
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూలు విడుదల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ‘పురపోరు’ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారక రామారావు అధ్యక్షత వహిస్తారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర బాధ్యులకు పార్టీ కార్యాలయ వ్యవహారాల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం సమాచారం అందించారు.
30 జిల్లాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, ఐదు జిల్లాల పరిధిలోని పది మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిపార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణను కేటీఆర్ ప్రకటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది ఆగస్టులో జరుగుతాయనే అంచనాతో టీఆర్‌ఎస్ పార్టీ 6నెలల క్రితం నుంచే పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలపై అప్రమత్తం చేస్తూ వచి్చంది. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 64 మంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు
Comments
Please login to add a commentAdd a comment