friendship
-
సల్మాన్‌కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ముంబైలో శనివారం రాత్రి ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ హత్య పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు దగ్గరైనందుకే బాబా సిద్ధిఖీని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు తాము బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారిమని పోలీసులకు చెప్పారని సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నైల్ సింగ్, ఇతను హర్యానా నివాసి. రెండో షూటర్ ధరమ్‌రాజ్ కశ్యప్.. ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్ధిఖీ ఇంటికి రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది.గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్‌ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్లో ఉండగా, రెండోసారి పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్‌కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్‌తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్‌తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్ బిష్ణోయ్‌కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ -
పుతిన్‌తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్‌తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్‌గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్‌వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్‌గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్‌వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
స్నేహమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది
సాక్షి, హైదరాబాద్: మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని.. జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు డీజీపీ జితేందర్. తాను ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారాయన. 36 ఏళ్ల తమ స్నేహ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశామని, ఆ మధురస్మృతులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు డీజీపీ జితేందర్... ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరు ప్రస్తుతం జార్ఖండ్‌లో ఐఏఎస్‌గా పనిచేస్తున్న డా.ఏపీ సింగ్, మరొకరు కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డా.రాజీవ్ వర్‡్షనై. మేం ముగ్గురం ఢిల్లీ జేఎన్‌యూలో స్కూల్ లైఫ్ సైన్స్‌లో ఎంఫిల్ చేశాం. ఐదేళ్లపాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం.. మా జీవితాలను మలుపు తిప్పింది ఆ ఐదేళ్లే. యూపీఎస్సీకి బీజం పడింది అక్కడే.. నేను ఈ రోజు డీజీపీగా ఉన్నానంటే అందుకు ఆ స్నేహమే కారణం. నేను ఐపీఎస్, ఏపీ సింగ్ ఐఏఎస్, రాజీవ్ సైంటిస్ట్‌లుగా కెరీర్ మలచుకున్నాం. 36 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది.. నా ప్రతి కష్టంలో, సంతోషంలో ప్రాణ మిత్రులిద్దరూ నాతో ఉన్నారు. మేం ఎప్పుడు కలిసినా కుటుంబాలతో సహా కలుస్తాం. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి తప్పకుండా మా ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ ఉంటుంది. స్నేహం గురించి చెప్పాలంటే ఏదో ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ నిలవదు. ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్..ఒక సెక్యూరిటీ..మంచి స్నేహితులున్న వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఉత్తమ జీవితం గడుపుతారు. అందుకు నేను ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు ఉంటే ఏ ఒత్తిడీ మన దరి చేర దు. అందుకే యువతకు నేను చెప్పేది ఒక్కటే. మంచి స్నేహితులను సంపాదించుకోండి.. జీవితాన్ని ఫలవంతంగా..ఆనందంగా గడపండి’’అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్‌కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్‌లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్‌లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్‌లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
‘భారత్ ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదు’
న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా స్థిరంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదని స్పష్టం చేశారు. జర్మనీకి చెందిన వార్త పత్రికతో కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్న వేళ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. ‘పూర్వపు అనుభావాలతోనే ప్రతి ఒక్కరూ మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారు. నాకు తెలిసినవరకు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భారత్-రష్యా ఇరు దేశాలు కూడా ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, చాలా స్నేహిపూరిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుభావాల రీత్యా మాస్కోతో భారత్ స్నేహబంధం బలంగా ఉంది’ అని విదేశాంగ మంత్రి జై.శంకర్ పేర్కొన్నారు. రష్యా వద్ద భారత్ ముడి చమురు కొనుగోలు విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘రష్యా నుంచి ముడి చమురరు కొనగోలు చేయకుండా ప్రతి ఒక్కరూ.. ఇతర దేశాల మీద ఆధారపడితే.. ఇతర దేశాల్లో చమురుపై డిమాండ్ అధికమై ధరలు పెరిగేవి’అని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా వద్ద చమురు కొనుగోళ్లు ఆపకపోవటం గమనార్హం. ఇక.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే రష్యా యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చదవండి: మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం -
పాక్, ఇరాన్ దోస్తీ ఎందుకు చెడింది? భారత్‌కు ఏం దక్కింది?
పాకిస్తాన్, ఇరాన్‌లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండూ ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965, 71లో భారత్-పాక్ యుద్ధ సమయంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ ఫోరమ్‌లలో కూడా, ఇరాన్.. భారత్‌ను వ్యతిరేకించి, పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్‌పై ఇరాన్ వైమానిక దాడి నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి కారణమేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఇరాన్.. భారత్‌తో ఎందుకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది? 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తరువాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధికశాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా.. సున్నీ గ్రూపులు రెండూ ముస్లిం మతానికే చెందినవైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులని అంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్‌ను షియా ముస్లింలు హత్య చేసిన దరిమిలా షియా.. సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. విభజన సమయంలో.. 1947 ఆగస్టు 14న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం ఇరాన్. ఈ రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరి అనుసంధానంతో 990 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1947 తరువాత ఇరాన్, పాకిస్తాన్ మధ్య పలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్లో పాకిస్తాన్ తన తొలి రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. భారత్- పాక్ యుద్ధ సమయంలో.. 1965లో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అనేక బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ సామగ్రిని పాకిస్తాన్‌కు అందించింది. ఈ ఉదంతాన్ని చూస్తే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో దౌత్య, సైనిక మద్దతు ఇచ్చింది. అంతే కాదు బలూచ్‌లు పాకిస్తాన్‌పై తిరుగుబాటును ప్రారంభించినప్పుడు, బలూచ్‌ల నిరసనను అణచివేయడంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు సహాయం చేసింది. ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఇరాన్లో అణు కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సహకరించారు. షియా, సున్నీల అంతర్గత పోరు 1990వ దశకంలో పాకిస్తాన్లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు, ఇరాన్ షియాలను రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. దీనికితోడు లాహోర్‌లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజి హత్య, 1990లో పాకిస్తాన్-ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్, ఇరాన్‌ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్‌కు మద్దతు పలుకుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇరాన్.. పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-అద్ల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్.. పాక్‌పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఉద్రిక్తంగా పాక్- ఇరాన్ సంబంధం నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 నుండి పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పలు ఒప్పందాలు, సంయుక్త సైనిక విన్యాసాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరగడం ప్రారంభమైంది. దీనికితోడు ఈ రెండు దేశాలు విద్యుత్ పంపిణీ లైన్‌ను ప్రారంభించాయి. 2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులపై పట్టు బిగించలేకపోయింది. అయితే ఇటీవల ఇరాన్లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌పై ఇరాన్ ఆకస్మిక దాడి చేసింది. దీంతో పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి ఉద్రిక్తంగా మారాయి. బలపడిన భారత్- ఇరాన్ బంధం పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇరాన్లో పర్యటించి, పలు కీలక ఒప్పందాలు చేసుకున్న దరిమిలా భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్ తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2016లో ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్‌కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలో ధృడత్వం ఏర్పడింది. 2022 సంవత్సరంలో మొదటిసారిగా సమర్కండ్లో ప్రధాని మోదీ..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కలుసుకున్నప్పుడు భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి. -
పాక్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?
చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కసరత్తుపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్‌కు 8794 మిలియన్ డాలర్ల (ఒక మిటియన్ అంటే రూ. 10 లక్షలు) విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది. 2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తుంది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్‌ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌తో కలసి నావికా విన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించనుంది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి. ఇది కాకుండా రెండు షిప్‌బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొననున్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌ను కూడా మోహరించినుంది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం. ఇది కూడా చదవండి: కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు? -
అలాంటి వాళ్లతో స్నేహం, విరోధం రెండూ వద్దు
దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు. విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం. నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు... -
సత్సాంగత్యం
ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం. ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా. పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా! ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు. ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని? ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్‌లో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్‌లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్‌లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్‌ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్‌ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్‌ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
ఈ ప్రేమ అనిర్వచనీయం
-
పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది?
-
ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌కు చెందిన అజు అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్‌స్థాన్‌కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్‌లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది. మూడేళ్లుగా పరిచయం తన పాకిస్థాన్ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్‌కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్‌సర్‌కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్బుక్ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సీమా హైదర్‌తో పోల్చకండి కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్‌తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది. సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్‌కు రానుందని ఆమె పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్‌కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్‌కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు. 2019లో పరిచయం కాగా ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్‌కు చెందిన అంజూ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు అరవింద్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వాలిడ్ పాస్పోర్టుతో.. అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఎఅప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్‌కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్‌గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
భారత్, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా..
చాలామందికి కాలేజీ రోజులు ఎంతో ఆనందంగా గడుస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాల అన్వేషణలో వారు తలమునకలై ఉంటారు. ఆటువంటి సమయంలో ఏర్పడిన స్నేహబంధం కొందరి విషయంలో జీవితాంతం నిలిచిపోతుంది. అటువంటి స్నేహితులు తమ స్నేహితుల కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఇలాంటి కాలేజీ స్నేహితులు రీ యూనియన్ పేరుతో కలుసుకుంటారు. ఇటువంటి దీర్ఘకాల స్నేహబంధానికి సంబంధించిన ఒక ఉదంతం రథిన్ రాయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. డాక్టర్ రాయ్ తనకు 31 ఏళ్లుగా స్నేహితునిగా ఉన్న తన క్లాస్మేట్ డాక్టర్ అలీ చీమాతో పాటు తాను ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. డాక్టర్ రాయ్ భారత్‌కు చెందిన వ్యక్తి. డాక్టర్ చీమా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. క్యాప్షన్‌లో డాక్టర్ రాయ్ ఇలా రాశారు..‘రథిన్ రాయ్ పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) భారత పౌరుడు, అలీ చీమా పీహెచ్డీ(కేంబ్రిడ్జ్) పాక్ పౌరుడు. స్కాలర్ షిప్ పొందుతూ చదువుకున్న వీరు సామాన్య కుటుంబాల నేపధ్యం నుంచే వచ్చారు’ ఈ పోస్టుకు 75 వేల వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు తమ హృదయాలను హత్తుకున్నదని కొందరు అంటుండగా, ఈ ఫొటో వైరల్ అయ్యేందుకు అర్హత కలిగినదని పలువురు పేర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి Rathin Roy PhD (Cambridge). India citizen Ali Cheema PhD (Cambridge). Pakistan citizen Scholarship students ordinary background 31 years of friendship, collegial affection. We can still meet without being lynched Thank you, London the melting pot of the subcontinent ♥️ pic.twitter.com/nc4SWtAKiR — rathin roy (@EmergingRoy) July 17, 2023 -
ఈ స్నేహం ఎంత గొప్పదో
-
ఎల్కేజీ ఫ్రెండ్‌ను దగ్గర చేసిన ఇన్స్టాగ్రామ్
చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో తన కథను వీడియో రూపంలో వివరించింది. తాను తన లోవర్ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు. ఇందుకోసం తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్‌లు చేస్తూ, ఫొటోలను చెక్ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్‌లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్ సోషల్ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు. -
మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
ప్రపంచాన్ని మరో కొత్త మాంద్యం చుట్టుముడుతుందట.. అదే ‘స్నేహ మాంద్యం’ (friendship recession). ప్రముఖ స్టాక్ బ్రోకరింగ్ సంస్థ జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, ఇటీవలే తన సోదరుడు, వ్యాపార భాగస్వామి నితిన్‌తో కలిసి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో చేరిన నిఖిల్ కామత్ ఈ మాట అన్నారు. జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను ఇలా గుర్తు చేశారు. ఒంటరితనం, స్నేహ బంధానికి సంబంధించి అమెరికన్ పర్స్పెక్టివ్స్ సర్వే గ్రాఫిక్ చిత్రాలను నిఖిల్ కామత్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఆప్యాయతను పంచే మిత్రులు, సంక్షోభ సమయాల్లో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్నేహితులు తగ్గిపోవడాన్ని స్నేహ మాంద్యంగా ఆ చిత్రాల్లో పేర్కొన్నారు. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం అని కూడా అందులో రాసి ఉంది. తనకు సోదరులలాంటి ఐదుగురు స్నేహితులు ఉన్నారని, వారి కోసం తాను ఏదైనా చేస్తానని నిఖిల్ కామత్ వెల్లడించారు. స్నేహ బంధం జీవితాన్ని మారుస్తుందన్నారు. ఈ ట్వీట్లో ఆయన స్నేహానికి సంబంధించిన విషయాలతోపాటు మానవ సంబంధాలు, వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేశారు. వీటికి సంబంధించిన వివరణాత్మక గ్రాఫ్‌ను షేర్ చేశారు. The more #philosophy you read (not stoic), having a community seems to be the biggest precursor to #happiness (as fleeting as it might be). I have 5 bros in my life I would do all for, life-changing this is, seriously ♥️ pic.twitter.com/jMxVDKs031 — Nikhil Kamath (@nikhilkamathcio) May 26, 2023 ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
స్నేహమొక్కటి నిలిచి వెలుగును
ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్ అలీఖాన్ ‘మొఘల్ ఏ ఆజమ్’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్ అలీఖాన్ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది. లతా మంగేష్కర్ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్ ఉన్న వంట తిని ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో మరల పాడుతుందో లేదో తెలియదు. కాని గీతకర్త మజ్రూ సుల్తాన్‌పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది. గబ్బర్‌సింగ్‌గా విఖ్యాతుడైన అంజాద్ ఖాన్ అమితాబ్‌కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కార్ యాక్సిడెంట్ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్‌కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్ ఖాన్ బతికాడు. స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు. ఈద్ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద. విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి. అమ్మ వండితే ‘ఖీర్’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. క్యా భాయ్ అని ఒకరు.. ఏవోయ్ అని ఒకరు.. స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. ‘ప్యార్ కియా జాయ్’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్‌ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్‌ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్ అంటే మెహమూద్ దడుచుకు చచ్చే హారర్ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్ యాక్షన్ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్ రియాక్షన్ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్‌కు ఆ సంవత్సరం బెస్ట్ కమెడియన్‌గా ఫిల్మ్‌ఫేర్ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్ అందుకున్న మెహమూద్ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే. కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్తో ఒక ముస్లిం తబలా జుగల్బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్‌తో అంటే ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పుర వీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి. సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్‌కుమార్ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్ జకీర్ హుసేన్ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్‌గా మారితే ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు. కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుఫాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాలబిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్థిల్లుతుంది. -
యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్ గాయపడిన కొంగను కాపాడినందుకు అతనిపైకేసు నమోదైన సంగతి తెలిసిందే. రైతు ఆరిఫ్ ఆ కొంగను కాపాడటంతో అతనితోనే ఉండిపోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించిన ఉదంతం మరువుక మునుపే అచ్చం అలాంటి కొంగ స్నేహమే యూపీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ వ్యక్తికి మాత్రం కొంగతో స్నేహం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ మేరకు యూపీలోని మౌకీకి చెందిన రామ్‌సముజ్ యాదవ్ అనే వ్యక్తికి తన పొలంలో ఈ కొంగ కనిపించింది. దానికి అనుకోకుండా ఒకరోజు ఆహారం పెట్టడం జరిగింది. అలా రెండు సార్లు చేశాడు. అంతే ఆ కొంగ అతని వద్దకు పదేపదే రావడం జరిగింది. దీంతో ఆయన ఆ కొంగను మిగతా కొంగల గుంపులో వదిలేసినా, వేరు చేసేందుకు యత్నించినా అది మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేస్తోంది. రాజ్‌సముజ్ పిలుపు వినగానే వచ్చే ఈ కొంగ.. ఆయన ఎక్కడకు వెళ్తుంటే అది అక్కడకు వెళ్తోంది. వాస్తవానికి యూపీ రాష్ట్ర పక్షి అయినా ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద పెంచుకోవడం నేరం, పైగా ఇవి రెడ్‌లిస్ట్ పెట్ బర్డ్స్ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టారు. #WATCH | Heartwarming bonhomie between a Sarus crane and Mau's Ramsamuj Yadav in Uttar Pradesh I had found it on the farm where I had fed it once. After feeding it twice initially, it started to come to me repeatedly. It roams around freely in the village: Ramsamuj Yadav pic.twitter.com/W9Fw3Ozwdu — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2023 (చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు) -
చరణ్,తారక్‌ల స్నేహానికి ఏమైంది? దూరంగా ఉండటానికి కారణం అదేనా?
-
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
సో క్యూట్.. బుజ్జి కుక్కపిల్లకు కోడి పిల్ల సాయం.. చూస్తుంటే ఎంత ముద్దుగుందో!
-
స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్‌లా
తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది. స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్‌లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు. -
ఇరాన్, సౌదీ అరేబియా స్నేహగీతం
దుబాయ్: ప్రత్యర్థి దేశాలుగా ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న ఇరాన్, సౌదీ అరేబియా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తున్నాయి. దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు, రాయబార కార్యాలయాలను తెరిచేందుకు ఇరు దేశాలు శుక్రవారం అంగీకారానికొచ్చాయి. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఏడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. చైనా చొరవతో మళ్లీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సాయుధ ఘర్షణ తలెత్తే ప్రమాదం ఇక తప్పినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. గల్ఫ్‌లోని అరబ్ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వైపు మొగ్గుచూపకుండా చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, సౌదీ అరేబియా నడుమ ఇటీవలే సయోధ్య కుదిర్చింది. ఇది చైనాకు దౌత్యపరంగా అతిపెద్ద విజయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్, సౌదీ అరేబియా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అయితే, దీనిపై చైనా మీడియా ఇంకా స్పందించలేదు. యెమెన్‌లో ఇరాన్, సౌదీ అరేబియా ఘర్షణలు కూడా çసమసేలా కనిపిస్తున్నాయి.