రెజీనా కొత్త నిర్ణయం | New decision to Regina | Sakshi
Sakshi News home page

రెజీనా కొత్త నిర్ణయం

Apr 26 2016 2:01 AM | Updated on Apr 3 2019 9:14 PM

రెజీనా కొత్త నిర్ణయం - Sakshi

రెజీనా కొత్త నిర్ణయం

నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ...

నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ తమిళంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటించిన రెజీనా తెలుగులోనూ తక్కువ చిత్రాలలోనే నటించారు. ప్రముఖ హీరోయిన్‌గా తాను రాణించాలనే ఆసక్తి రెజీనాకు అధికంగానే ఉంది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అయితే తనకు తగిన పాత్రలు ఎంపిక చేయకపోవడం, ఫెయిల్యూర్ చిత్రాలలో నటించడం ఆమె పురోగతికి అడ్డుగా నిలిచింది. షూటింగ్‌కు వచ్చినా ఎవరితోను మాట్లాడకుండా దూరంగా కూర్చునేవారు.

దీంతో సహ నటీనటులు ఆమెతో సహజంగా మెలిగేందుకు సంశయించేవారు. ఇతరులతో సన్నిహితంగా ఉంటే తిప్పలు తప్పవని భావించిన రెజీనాకు అదే తంటాగా మారింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే చిత్రరంగంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. పాత పొరపాట్లను తలచుకుని మనస్తాపానికి గురైన రెజీనా ప్రస్తుతం ఇతరులతో సన్నిహితంగా మెలుగుతున్నా స్నేహం అని చెప్పుకునేందుకు పెద్దగా లేరు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో అవకాశాలను అందుకునేందుకు గ్లామరస్‌గా నటించేందుకు సిద్ధమని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement