న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా స్థిరంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదని స్పష్టం చేశారు. జర్మనీకి చెందిన వార్త పత్రికతో కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్న వేళ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను జైశంకర్ మరోసారి గుర్తు చేశారు.
‘పూర్వపు అనుభావాలతోనే ప్రతి ఒక్కరూ మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారు. నాకు తెలిసినవరకు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భారత్-రష్యా ఇరు దేశాలు కూడా ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, చాలా స్నేహిపూరిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుభావాల రీత్యా మాస్కోతో భారత్ స్నేహబంధం బలంగా ఉంది’ అని విదేశాంగ మంత్రి జై.శంకర్ పేర్కొన్నారు.
రష్యా వద్ద భారత్ ముడి చమురు కొనుగోలు విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘రష్యా నుంచి ముడి చమురరు కొనగోలు చేయకుండా ప్రతి ఒక్కరూ.. ఇతర దేశాల మీద ఆధారపడితే.. ఇతర దేశాల్లో చమురుపై డిమాండ్ అధికమై ధరలు పెరిగేవి’అని తెలిపారు.
ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా వద్ద చమురు కొనుగోళ్లు ఆపకపోవటం గమనార్హం. ఇక.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే రష్యా యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment