనిమిది చొప్పున లీగ్ పోటీలు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లో మే 25న క్వాలిఫయర్–1, మే 26న ఎలిమినేటర్, మే 28న క్వాలిఫయర్–2, మే 30న ఫైనల్ జరుగుతాయి. ► ఈ సీజన్లో 11 రోజులు రెండు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైతే, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. -
ఈ ఒలింపిక్స్ అంతేనా!
టోక్యో: జపాన్ ఏ ముహూర్తాన 2020 ఒలింపిక్స్‌కు బిడ్ వేసిందో గానీ... తీరా నిర్వహించే సమయం వచ్చేసరికి అన్నీ ప్రతికూలతలే! గతేడాదే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్‌తో వాయిదా పడింది. ఇప్పుడు ఆ వైరస్ సెకండ్ వేవ్ కలకలంతో మళ్లీ విశ్వక్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఈ ఒలింపిక్స్‌ను వదిలేసి 2032 ఒలింపిక్స్‌ను పట్టుకుందామని జపాన్ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండిస్తున్నట్లు అటు ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించాయి. జపాన్ ప్రధాని యొషిహిదే సుగా మెగా ఈవెంట్ నిర్వహించేందుకు పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘గేమ్స్ అనుబంధ వర్గాలు షెడ్యూల్ ప్రకారమే భద్రంగా, సురక్షితంగా విశ్వ క్రీడలను నిర్వహించాలని కృతనిశ్చ యంతో ఉన్నాయి’ అని కేబినెట్ డిప్యూటీ చీఫ్ సెక్రటరీ సకాయ్ తెలిపారు. అంతకుముందు ‘టైమ్స్’ పత్రిక ఈ ఏడాది క్రీడల సంగతి అటకెక్కినట్లేనని కథనం రాసింది. జపాన్ కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చించే ఈ నిర్ణయం తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్త కథనం జపాన్ ప్రభుత్వంలో కలకలం రేపింది. వెంటనే టోక్యో గవర్నర్ కొయికె స్పందిస్తూ నిరాధార వార్త రాసిన బ్రిటిష్ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. అసలు ప్రభుత్వం అలాంటి చర్చే జరపలేదని ఆమె చెప్పారు. ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ మాట్లాడుతూ 2020 మార్చి తరహాలో 2021 మార్చి ఉండబోదని, కరోనాకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయని అన్నారు. -
జూలై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్, ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కారణంగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించింది. నిలిచిపోయిన 10, 12వ తరగతి పరీక్షలను జూలై ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డ్ సోమవారం తెలిపింది. 10వ తరగతి పరీక్షలు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లతో నిలిచిపోగా, 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్త లాక్డౌన్ అమలు కారణంగా వాయిదా పడ్డాయి. 12వ తరగతి విద్యార్థులకు జూలై 1న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్ సైన్స్, 9న బిజినెస్ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి. -
‘పురపోరు’పై టీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూలు విడుదల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ‘పురపోరు’ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారక రామారావు అధ్యక్షత వహిస్తారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర బాధ్యులకు పార్టీ కార్యాలయ వ్యవహారాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం సమాచారం అందించారు. 30 జిల్లాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, ఐదు జిల్లాల పరిధిలోని పది మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిపార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణను కేటీఆర్ ప్రకటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది ఆగస్టులో జరుగుతాయనే అంచనాతో టీఆర్ఎస్ పార్టీ 6నెలల క్రితం నుంచే పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలపై అప్రమత్తం చేస్తూ వచి్చంది. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 64 మంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్ 1తోఅడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదీ... ఫలితాల విడుదల ఆలస్యం... ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై బోర్డులో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్ ప్రాసెస్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరవుతారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. -
నేటి నుంచి కేటీఆర్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బుధవారం ప్రచారం మొదలుపెడుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 9 వరకు కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నా రు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రోడ్ షో నిర్వహణ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అన్ని స్థానాల్లో భారీ ఆధిక్యంతో గెలుపు కోసం సీఎం కేసీఆర్, కేటీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలుచుకోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్లగొండ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావ డంతో కీలక నియోజకవర్గాలపై స్వయంగా కేటీఆర్ దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప్రక్రియ ను సమన్వయం చేస్తూనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదీ... ► మార్చి 27న సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు స్థానికం గా జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ► మార్చి 29న సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లె మండలాల్లో స్థానిక సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో రోడ్‌షో నిర్వహించి అక్కడే బహిరంగ సభకు హాజరవుతారు. ► మార్చి 30న ఉదయం నర్సంపేట, ములుగు నియోజక వర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి తాండూరు, వికారాబాద్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. ► మార్చి 31న సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేటలో స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల నుంచి పరిగి, చేవెళ్లలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 1న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 2న సిరిసిల్లలో స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఉప్పల్, మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్‌నగర్‌లో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలకు కోదాడలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 6న సాయంత్రం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 8న ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో వేర్వేరుగా జరగనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లలో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 9న నల్లగొండలో రోడ్ షో నిర్వహించి ప్రచారం పూర్తి చేస్తారు. లోక్‌సభ బాధ్యుల మార్పు... లోక్‌సభ ఎన్నికల టీఆర్ఎస్ బాధ్యుల విషయంలో స్వల్ప మార్పులు జరిగాయి. మొదట నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డి, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరిద్దరి సెగ్మెంట్లను పరస్పరం మార్చుతూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో రవీందర్రావు నల్లగొండ లోక్‌సభకు, నరేశ్‌రెడ్డికి ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ బాధ్యతలను అప్పగించారు. -
మొదటివారంలో ‘పంచాయతీ’ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 26లోగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం జారీ చేసింది. ఓటర్ల నమోదు, తొలగింపునకు సంబంధించి వార్డుల వారీగా అనుబంధ ఓటర్ల జాబితాలను ఈ నెల 18లోగా తయారు చేయాలని కోరింది. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారుల నియామకం, ర్యాండమైజేషన్ను 20లోగా పూర్తి చేయాలని తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణను 22లోగా పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు ఉత్తర్వులను 26లోపు పూర్తి చేయాలని వెల్లడించింది. ఈ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ టైమ్‌లైన్ ప్రకారం వార్డుల వారీగా బీసీఓటర్ల గుర్తింపును చేపట్టామని, ఈ నెల 31 నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ల గైడ్‌లైన్స్‌ను జారీ చేస్తున్నామన్నారు. 2,3 రోజుల్లోగా రిజర్వేష న్ల ప్రక్రియకు సంబంధించి ఎంపీడీవోలు, ఆర్డీవోలకు శిక్షణ.. జిల్లాలవారీగా వివిధ విభాగాల సీట్ల సంఖ్యను రూపొందించాలని ఆదేశించామన్నారు. -
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 295వ రోజు షెడ్యూల్
-
ఐదు నెలల కోసం ఎన్నికలా?
బెంగళూరు: కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్‌సభ స్థానాలతోపాటు రామనగర, జంఖాడి అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ కాలపరిమితి మరో నాలుగున్నరేళ్లు ఉన్నందున, ఉప ఎన్నికలు జరపడం సబబే. అయితే, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రస్తుతం ఉప ఎన్నిక అవసరమేముంది?’ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మేలో 4 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహారాష్ట్రలోని భండారా–గోండియా, పాల్ఘర్, యూపీలోని కైరానా, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి మే 28న ఎన్నికలు నిర్వహించనుంది. బీజేపీ నేత పటోలే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో భండారా–గోండియా స్థానం ఖాళీ అయింది. బీజేపీ ఎంపీ చింతమన్ వనగ చనిపోవడంతో పాల్ఘర్లో, హుకుంసింగ్ చనిపోవడంతో యూపీలోని కైరానాలో ఉపఎన్నికలొచ్చాయి. నాగాలాండ్‌లోని లోక్‌సభ ఎంపీ నెయిఫియు ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ 4 స్థానాల్లో ఉపఎన్నికలకు మే 3న నోటిఫికేషన్ రానుంది. ఓట్ల లెక్కింపును మే 31న నిర్వహించనున్నారు. -
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ జారీ
అనంతపురం అర్బన్ : ఓటర్ల జాబితా సవరణలు–2017కు ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు 2017 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6(చేర్పులు) ద్వారా బూత్ స్థాయి అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఓటరు జాబితాలో తప్పులుంటే ఫారం–8లో దాఖలు చేసుకోవాలన్నారు. ఫారాలు తహశీల్దారు, బీఎల్ఓ, మీసేవా, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో లభిస్తాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ప్రతి పోలింగ్ బూత్‌కి ఏజెంట్లను నియమించి, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. సవరణల షెడ్యూల్ ఇలా... ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 15.11.2016 క్లయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు 15.11.2016 నుంచి 14.12.2016 గ్రామ, వార్డు సభల నిర్వహణ 23.11.2016 నుంచి 07.12.2016 ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ 20.11.2016 నుంచి 11.12.2016 క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం 28.12.2016 తుది ఓటర్ల జాబితా ప్రచుణ 16.01.2017