బెంగళూరు: కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్‌సభ స్థానాలతోపాటు రామనగర, జంఖాడి అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ కాలపరిమితి మరో నాలుగున్నరేళ్లు ఉన్నందున, ఉప ఎన్నికలు జరపడం సబబే. అయితే, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రస్తుతం ఉప ఎన్నిక అవసరమేముంది?’ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐదు నెలల కోసం ఎన్నికలా?
Published Mon, Oct 8 2018 3:40 AM | Last Updated on Mon, Oct 8 2018 3:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment