చిరకాల స్నేహానికి క్రీడలే కారణం
– జిల్లా కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరకాల స్నేహానికి క్రీడలే ప్రధాన కారణమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 38వ జాతీయ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలో మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. తొలుత కలెక్టర్‌తో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీ చైర్మన్ చమన్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ 23 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్రీడల్లో ప్రధానమైన అంశం గెలుపోటములు కాదని, ఇక్కడ ఏర్పడే పరిచయాలు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు.
ఈ టోర్నీ ఈ నెల 4 నుంచి 8 వరకు కొనసాగుతుందన్నారు. క్రీడలకు ఆర్డీటీ కషి అమోఘమన్నారు. రాష్ట్రం నుంచి చైనా వెళ్లే భారత జట్టులో రాధిక, భూమి ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ టీమ్ సీఈఓ ప్రవీణ్ అనౌకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, రాష్ట్ర చైర్మన్ నరసింహం, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, ఆర్డీఓ మలోలా, డీఈఓ అంజయ్య, నారాయణ, జిల్లా సాఫ్ట్‌బాల్ అధ్యక్షులు నాగరాజు, శ్రీకాంత్‌చౌరత్, లక్ష్మణ్, పీఎన్‌పారీ, పుంగవనం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిæరోజు విజేతల వివరాలు : తెలంగాణ జట్టును ఛత్తీస్‌గఢ్ జట్టు 3–0 తో ఓడించింది. మణిపూర్‌ను హర్యాణా జట్టు 10–0 తో ఓడించింది. బీహార్‌ను చండీఘడ్ జట్టు 10–0తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌ను పంజాబ్ జట్టు 5–1 తో ఓడించింది. ఒరిస్సాను కర్ణాటక 11–0 తో ఓడించింది. ఢిల్లీని కేరళ జట్టు 1–0 తో ఓడించింది. గోవాను మహారాష్ట్ర జట్టు 15–0 తో ఓడించింది. గుజరాత్ ను అస్సాం జట్టు 8–7 తో ఓడించింది. బీహార్ ను పంజాబ్ జట్టు 10–0తో ఓడించింది. తెలంగాణ ను మహరాష్ట్ర జట్టు 6–0 తో ఓడించింది. హిమాచల్‌ప్రదేశ్‌ను గోవా జట్టు 9–4 తో ఓడించింది. మణిపూర్ ను ఢిల్లీ జట్టు 4–3 తో ఓడించింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఛత్తీస్‌ఘడ్ ను కేరళ జట్టు 3–1 తో ఓడించింది. హర్యాణను చంఢీఘడ్ జట్టు 12–0 తో ఓడించింది. అస్సాం ను గుజరాత్ జట్టు 11–0 తో ఓడించింది.