
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహారాష్ట్రలోని భండారా–గోండియా, పాల్ఘర్, యూపీలోని కైరానా, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి మే 28న ఎన్నికలు నిర్వహించనుంది. బీజేపీ నేత పటోలే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో భండారా–గోండియా స్థానం ఖాళీ అయింది.
బీజేపీ ఎంపీ చింతమన్ వనగ చనిపోవడంతో పాల్ఘర్‌లో, హుకుంసింగ్ చనిపోవడంతో యూపీలోని కైరానాలో ఉపఎన్నికలొచ్చాయి. నాగాలాండ్‌లోని లోక్‌సభ ఎంపీ నెయిఫియు ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ 4 స్థానాల్లో ఉపఎన్నికలకు మే 3న నోటిఫికేషన్ రానుంది. ఓట్ల లెక్కింపును మే 31న నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment