అనంతపురం అర్బన్ : ఓటర్ల జాబితా సవరణలు–2017కు ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు 2017 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6(చేర్పులు) ద్వారా బూత్ స్థాయి అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఓటరు జాబితాలో తప్పులుంటే ఫారం–8లో దాఖలు చేసుకోవాలన్నారు. ఫారాలు తహశీల్దారు, బీఎల్‌ఓ, మీసేవా, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో లభిస్తాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ప్రతి పోలింగ్ బూత్‌కి ఏజెంట్లను నియమించి, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు.
సవరణల షెడ్యూల్ ఇలా...
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 15.11.2016
క్లయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు 15.11.2016 నుంచి 14.12.2016
గ్రామ, వార్డు సభల నిర్వహణ 23.11.2016 నుంచి 07.12.2016
ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ 20.11.2016 నుంచి 11.12.2016
క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం 28.12.2016
తుది ఓటర్ల జాబితా ప్రచుణ 16.01.2017
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ జారీ
Published Fri, Nov 11 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
Advertisement