
కోతి మావా.. ఇలా రా.. నీకో సీక్రెట్ చెబుతా..
జాతి వైరం మనకొద్దు.. స్నేహమే ముద్దు అంటున్నాయి ఈ జంతువులు. సాధారణంగా కోతి, కుక్క ఒకేచోట ఉండవు. కుక్క కనిపిస్తే కోతి ఆ పరిసరాల్లో ఉండదు. అటువంటిది నల్లజర్ల జంక్షన్‌లో ఓ కోతి, కుక్క రెండూ ఆటలాడుకుంటూ గురువారం ఇలా కెమెరాకు చిక్కాయి. వాటిని చూసిన స్థానికులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు.