చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో తన కథను వీడియో రూపంలో వివరించింది.
తాను తన లోవర్ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్‌కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు.
ఇందుకోసం తాను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్‌లు చేస్తూ, ఫొటోలను చెక్ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు.
ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్‌లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్ సోషల్ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment