నాతో స్నేహం చేస్తావా?
ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి స్నేహితులు లేరు. ఒకరోజు అది ఎవరితోనైనా స్నేహం చేద్దావునుకుంది. దానికి ఒక కుందేలు కనిపించింది. ‘‘నువ్వు నాతో స్నేహం చేస్తావా?’’ అంటూ కుందేలును అడిగింది ఏనుగు. ‘‘అమ్మో నీతోనా? నువ్వు సరిగా చూసుకోకుండా కాలు వేస్తే నీ కాలి కింద నలిగి చచ్చిపోతా!’’ అంది కుందేలు. ఏనుగు ఒక కోతిని కలుసుకుని తన కోరిక చెప్పింది. ‘‘నేనేమో చెట్లమీద గెంతుతూ ఉంటాను. నువ్వేమో నేల మీద నడుస్తావు. వునకెలా స్నేహం కుదురుతుంది.?’’ అంటూ కిచకిచలాడింది కోతి.
ఇంతలో ఒక కప్ప కనిపించడంతో, కనీసం కప్పతోనైనా స్నేహం చేయూలనుకుంది ఏనుగు. దాని కోరిక విని కప్ప- ‘‘నిన్ను చూసి నా స్నేహితులంతా భయుంతో పారిపోతారు. నీతో స్నేహం వద్దు బాబూ’’ అంటూ చెరువులోకి దూకి వెళ్ళిపోరుుంది కప్ప.
ఆ తరువాత ఏనుగు చాలా జంతువులను కలుసుకుంది. చివరకు తాబేలును కూడా అడిగింది తనతో స్నేహం చేయువుని. కానీ అన్నీ దాని భారీ ఆకారాన్ని చూసి భయుపడ్డారుు.
ఏం చేయూలో పాలుపోక నిరాశగా ఒక చెట్టు కింద నిలబడింది ఏనుగు. ఇంతలో అడవిలోని జంతువులన్నీ ప్రాణభయుంతో పరుగెత్తసాగారుు. ‘‘ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నారు’’ అంటూ ఒక జింకను ఆపి అడిగింది ఏనుగు. ‘‘పులి... పులి వువ్ముల్ని చంపడానికి వూ వెంట పడింది.’’ వుుందుకు ఉరుకుతూ చెప్పింది జింక. ఏనుగుకు చాలా కోపం వచ్చింది. పులిని వెతుక్కుంటూ వుుందుకు వెళ్ళింది. భీకరంగా గర్జిస్తూ దారిలోనే ఎదురుపడింది పులి. ‘‘నీకు తినడానికి ఈ అవూయుకపు ప్రాణులే దొరికాయూ?’’ దారికి అడ్డంగా నిలబడి అడిగింది ఏనుగు. ‘‘ప్రశ్నించడానికి నువ్వెవరు?’’ గాండ్రించింది పులి. ఏనుగు పులిని ఒక్క తన్ను తన్నింది. పులి ఎగిరి దూరంగా వెళ్ళి పడింది. తర్వాత అవమాన భారంతో అక్కడి నుండి చల్లగా జారుకుంది.
పొదల చాటు నుండి ఈ దృశ్యం చూసిన జంతువులు సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఏనుగు వుుందుకు వచ్చారుు. ‘‘నీలాంటి మిత్రుడు ఒక్కడుంటే చాలు. నీ వంటి బలశాలి, ధైర్యవంతునితో స్నేహం చేయడం మాకెంతో సంతోషం’’ అంటూ ఏనుగు చుట్టూ జంతువులన్నీ చేరి తవుతో స్నేహం చేయువుని ప్రాధేయుపడ్డారుు. ‘ఒక వుంచిపని ఎంతవుంది స్నేహితులను సంపాదించి పెడుతుందో కదా’ అని ఆనందించింది ఏనుగు.