kona sasidhar
-
ఇటు పరిశుభ్రం.. అటు రాబడి
దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి 217 కిలోలు విక్రయించారు. వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ వ్యూహాలపై అధికారుల కసరత్తు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రతివారం సమీక్ష ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ.. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. – కోన శశిధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ -
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
తప్పుడు వార్తలు నమ్మొద్దు: కోన శశిధర్
సాక్షి, తాడేపల్లి: ఖరీఫ్ సీజన్ లో 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆయన సోమవారం తాడేపల్లి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల పై కేంద్ర మంత్రులను కలిశామని పేర్కొన్నారు. 1820 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. నాబార్డ్ నుంచి అడ్వాన్సు తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా బకాయిలు చెల్లించమని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. రైతులు.. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. తడిసిన ధాన్యాలకు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1902’ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమాచారం అందిస్తారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని కోన శశిధర్ స్పష్టం చేశారు. -
నాలుగు రోజుల్లో అర్హుల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల తుది జాబితాను నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.47 కోట్ల తెల్ల రేషన్‌కార్డుల వివరాలను గ్రామ వలంటీర్లకు అందజేసి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు.. తదితర కారణాలతో దాదాపు 18 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తాము బియ్యం కార్డులు పొందడానికి అర్హులమేనని పేర్కొంటూ పున:పరిశీలన కోసం 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ విచారణ సాగిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఈ పని పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్హుల ఎంపిక ప్రక్రియను జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎవరికీ అన్యాయం జరగబోదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు బియ్యం కార్డులు లేని మరో 1.50 లక్షల మంది గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. పున:పరిశీలనకు భారీగా దరఖాస్తులు గుంటూరు జిల్లాలో 98,035, నెల్లూరులో 64,519, కృష్ణాలో 95,716, కడపలో 50,446, చిత్తూరులో 66,407, ప్రకాశంలో 55,890, అనంతపురంలో 69,758, తూర్పు గోదావరిలో 86,842, కర్నూలులో 55,253, విశాఖపట్నంలో 57,198, పశ్చిమ గోదావరిలో 60,540, విజయనగరంలో 31,247, శ్రీకాకుళం జిల్లాలో 31,982 దరఖాస్తులు పున:పరిశీలన కోసం వచ్చాయి. ఆయా దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం కా>ర్డు పొందడానికి అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తు అందిన వెంటనే పరిశీలించి, ఐదు రోజుల్లోగా బియ్యం కార్డు మంజూరు చేస్తాం. పేదలు బియ్యం కార్డు కోసం ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
ఎప్పుడైనా ఈకేవైసీ నమోదు
సాక్షి, అమరావతి : ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆధార్, మీ–సేవ కేంద్రాలకు ప్రజలు వెళ్లడం.. అక్కడ పెద్దఎత్తున క్యూలు కట్టడాన్ని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. ఆధార్ అప్డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. వాటిని నిదానంగా అప్డేట్ చేయించుకోవచ్చునని, ఇందుకు ఎటువంటి గడువులేదని ఆయన పేర్కొన్నారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదు, అప్డేట్ చేయించకపోయినా రేషన్ ఇస్తారని, రేషన్ ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని శశిధర్ కోరారు. కాగా, పాఠశాల పిల్లలు తాజా వివరాల నమోదుకు ఆధార్, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని ఆయనన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని, అక్కడే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ–కేవైసీ చేసుకోవాలని.. దీనికోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ–సేవా కేంద్రాల వద్దకు వెళ్లకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గతంలోనే రేషన్ దుకాణం వద్ద ఈ–కేవైసీ చేయించుకుని ఉంటే మళ్లీ చేయించుకోవాల్సిన అవసరంలేదని ఆయన సూచించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, ఆధార్ కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడవద్దని కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన వద్దు : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులు ఈకేవైసీపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కార్డులోని కుటుంబసభ్యులు ఎప్పుడైనా ఈకేవైసీ చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈకేవైసీ లేకపోతే రేషన్ సరుకులు ఇవ్వరనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. రేషన్ సరుకులు నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కార్డులోని కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరికి ఈకేవైసీ ఉన్నా రేషన్ సరుకులు ఇస్తామన్నారు. నానితో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకుడు పాలేటి చంటి ఉన్నారు. -
రోగికి ఇబ్బంది పెడితే సహించను
జీజీహెచ్‌లో సెల్‌ఫోన్ లైట్‌తో ఆపరేషన్ నిర్వహించిన తీరుపై కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆస్పత్రిలోని శుశ్రుత హాల్లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమైన ఆయన లైట్లు ఏర్పాటు చేయని సంస్థపై మండిపడ్డారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న కాంట్రాక్ట్ సంస్థను కథలు చెప్పొద్దంటూ మందలించారు. రోగికి ఇబ్బంది కలిగితే తన సమస్యగా భావిస్తానని స్పష్టం చేశారు. సాక్షి, గుంటూరు: రోగులకు ఇబ్బంది కలిగించే సమస్యను తన దృష్టికి తీసుకొస్తే తన సమస్యగా భావిస్తానని ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. జీజీహెచ్‌లోని శుశ్రుత హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్ ఎందుకు చేశారని, దానికి గల కారణాలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు స్పందించిన రెండు నెలలుగా ఆపరేషన్ థియేటర్లలో లైట్లు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. రెండు నెలలుగా ఆపరేషన్ థియేటర్లలో లైట్లు పనిచేయకపోయిన పట్టించుకోని టెలిమ్యాట్రిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వాటి స్థానంలో కొత్త పరికరాలను అమర్చలేదని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెపుతున్న టీబీఎస్ ప్రతినిధులను కథలు చెప్పొద్దని హెచ్చరించారు. బాధ్యతగా విధులు నిర్వహించడం చేతకాకపోతే కాంట్రాక్ట్ మానుకోవాలని సూచించారు. అనంతరం మెడికల్ కాలేజీ హాస్టల్‌కు నిధులు మంజూరైన నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ను కలెక్టర్ అడిగారు. ఆస్పత్రిలోకి ప్రవేశించగానే కొందరు రోగులు తనకు లేబర్ వార్డులోని బాత్రూముల్లో నీటి సరఫరా లేదని ఫిర్యాదు చేశారని, నీటి సరఫరాకు ఎందుకు అంతరాయం ఏర్పడుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ని ప్రశ్నించారు. వాటర్ ట్యాంక్‌లకు సెన్సార్లు లేకపోవడం వల్ల సమస్య తలెత్తుతోందని ఆయన సమాధానం ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆస్పత్రిలోని నీటి సరఫరా సమస్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా ఉద్యోగం... నా వేతనం అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి వార్డుకు ఓ ఇన్చార్జి ఆస్పత్రిలోని ప్రతి వార్డుకు ఒక హెచ్‌వోడీని, యూనిట్ ఇన్చార్జిని నియమించాలని సూపరింటెండెంట్ రాజునాయుడికి కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. ఆస్పత్రిలోని ప్రతి సమస్యను సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు గుర్తించలేరని ప్రతి వార్డుకు యూనిట్ ఇన్చార్జిలను నియమిస్తే వారే ఆ వార్డుకు బాధ్యత వహిస్తారన్నారు. రోగులకు ఏ చిన్న సమస్య వచ్చిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోడానికి కూడా వెనుకాడబోనని సిబ్బందిని హెచ్చరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఎదురవుతున్న సమస్యలను డాక్టర్లను కలెక్టర్ అడిగారు. తెల్లరేషన్ కార్డు లేని వారు సీఎంఆర్వో అప్రూవల్ తీసుకోవడానికి విజయవాడకు వెళ్లాల్సి వస్తోందని, ఇంతకు ముందు రేషన్‌కార్డు లేని వాళ్లకు గుంటూరులోనే ఈ సౌకర్యం ఉండేదని దాన్ని తిరిగి గుంటూరులోనే ఏర్పాటు చేయాలని వైద్యులు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి గుంటూరులో తిరిగి సీఎంఆర్వోను ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. ప్రైవేటు మెడికల్ షాపులను ప్రోత్సహించొద్దు రోగులకు అవసరమైన మందులన్నింటిని ఆస్పత్రిలోనే సరఫరా చేయాలని ప్రైవేటు మెడికల్ షాపులను ప్రోత్సహించే పనులు చేయొద్దని మెడికల్ విభాగం వారికి కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు లభించడం లేదని రోగులు బయట మెడికల్ షాపులకు వెళ్లి మందులు విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో లేని మందుల వివరాలను జీజీహెచ్ మెడికల్ స్టోర్ ఇన్చార్జి విజయశ్రీని అడిగారు. ఆమె స్పందిస్తూ 40 రకాల మందులు ఆస్పత్రిలో లేవని చెప్పారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి మందులను తెప్పిస్తానని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, ఆర్ఎంవో డాక్టర్ ఆదినారాయణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్ని విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. -
గొట్టిపాడులో అసలేం జరిగింది..
సాక్షి, గుంటూరు : ప్రస్తుతం గొట్టిపాడులో పరిస్థితి అదుపులోనే ఉందని గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని, ఘర్షణకు కారణమైన ఇరువర్గాల వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ వైటీ నాయుడు శనివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు చెప్పారు. కాగా కొత్త సంవత్సర వేడుకలు గొట్టిపాడులో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఇరువర్గాల మధ్య ఘర్షణల చివరకు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునేవరకూ వెళ్లింది. ఒకదశలో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామంలో 144 సెక్షన్ ను అమలు చేశారు. అసలేం జరిగింది... ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు పోనిచ్చారన్న కారణంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునే దాకా వెళ్లింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య గొడవగా మారిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన కొందరు యువకులు బైకులపై కేరింతలు కొడుతూ గ్రామంలో తిరిగారు. ఈ సమయంలో టీడీపీ నేతల ఇళ్ల ముందు వేసిన ముగ్గుల మీదుగా బైకులు వెళ్లడంతో అవి చెరిగిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నేతలు ఎస్సీ యువకులపై దాడి చేశారు. దీంతో వారు ఎదురు తిరగటంతో పరస్పరం గొడవకు కారణమైంది. అయితే సోమవారం మధ్యాహ్నం మళ్ళీ ఇరువర్గాలూ ఎదురు పడటంతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపట్లోనే వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలూ రాళ్లు విసురుకున్నారు. కర్రలతో స్వైర విహారం చేశారు. ఫలితంగా పలువురికి గాయాలయ్యాయి. అధికారం అండతో అనవసరంగా తమపై దాడి చేశారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బైక్ ని కూడా లాక్కున్నారని ఆరోపించారు. దళితులమని తమపై చిన్నచూపు చూస్తున్నారన్నారు. టీడీపీ నేతల అండతో తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌లపై తిరగవద్దని హెచ్చరించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా తమపై దాడి చేసి కొట్టారని తెలిపారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కోన శశిధర్... గొట్టిపాడులో పర్యటించి, వివాదంపై ఆయన ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం న్యాయ విచారణ జరుపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఈ వివాదంలో దోషులు ఎవరైనా శిక్ష తప్పదని అన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం అర్బన్ : పట్టభద్ర ఎమ్మెల్సీగా ఎన్నికైన వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం కలెక్టర్ కోన శశిధర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారంటూ ధన్యావాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈయన వెంట జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇందుకు తోడ్పడిన జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ సిబ్బందికి శనివారం ఓ ప్రకటనలో ఆయన జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలిపారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
- అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం అనంతపురం అర్బన్ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కాపీయింగ్‌కు తావివ్వకుండా 20 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో నియమించాలన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. ఇన్చార్జి డీఈఓ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ 49,576 మంది విద్యార్థులు 193 కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఉండకూడదని, అన్ని కేంద్రాల్లోనూ బెంచీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. బాత్రూములు బాలురకు, బాలికలకు వేరుగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికన్నా ముందే చేరుకునేలా మండలాల పరిధిలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డికి చెప్పారు. కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను నియమించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు. సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షకు గంట ముందుగా మూసేయించి పరీక్ష ముగిసిన తర్వాత గంట వరకు తెరవకుండా చూడాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఇన్చార్జి జేసీ-2 రఘునాథ్, డీఆర్వో మల్లీశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ హస్తకళలను ఆదరించాలి
అనంతపురం కల్చరల్ : ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అనంత వేదికగా 12 రోజుల పాటు సాగే లేపాక్షి హస్తకళా ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. స్థానిక ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోన శశిధర్‌తో పాటు ఏపీ హసక్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాళీ ప్రసాద్, ఆర్డీఓ మలోల తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కళాకారులు అనంతకు విచ్చేయడం ఆనందంగా ఉందని, వినూత్నంగా ఉన్న వారి ఉత్పత్తులు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. కళలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరముందన్నారు. లేపాక్షి ఎంపోరియం మేనేజర్ సుధీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి వచ్చేనెల 5 వరకు ప్రదర్శన సాగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగే ప్రదర్శనలో నిర్మల్ పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, బంజారా ఉత్పత్తులు, వివిధ చేనేత వస్త్రాలు వంటి సంప్రదాయక హస్తకళలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపోరియం మేనేజర్ వెంకటరమణప్ప, అనంతపురం లేపాక్షి ఎంపోరియం సిబ్బంది సురేష్, అమర్నాథ్, వెంకట్రాముడు, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాపై నివేదిక పంపండి
– ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశం – అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతపురం అర్బన్ : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్ని త్వరిగతిన పరిష్కరించి నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబం«ధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించాలన్నారు. పార్టీలు, అభ్యర్థులు హోర్డింగ్‌లు ఏర్పాటుకు స్థానిక సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని బుధవారం విడుదల చేస్తామన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, ఆర్డీఓలు రామారావు, రామ్మూర్తి, మలోలా, బాలానాయక్, వెంకటేశం, ఎన్నికల విభాగం డీటీ భాస్కర నారాయణ పాల్గొన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్‌ని జేఎన్టీయూ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్న గదులను, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జేసీ, డీఆర్ఓ, ఆర్డీఓను ఆదేశించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం
– 13న ఎన్నికల నోటిఫికేషన్ – 20 వరకు నామినేషన్ల స్వీకరణ – మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు – కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అసవరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ఇప్పటికే విడుదల చేసిందని కలెక్టర్ చెప్పారు. నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేస్తామన్నారు. ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తామని చెప్పారు. 21న పరిశీలన ఉంటుందనీ, అర్హతలేని నామినేషన్లను తిరస్కరిస్తామన్నారు. నామినేషన్ల ఉపంసహణకు 23వ తేదీ ఆఖరన్నారు. మార్చి 9న పోలింగ్ ,15న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను 18లోగా పూర్తిచేస్తామన్నారు. ఎన్నికల నియమావళి, నియమ నిబంధనల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామన్నారు. అధికారులను నియమించాము ఎన్నికల నిర్వహణకు అధికారులను నియమించామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎన్నికల రిటన్నింగ్ అధికారిగా (ఆర్ఓ) కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ)గా జిల్లా రెవెన్యూ అధికారి ఉంటారన్నారు. ఆర్డీఓలు డిప్యూటీ ఎన్నికల అధికారులుగా, తహశీల్దారులను మోడల్ కోడ్ ఇన్‌చార్జీలుగా నియమించామన్నారు. జిల్లాలోని 63 మండలాల్లో ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఎన్నికల ఓటరు నమోదు అప్డేషన్లు ఉంటాయన్నారు. ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రితమై ఉంటుందన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటామని కలెక్టర్ హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు విషయంలో ఆంక్షలు లేవన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో చేసుకోవచ్చన్నారు. డబ్బుల పంపిణీ, ఎన్నికలకు విఘాతం కలిగించే ఘటనలకు పాల్పడితే చర్యలు ఉంటాయన్నారు. అయితే ప్రచార ప్రకటన ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికెషన్ మానిటరింగ్ కమిటీ) ఆమోదం తప్పని సరిగా పొందాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల్లో ప్రచారం నిర్వహించకూడదన్నారు. అత్యవసర పనులు చేపట్టవచ్చు ప్రస్తుతం జరుగుతున్న పనులు మినహా కొత్త పనులు చేపట్టడానికి వీలులేదని కోన శశిధర్ చెప్పారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టకూడదని చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలు నిర్వహించకూడదన్నారు. ఉపాధి పనులు, కరువు సహాయక పనులు, నీటి సరఫరాకు సంబంధించిన అత్యవసర పనులు చేపట్టవచ్చన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ షెడ్యూల్ త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికలకు జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. -
వచ్చే ఏడాదికి 1,260 చెరువులకు నీరు
ఆత్మకూరు : వచ్చే ఏడాదికి జిల్లాలోని 1260 చెరువులను హంద్రీ-నీవా లేదా హెచ్చెల్సీ నీటితో నింపుతామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె ఆత్మకూరు మండలంలోని తలుపూరులో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ కోన శశిధర్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికీ సైబర్నెట్ అందుబాటులోకి రానుందని, దీని కోసం ప్రతి నెల రూ.149 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... కొందరు స్థానికులు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. ఏపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పనులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించం
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 40 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవని తెలిసిందన్నారు. నగదు రహిత లావాదేవీలు వందశాతం జరగాలన్న లక్ష్యంతో ఉన్నందున ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీలు ఎందరు నిర్వహిస్తున్నారు, స్వైపింగ్ యంత్రాలు ఎంత మంది ఏర్పాటు చేసుకున్నారు అనే వివరాలను ఈ నెల 4 నాటికి ఇవ్వాలని చెప్పామన్నారు. అయితే 13వ తేదీ వచ్చినా కొందరు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతా దరఖాస్తులను, రూపే కార్డులను సిద్ధం చేస్తామన్నారు. ఇందు కోసం 18,696 మంది వాలంటీర్లను, 1,269 మంది దరఖాస్తులు పూరించే సిబ్బందిని, 367 మంది క్లస్టర్ సిబ్బందిని, 1,306 మంది బ్యాంక్ లైజన్ అధికారులను సిద్ధంగా ఉంచామన్నారు. -
ఆన్లైన్ ద్వారానే లబ్దిదారులకు పెన్షన్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా ఆన్లైన్ ద్వారా పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్, డీఆర్డీఏ అ«ధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని కలెక్టర్ తెలిపారు. ఖాతాలు లేని లబ్దిదారులు పెన్షన్ కోసం సమీప బ్యాంకులో వెంటనే ఖాతా తెరిచే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా, రూపే కార్డుల ద్వారా, ఈ–పాస్ మిషన్ల ద్వారా నగదును పెన్షన్‌దారులకు అందించే ఏర్పాట్లను చేయాలన్నారు. నేటి నుంచి జిల్లాలోని రేషన్ షాపులలో నగదు లేకుండా లావాదేవీలు జరుగుతాయని తెలిపారు. -
హౌసింగ్ అధికారులపై కొరడా
అనంతపురం టౌన్ : జిల్లాలో గృహనిర్మాణ సంస్థ అధికారులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పనితీరు ఆధారంగా వీరందరికీ 'సీ' గ్రేడ్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలోనే గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రేడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ఇందిరా ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అప్‌గ్రెడేషన్ తదితర పథకాల్లో పురోగతి అధ్వాన్నంగా ఉండడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 8 మంది డీఈఈలు, 37 మంది ఏఈలకు షోకాజులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వీరందరిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ నోటీసులిచ్చారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల్లో అనంతపురం జిల్లా 5వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. -
నగదు రహిత కొనుగోళ్లపై కసరత్తు
- వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్ అనంతపురం అర్బన్ : నగదు రహిత కొనుగోళ్లపై కసరత్తు చేసి ఆన్లైన్, డెబిట్, రూపే కార్డుల ద్వారా అవసరమైన వాటిని కొనుగోలు చేసుకునేలా సులువైన విధానం తీసుకురావాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, ఏపీఎంలు, ఏపీడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు సంయుక్తంగా పని చేసి సామాన్యుల ఇబ్బందులను తగ్గించాలని, నగదు లేకపోతే పని జరగదనే భావనను తొలగించాలని సూచించారు. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలిచ్చారు. - ప్రత్యేక డ్రైవ్ ద్వారా అన్ని వ్యాపార వర్గాలతో పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలకు దరఖాస్తు చేయించాలి. రెవిన్యూ డివిజన్లు, మున్సిపాలిటీల్లో ఈ యంత్రాలు పొందేందుకు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. - జన్‌ధన్ ఖాతాదారులు రూపే కార్డు ఉపయోగించుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి. - ఉపాధి కూలీలు, పింఛనుదారులకు అకౌంట్లు లేకపోతే వెంటనే జన్‌ధన్ యోజన కింద చేయించి రూపే కార్డులు అందించే ప్రక్రియను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తక్షణం ప్రారంభించాలి. -
కార్డు లావాదేవీల పెంపు
- అన్ని వ్యాపార సంస్థల్లోనూ పీఓఎస్ యంత్రాలు - కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : వ్యాపార లావాదేవీల్లో నగదుకు బదులుగా డెబిట్(ఏటీఎం) కార్డు వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లోనూ పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డెబిట్ కార్డు వినియోగంపై అదనపు ఛార్జీలు ఉండవన్న ఆయన పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తున్నామన్నారు. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకూ డెబిట్ కార్డు వినియోగించేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోని రెవిన్యూ భవన్లో గురువారం ఆయన జేసీ బి.లక్ష్మికాంతం, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో రూ.90 కోట్లు నగదు మార్పిడి జరిగిందని, రూ.430 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారని, రూ.1,360 కోట్లు డిపాజిట్ చేశారని తెలిపారు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 556 ఏటీఎంలు ఉంటే ఇప్పటివరకు 300 ఏటీఎంలను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్నీ పని చేస్తాయని చెప్పారు. 5.73 లక్షల జన్‌ధన్ ఖాతాలున్నాయని, వారిలో డెబిట్ కార్డులు లేని వాళ్లందరికీ బ్యాంకర్లు మూడురోజుల్లో ఇస్తారని చెప్పారు. డెబిట్ కార్డుల వల్ల చాలా వెసులుబాటు ఉంటుందని, పైగా భవిష్యత్తులో నోట్లు రద్దయినా ఎలాంటి ఇబ్బందీ తలెత్తదనీ అన్నారు. అందువల్ల ప్రజలంతా డెబిట్ కార్డుల ద్వారానే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు అన్ని వ్యాపార వర్గాల సంఘాల ప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ పీఓఎస్ యంత్రాల వినియోగం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ప్రతి లావాదేవీ డెబిట్ కార్డు ద్వారా సాగితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఈ చర్యలకు వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు. -
నోట్ల మార్పిడి వేగవంతం
బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : నోట్ల మార్పిడి ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 34 బ్యాంకులకు సంబంధించి జిల్లాలో 454 శాఖలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నగదు, నోట్ల మార్పిడిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు, జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల నుంచి కరెన్సీ చెస్ట్‌ని పంపించాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద సమాచార కేంద్రాలు, షామియానాలు, తాగునీటి సౌకర్యం తప్పక కల్పించాలన్నారు. క్యూలో ఉన్న వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం జయశంకర్, ఎస్బీఐ ఏజీఎం, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, హరిబాబు, సిండికేట్ బ్యాంక్ డీసీఎం ఆశీర్వాదం, ఏపీజీబీ ఆర్ఎం జయశంకర్, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శశికుమార్, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచి చీఫ్ మేనేజర్ బాలయ్య, ఎస్బీహెచ్ సీనియర్ మేనేజర్ సాయికృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చుకునేందుకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంక్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. ఈ నెల 24 వరకు పాత నోట్లను తీసుకోవాలని మీ సేవ కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన రాంనగర్‌లోని ఆంధ్ర బ్యాంక్, మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. నోట్ల మార్పిడి ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పరిశీలించారు. తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నోట్లను మార్చుకోవాలన్నారు. -
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ జారీ
అనంతపురం అర్బన్ : ఓటర్ల జాబితా సవరణలు–2017కు ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు 2017 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6(చేర్పులు) ద్వారా బూత్ స్థాయి అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఓటరు జాబితాలో తప్పులుంటే ఫారం–8లో దాఖలు చేసుకోవాలన్నారు. ఫారాలు తహశీల్దారు, బీఎల్ఓ, మీసేవా, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో లభిస్తాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ప్రతి పోలింగ్ బూత్‌కి ఏజెంట్లను నియమించి, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. సవరణల షెడ్యూల్ ఇలా... ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 15.11.2016 క్లయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు 15.11.2016 నుంచి 14.12.2016 గ్రామ, వార్డు సభల నిర్వహణ 23.11.2016 నుంచి 07.12.2016 ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ 20.11.2016 నుంచి 11.12.2016 క్లయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం 28.12.2016 తుది ఓటర్ల జాబితా ప్రచుణ 16.01.2017 -
ఢిల్లీ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్ : స్వచ్ఛభారత్ మిషన్ అమలులో భాగంగా ఢిల్లీలో రెండు రోజుల పాటు ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న ఓరియంటేషన్ శిక్షణ లో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆయన 9న తిరిగి వస్తారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇన్చార్జ్ కలెక్టర్ బాధ్యతలను నిర్వర్తిస్తారు. -
సింగపూర్ వెళ్లనున్న కలెక్టర్
అనంతపురం అర్బన్ : కలెక్టర్ కోన శశిధర్ నవంబరులో సింగపూర్ సందర్శనకు వెళ్లనున్నారు. ఈ కారణంగా నవంబరు 23 నుంచి 28 వరకు ఆరు రోజుల పాటు సెలవుతో పాటు దేశం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి కోరూతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం సెలవు మంజూరు చేయడంతో పాటు, సింగపూరు వెళ్లేందుకు అనుమతిని ఇస్తూ ఈ నెల 25న జీవో 2193ని ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ జారీ చేశారు. కలెక్టర్ సెలవులో ఉండే ఆరు రోజులు పాటు ఇన్చార్జి కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతంకి అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. -
చిరకాల స్నేహానికి క్రీడలే కారణం
– జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరకాల స్నేహానికి క్రీడలే ప్రధాన కారణమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 38వ జాతీయ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలో మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత కలెక్టర్‌తో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీ చైర్మన్ చమన్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ 23 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్రీడల్లో ప్రధానమైన అంశం గెలుపోటములు కాదని, ఇక్కడ ఏర్పడే పరిచయాలు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. ఈ టోర్నీ ఈ నెల 4 నుంచి 8 వరకు కొనసాగుతుందన్నారు. క్రీడలకు ఆర్డీటీ కషి అమోఘమన్నారు. రాష్ట్రం నుంచి చైనా వెళ్లే భారత జట్టులో రాధిక, భూమి ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ టీమ్ సీఈఓ ప్రవీణ్ అనౌకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, రాష్ట్ర చైర్మన్ నరసింహం, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, ఆర్డీఓ మలోలా, డీఈఓ అంజయ్య, నారాయణ, జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్షులు నాగరాజు, శ్రీకాంత్చౌరత్, లక్ష్మణ్, పీఎన్పారీ, పుంగవనం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలిæరోజు విజేతల వివరాలు : తెలంగాణ జట్టును ఛత్తీస్‌గఢ్ జట్టు 3–0 తో ఓడించింది. మణిపూర్‌ను హర్యాణా జట్టు 10–0 తో ఓడించింది. బీహార్‌ను చండీఘడ్ జట్టు 10–0తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌ను పంజాబ్ జట్టు 5–1 తో ఓడించింది. ఒరిస్సాను కర్ణాటక 11–0 తో ఓడించింది. ఢిల్లీని కేరళ జట్టు 1–0 తో ఓడించింది. గోవాను మహారాష్ట్ర జట్టు 15–0 తో ఓడించింది. గుజరాత్ ను అస్సాం జట్టు 8–7 తో ఓడించింది. బీహార్ ను పంజాబ్ జట్టు 10–0తో ఓడించింది. తెలంగాణ ను మహరాష్ట్ర జట్టు 6–0 తో ఓడించింది. హిమాచల్‌ప్రదేశ్‌ను గోవా జట్టు 9–4 తో ఓడించింది. మణిపూర్ ను ఢిల్లీ జట్టు 4–3 తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఛత్తీస్‌ఘడ్ ను కేరళ జట్టు 3–1 తో ఓడించింది. హర్యాణను చంఢీఘడ్ జట్టు 12–0 తో ఓడించింది. అస్సాం ను గుజరాత్ జట్టు 11–0 తో ఓడించింది. -
విజయవాడకు వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్ : విజయవాడలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. జిల్లాలో చేపట్టిన, చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమైన నిధుల వివరాలను సదస్సు ద్వారా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నారు. వేరుశనగ పంట పరిస్థితి, రక్షక తడులు అందించిన వివరాలను, పరిశ్రమలకు అవసరమైన భూ సేకరణ, అందుకు చేపట్టిన చర్యలు, హంద్రీ నీవా పనుల పురోగతి వివరాలను ప్రభుత్వానికి వివరిస్తారని సమాచారం. -
అ"సమగ్ర" సర్వే
– పెద్దలకో తీరు.. పేదలకో తీరు – వివరావ్విలని పచ్చ నేతలు ((((జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి. ధనవంతుల్లో జాబితా సిద్ధం చేస్తే ముందువరుసలో ఉంటారు. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన మరొక ప్రజాప్రతినిధి ఆస్తుల విలువ లెక్కిస్తే ‘టాప్ టెన్’లో నిలుస్తారు. ఈయనకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్‌లోనూ విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల్లో సమయంలో ఆయన ఇచ్చిన అఫిడివిట్ పరిశీలిస్తే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల చిట్టా ఎంత పొడవుందో తెలుస్తుంది. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తారు. అయితే వీరెవరూ స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే)లో తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను సమగ్రంగా ఇవ్వలేదని తెలిసింది.))) అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజా సా«ధికార సర్వే ‘చోద్యం’గా మారింది. పెద్దలకో తీరు... సామాన్యులకో తీరు చందంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి గుచ్చి గుచ్చి వివరాలను సేకరిస్తున్నారు. అదే కోట్ల రూపాయలకు పడగలెత్తిన అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం సర్వేలో తమ వివరాలను సమగ్రమంగా ఇవ్వడం లేదు. ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజల సాధికారత కోసమే సర్వే అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రతి పౌరుడు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలనీ చెప్పింది. ఇవ్వన్నీ సామాన్యులకే తప్ప అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు వర్తించడం లేదనేది సర్వే తీరు స్పష్టం చేస్తోంది. జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పేరున లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల సమాచారాన్ని సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచుకున్నారని తెలిసింది. వాస్తవంగా 22 ఆధారాలను సర్వే సిబ్బందికి ప్రజలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పలువురు ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కొన్ని వివరాలు చెప్పి ఎన్యుమరేటర్లను పంపుతున్నారని సమాచారం. కనీసం వరిని ఇళ్లలోకి కూడా రానివ్వట్లలేదని తెలుస్తోంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఆస్తులెన్నో.. జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ధనిక ప్రజాప్రతినిధుల ఆస్తులు చాలా వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదని తెలిసింది. ఆధార్ కార్డు విధానం అమలులోకి రాక ముందు ఉన్న ఆస్తులు ఆధార్ పరిధిలోకి రాలేదని సమాచారం. ఇలాంటి ఆస్తుల వివరాలను పచ్చనేతలు సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. కాగా సామాన్యుల నుంచి మాత్రం వివరాలను ఎన్యుమరేటర్లు పక్కాగా సేకరిస్తున్నారు. వారి ఇళ్లలోకి ప్రతి వస్తువునూ పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. దీంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. వాటి కారణంగానే ఎక్కడ ప్రభుత్వ పథకాలను దూరం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. -
పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చండి
అనంతపురం అర్బన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య కల్పనలో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ కోన శశిధర్... ప్రత్యేక అధికారులకు సూచించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పారిశుద్ధ్య మెరుగుదలపై జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవరోధానల్లోనూ అవకాశాలను వెతుక్కుని సానుకూల ఫలితాలు సాధించినప్పుడే ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలమన్నారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన డివిజన్లలో పర్యటించి గుర్తించిన పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులు, ఇతరాత్ర అవసరమైన వాటిని కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. కార్పొరేటర్ల సహకారం తీసుకోవాలన్నారు. డివిజన్లలో జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను కంట్రోల్ వెంటనే అందించాలన్నారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యాధికారులను అక్కడికి పంపిచాలని డీఎంహెచ్ఓని ఆదేశించారు. అవసరమైతే అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఉద్యోగులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ను వారంలోగా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మల్లీశ్వరిదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డెంగీపై అప్రమత్తంగా ఉండండి జిల్లావ్యాప్తంగా డెంగీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. విషజ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జరగరానిది జరిగితే అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, అధికారులతో సమీక్షించారు. అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించారు. సమావేశంలో ఆరోగ్య అధికారులు దోసారెడ్డి, జయమ్మ పాల్గొన్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హిందూపురం టౌన్ : పట్టణంలో మంగళవారం శ్రీకంఠపురం, రమహత్పురం ప్రాంతాలకు చెందిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్ కలెక్టర్‌ను కోరారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసిన సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందూపురంలో నాలుగు రోజుల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడుల్లో అమాయకుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ శాంతిసంఘ సమావేశం నిర్వహించి ఇరువర్గాలు, ఎస్పీతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. -
48 గంటల్లో తరలించాలి
అనంతపురం న్యూసిటీ : నగరంలోని పందులను 48 గంటల్లో ఊరి బయటకు తరలించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక వినాయకనగర్‌లో పర్యటించారు. వీధుల్లో కలియ తిరిగి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని, రోజూ డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. వినాయకనగర్‌లో రక్తనమూనాలు సేకరించి, జ్వరపీడితులుంటే వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య,ఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. దోమకాటు వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 10 లక్షల కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంచాలన్నారు. డీఎంహెచ్ఓ, మునిసిపల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు మంత్రులకు, అధికారులకు సమాచారం అందివ్వాలన్నారు. -
నేత్రదానానికి ముందుకొచ్చిన కలెక్టర్
అనంతపురం సిటీ : 31వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు గురువారంతో ముగిశాయి. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సర్వజనాస్పత్రి ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కన్నేగంటి భాస్కర్ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ కోనæశశిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ తన నేత్రాలను దానం చేయడానికి అనుమతి పత్రాన్ని పూరించి వైద్యాధికారులకు అందించారు. డాక్టర్ అక్బర్ కూడా తన నేత్రాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నేత్ర దానానికి ముందుకు రావడాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని వైద్యాధికారులు సమావేశంలో పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...చూపులేని వారికి బాసటగా నిలవాలకున్న ప్రతి ఒక్కరు నేత్ర దానానికి ముందుకు రావాలన్నారు. మనలాంటి జీవితాన్ని చాలా మంది కళ్లు లేక అనుభవించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నేత్ర దానానికి చాలా మందిలో అవగాహన పెరిగిందన్నారు. -
కలెక్టర్ వచ్చేశారు!
అనంతపురం అర్బన్: ఈ–గవర్ననెన్స్, ప్రభుత్వ సర్వీసులపై కెనడాలో శిక్షణ కోసం వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ తిరిగి వచ్చేశారు. మంగళవారం ఆయన విధులకు హాజరయ్యారు. పది రోజుల శిక్షణలో భాగంగా ఈ నెల 19న ఆయన కెనడాకు వెళ్లిన సంగతి తెలిసిందే. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్నారు. ఆ తరువాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొన్నారు. -
ఇన్చార్జ్ డీఆర్వోగా మల్లీశ్వరిదేవి
అనంతపురం అర్బన్ : డీఆర్వో సీహెచ్ హేమసాగర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఇన్చార్జ్ డీఆర్వోగా మల్లీశ్వరిదేవిని నియమిస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లీశ్వరిదేవి ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా ఉన్నారు. దాంతో పాటు డీఆర్వోగా పూర్తిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
సీఎం పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు
అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు ఈనెల 6న ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటిస్తున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఆదివారం రెవెన్యూభవన్‌లో కలెక్టర్ జేసీ–1 బి.లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, డీఆర్ఓ హేమసాగర్‌తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ధర్మవరంలో చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సుతో పాటు రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అలాగే బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ జెడ్పీ సీఈఓ రామచంద్ర, పట్టుశాఖ జేడీ అరుణకుమారి, అలాగే బుక్కరాయసముద్రం ఏర్పాట్లు జేసీ–2 ఖాజా మొహిద్దీన్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్, రహదారులు, పరిశుభ్రత, అంబులెన్సులు, ఫైరింజన్లు తదితర వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. కళాజాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎ.నాగభూషణం, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వ్యవసాయశాఖ డీడీఏ జయచంద్ర పాల్గొన్నారు. -
6న సీఎం రాక
– పకడ్బందీగా పర్యటన ఏర్పాట్లు చేయండి – అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 6న జిల్లాకు విచ్చేస్తున్నారని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్ధీన్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 6న ధర్మవరంలో ఏర్పాటు చేసిన చేనేత రుణమాఫీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో, బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తి సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో సీఎం పాల్గొంటారన్నారు. హెలిప్యాడ్, సభావేదిక, సీటింగ్, తాగునీరు, తదితర ఏర్పాట్లను సంబంధిత అధికారులు పకడ్బందీగా చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ మలోలా, ఎఫ్ఎస్ఓ మల్లీశ్వరిదేవి, జడ్పీ సీఈఓ రామచంద్ర, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బుక్కరాయసముద్రం సమీపంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్‌ని, సీఎం ప్రారంభించే గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ యామిని బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. -
విజయవాడ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి గురువారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
పోలీసులు అనుమానించారని ఆత్మహత్య
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపురంలోఇటీవల జరిగిన చోరీ కేసులో నాగశేషు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. పోలీసులు అనుమానించారని మనస్తాపం చెందిన నాగశేషు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు బాధితుణ్ని వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందులూ నాగశేషు మృతి చెందాడు. అదే విధంగా గత వారంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్‌పై ప్రభుత్వం స్పందించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన బత్తెన శ్రీరాములు మృతిపై కలెక్టర్ కోన శశిధర్ మెజిస్టిరీయల్ విచారణకు ఆదేశించారు. -
’నిందితులు ఎంతటి వారైనా వదలం’
-
నీటి వృథా అరికట్టేందుకు చర్యలు
కూడేరు: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు విడుదల చేసిన నీరు వృథా కాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కోనా శశిధర్ తెలిపారు. జల్లిపల్లి నుంచి కూడేరు వరకు గల 25 కిలో మీటర్లు పొడవు గల ధర్మవరం కుడికాలువ గుండా కలెక్టర్ పర్యటించి కాలువను పరిశీలించారు. 7.5 , 10, 12వ కిలో మీటర్ల వద్ద కాలువకు ఒక్క పక్క కొంత దూరం గోడను నిర్మించకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. ఎందుకు గోడ నిర్మించలేదు. ఇలాగైతే నీరు వృధా కాదా. వేగంగా నీరు ముందుకు ఎలా ప్రవస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలా గోడను నిర్మంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్ఎల్సీ అధికారులకు సూచించారు. 15వ కిలో మీటర్ వద్ద కలగళ్ళకు చెందిన రైతులు గోపాల్, ప్రభాకర్, నారాయణలు కలెక్టర్‌ను కలిశారు. కుడికాలువ కింద తగ్గు భాగంలో తమ పొలాలు ఉన్నాయని , కాలువకు నీరు విడుదల చేసినపుడు నీరు లీకై పొలంలోకి రావడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తమ పంటలను కాపాడాలని విన్నవించుకున్నారు. చెరువులన్నింటికీ నీరందించడమే లక్ష్యం : 112 కిలోమీటర్లు పొడవునా గల కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ విలేకరులకు తెలిపారు. ధర్మవరం కుడి కాలువకు గత ఏడాది రోజు సుమారు 700 క్యూసెక్కులు వరకు నీరు విడుదల చేస్తే లీకేజీల వల్ల ధర్మవరం చెరువుకు వెళ్లే సరికి 300 క్యూసెక్కులే మిగిలేవన్నారు. ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్‌తో అత్యవసర ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటిని విడుదల చేసినపుడు హెచ్చెల్సీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేస్తు పక్కా ప్రణాళికతో నీరు వృధా కాకుండా ముందుకు సాగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు. ఈఈ మగ్బుల్ బాషా, డీఈఈ ఏడు కొండలు, డీఈలు శ్రీధర్, మరళి, రమణ, మూర్తి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, డీపీఆర్ఓ జయమ్మ, ఆత్మకూరు ఎస్ఐ , ఏఎస్ఐ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాధికారులపై కలెక్టర్ ఆగ్రహం
అనంతపురం: వేరుశెనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవసాయ అధికారులపై అనంత కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లమాడ వ్యవసాయ అధికారి అబ్దుల్ అలీని సస్పెన్షన్ చేశారు. దాంతో పాటుగా మరో ముగ్గురు అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
'కబీర్ పురస్కారాలకై దరఖాస్తు చేసుకోండి'
అనంతపురం అర్బన్: మతసామరస్యం, జాతీయ సమైక్యతకై పాటుపడిన వారు 2015 సంవత్సరానికి కబీర్ పురస్కారాలకై ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత ప్రోఫార్మాలో పూర్తి చేసిన దరఖాస్తును ట్రిప్లికేట్లో పంపాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వాటితో పాటు దరఖాస్తుదారుడు వారు కృషి చేసిన రంగంలోని అంశాలను, విశేషాలను జతచేయాలన్నారు. గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని తెలియజేశారు. దరఖాస్తులను అనంతపురము కలెక్టర్ కార్యాలయములో హెచ్ సెక్షన్ నందు పొందవచ్చునని, పూరించిన దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయము, హెచ్ సెక్షన్, అనంతపురము.. చిరునామాకు ఈ నెల 31 వతేదీ లోపు పంపాలని తెలిపారు.