Rabbit
-
కుందేళ్లు, నాటుకోళ్ల పెంపకంతో నెలకు మంచి ఆదాయం
-
కుందేళ్ల పెంపకంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!
-
ఘోరం: కుందేలు అనుకోని మిత్రునిపై తూటా.. దీంతో..
సాక్షి, మైసూరు(కర్ణాటక): వలస కూలీ బతుకు విషాదాంతమైంది. కుందేలు అనుకుని స్నేహితుడు కాల్చడంతో చనిపోయాడు. వివరాలు.. కేరళకు చెందిన ఎంఎస్ ప్రసన్న, నంజనగూడు తాలూకాలోని కురిహుండి గ్రామంలో అల్లం తోటలో కూలీ. నంజనగూడు తాలూకా కుత్తువాడి గ్రామానికి చెందిన స్నేహితుడు నిషాద్ ఇంటికి ప్రసన్న భోజనానికి బయల్దేరాడు. అదే సమయంలో నిషాద్ కుందేళ్లను వేటాడాలని తుపాకీతో పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. దూరంగా పొదల్లో ప్రసన్న నడిచి వస్తుండగా కుందేలు అనుకుని నిషాద్ తుపాకీ పేల్చాడు. దగ్గరికి పోయి చూడగా ప్రసన్న తూటా తగిలి గాయపడి ఉన్నాడు. వెంటనే కేఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నిషాద్ పరారీలో ఉన్నాడు. హుల్లహళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చదవండి: మనోవేదన: చితి పేర్చుకుని దూకేశాడు -
కాలు మీద కాలు
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది. ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని! -
ప్రపంచంపై మరో హ్యాకింగ్ పిడుగు
మాస్కో : సైబర్ నేరగాళ్లు ప్రపంచంపై మరోసారి మల్వేర్‌తో విరుచుపడ్డారు. ఎంత పటిష్టంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా.. హ్యాకర్లు మాత్రం అంతేస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ప్రపంచాన్ని బ్యాడ్‌రాబిట్ మల్వేర్ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, జపాన్లపై బ్యాడ్‌రాబిట్ తీవ్రస్థాయిలో దాడి చేసింది. స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరస్థులు.. మల్వేర్లతో హ్యాకింగ్ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నారు. బ్యాడ్‌రాబిట్ ఎఫెక్ట్‌తో రష్యా, ఉక్రెయిన్‌లో విమానాలు నిలిచిపోయాయని రష్యన్ ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. హ్యాకర్లు.. మల్వేర్లతో ప్రపంచం మీద దాడి చేసే అవకాశముందని రెండు నెలల కిందటే అమెరికా నిఘా వర్గాలు.. ప్రకటించాయి. భారీగా ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయని.. అప్పట్లోనే అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. హ్యాకర్లు.. మౌలిక వసతుల కల్పన, రవాణా, ఇతర ఆర్థిక వ్యవస్థలపై దాడి చేస్తారని సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ లిపోవస్కీ గతంలోనే పేర్కొన్నారు. బ్యాడ్‌రాబిట్ ర్యాన్సమ్వేర్ రకానికి చెందిన వైరస్. ఈ వైరస్ పొరపాటున కంప్యూటర్లలో ప్రవేశిస్తే.. సిస్టమ్ వెంటనే లాక్ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ ఓపెన్ చేసేందుకు బాధితుల నుంచి హ్యాకర్లు భారీ స్థాయిలో సొమ్మును డిమాండ్ చేస్తున్నారు. బ్యాడ్‌రాబిట్ లమ్వేర్ కారణంగా.. ఉక్రెయిన్‌లోని ఆడెస్సా ఎయిర్‌పోర్ట్‌లో విమానాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్యాసింజర్ల డేటాను అధికారులే స్వయంగా పరీక్షిస్తుండడం వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైబర్ పోలీస్ చీఫ్ మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. -
జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్
పాతబస్తీలోని మురిగి బజార్ లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక మురిగి బజార్ లోని మటన్ షాపులతో తనిఖీలు చేపట్టి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఓ షాప్ లో రెండు జింకల మాంసము, 24 కమ్మేసు పీటలు, 7 కుందేళ్లు, 2 అడవి పిట్టలని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షాప్ యజమాని సయీద్ జామర్ ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జంతువుల మాంసాన్ని, ఇతరత్రా సామాగ్రిని అటవీ శాఖ అధికారులకు అందజేశారు. -
విమానాలకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. విమానాశ్రయ రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం తృటిలో తప్పిందని రన్ వే అధికారులు ప్రకటించారు. అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. భయాందోళనకు దారి తీసిందని.. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్‌పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకున్న ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానం జస్ట్ ల్యాండ్ అయ్యి ట్యాక్సీ వే వైపు పోతోంది. అదే సమయంలో స్పైస్ జెట్ విమానం టేక్ ఆఫ్(ఎగరడానికి) సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న అనుకోని ఘటన ఎందురైంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ రన్‌వై మీద కుందేలు ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆఖరి నిమిషంలో ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది ఒక్కక్షణం భయభ్రాంతులకు లోనయ్యారు. అటు రన్ వే పై కుందేలును గమనించినట్టు ఇండిగో పైలట్లు, రన్ వే క్లియర్ కాకుండా, ఇండిగోవిమానం అక్కడే ఉండడాన్ని చూసి అప్రమత్తమైనట్టు టేక్ ఆఫ్ తీసుకున్న స్సైస్ జెట్ పైలట్లు నివేదించారు. అయితే ఏటీసీ అధికారుల సూచనలతో విమానాల పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటు ఏవియేషన్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ ఉదంతంపై రెండు విమానాలకు చెందిన పైలెట్లు అహ్మదాబాద్ ఏటీసీకి తమ నివేదికను అందించారు. -
కుందేటి జ్వరం..!
మెడిక్షనరీ ఈ జబ్బు పేరు కుందేలు జ్వరం. పేరుకు కుందేలు జ్వరం అయినా నిజానికి ఇది ఫ్రాన్సిస్ టులరెన్సిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు కాబట్టి దీన్ని వైద్యపరిభాషలో ‘టులెరేమియా’ అని కూడా అంటారు. కుందేళ్లు, ఆ జాతికి చెందిన ఇతర ప్రాణుల వల్ల వాటి నుంచి మనుషులకూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెంపుడు కుందేళ్లకు తగిన వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే గ్లౌవ్స్ వంటివి తొడుక్కోవడం మేలు. ఇక కుందేలు జ్వరం వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్ట్రెప్టొమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ తరగతికి చెందిన యాంటీబయాటిక్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు. -
అంతరించే దశలో అరుదైన కుందేలు
లండన్: లావోస్, వియత్నాం అడవుల్లో నివసించే అరుదైన జాతికి చెందిన చారల కుందేలు ప్రస్తుతం అంతరించే దశలో ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అన్నామైట్ చారల కుందేలును పరిశోధకులు 1999లో గుర్తించారు. నాటినుంచి ఇప్పటివరకు ఇది చాలా తక్కువసార్లు మాత్రమే కనిపించింది. ఇటీవల దీన్ని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ) పరిశోధకులు కనుగొన్నారు. ఈ అరుదైన కుందేలు చరిత్రను తెలుసుకునేందుకు యూఈఏకు చెందిన సారా అనే పరిశోధకురాలు మూడు నెలలపాటు అధ్యయనం కొనసాగించింది. ఇతర కుందేళ్లతో పోల్చితే ఈ కుందేళ్లు జన్యుపరంగా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అయితే పెరిగిపోయిన జంతువుల వేట, అడవుల నిర్మూలన వల్ల ఇది అంతరించే ప్రమాదమున్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అరుదైన జీవులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడింది. -
కుందేలు కూన కష్టం!
పిల్లల కథ కుందేలు కూనకుట్టి పొదలగుట్టు కింది బొరియలో నుండి బిరబిర బయటికొచ్చి చిన్న క్యారట్ దుంపను కసకస కొరికి పసపస నమలసాగింది. తల్లి కుందేలు, ‘‘కుట్టీ! నీవు తల్లి చాటు పిల్లవి. పసికందువి. ఏ పులి కంటనో, తోడేలు కంటనో పడ్డావంటే అది నిన్ను లటుక్కున పట్టి చటుక్కున పొట్టన పెట్టుకుంటుంది. లోపలికొచ్చేయ్’’ అంది. కుట్టి, ‘‘అమ్మా! ఏ వైపు నుండీ ఏ మృగమూ వస్తున్న జాడ లేదు. ఇంతసేపూ మన బొరియలో ఉక్కతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇక్కడ నలువైపుల నుండీ మెల్లమెల్లగా వీస్తున్న చల్లటి పిల్లగాలుల వల్ల నా మనసు ఉల్లాసంతో ఉప్పొంగిపోతోంది. కాసేపు అటూ ఇటూ పచార్లు చేసి వస్తానే’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం. జాగ్రత్త’’ అంది తల్లి కుందేలు. కుట్టి ఏరు పారుతున్న వైపు గంతులేయసాగింది. ఉన్నట్టుండి ఏనుగు ఘీంకారం వినిపించింది. కుట్టి తటాలున ఓ చెట్టు చాటుకెళ్లింది. ఏనుగు తొండాన్ని పెకైత్తి, కిందికి విడుస్తూ, చెవులు ఆడిస్తూ, పెద్ద పెద్ద అడుగులేస్తూ పోయింది. ‘‘ఏనుగు రూపం కుట్టికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ దేవుడు ఏనుగును పొడుగాటి తొండంతో, చాటలంత చెవులతో ఎందుకు సృష్టించాడో! కొండ లాంటి ఆ వేదండానికి తిండి దండగ’’ అని నవ్వుకుంది. హఠాత్తుగా ఒక ఉరుము ఉరిమి, ఒక మెరుపు మెరిసింది. కుట్టి వేరపుతో వెనుదిరిగి పొదల గట్టువైపు కదిలింది. కొన్ని క్షణాలకు పిడుగు పడటంతో ఒక పాదపం పెళపెళమని విరిగి పొదల గుట్టమీద కూలింది. అది చూసిన కుట్టి ‘‘అయ్యో! అమ్మ, అమ్మకేమైందో’’ అని ఏడుస్తూ గుట్టను సమీపించింది. ‘అమ్మా’ అని పిలిచింది. గుట్ట కింది బొరియలో ‘ఉ, ఉ, ఉ’’ అంటూ మూలుగులు వినిపించాయి. గుట్ట మీద నుండి ఆ చెట్టును తొలగిస్తేనే, అమ్మ బతుకుతుంది. లేకపోతే ప్రాణానికే ప్రమాదం, అమ్మను ఎలాగైనా బతికించుకోవాలి’’ అని కుట్టి దగ్గర్లోనే ఉన్న వరాహాన్ని సాయం కోరింది. పంది చెట్టును తొలగించటానికి ప్రయత్నించింది కానీ చెట్టు ఇసుమంతైనా కదల్లేదు. కుట్టి గబగబ వెళ్లి ఎలుగుబంటిని పిల్చుకొచ్చింది. చెట్టును కదిలించబోయి భల్లూకం బోర్లాపడింది. అనుకోకుండా అగుపించిన అడవిదున్నను ఆపదలో ఆదుకొమ్మని అడిగింది కుట్టి. దున్న కొమ్ములతో తోసినా తరువు, ఎక్కడున్నావే గొంగళీ అంటే వేసిన చోటనే అన్న చందాన, ఉన్న తావు నుండి ఒకింతైనా మెదల్లేదు. మూడు జంతువులూ జారుకోవటంతో కుట్టి కలత చెందింది. ఎదురుగా ఉన్న వేపచెట్టు మీది నుండి అంతా గమనించిన కోతి కిందికి దిగివచ్చి, ‘‘కుట్టీ! ఇందాక వెళ్లిన ఏనుగు తిరిగి ఇటే వస్తోంది. వెళ్లి విషయం విన్నవించి, కన్నీటితో కరికాళ్ల మీద పడు. నీకు మేలు జరుగుతుంది’’ అంది. గజం రానే వచ్చింది. కుట్టి, ‘‘ఏనుగు పెద్దాయనా! పిడుగుపాటుతో ఈ చెట్టు పొదలగుట్ట మీద పడింది. గుట్ట కింద బొరియలో మా అమ్మ బందీ అయింది. ఊపిరాడక మూలుగుతోంది. ఈ చెట్టును పక్కకు తొలగించి, మా అమ్మను కాపాడు’’ అని వేడుకుంది. ‘‘ఆ మాత్రం దానికి అంతగా అడగాలా?’’ అని ఏనుగు వెంటనే తన తొండాన్ని చెట్టు చుట్టూ గట్టిగా చుట్టి, పట్టి అవలీలగా ఎత్తి ఆవల పడేసి వెళ్లిపోయింది. తల్లి కుందేలు రొప్పుతూ రోజుతూ బయటికొచ్చింది. కుట్టి అపారమైన ఆనందంతో అమ్మ అక్కున చేరింది. ఇంతకుముందు ఏనుగును గూర్చిన తన ఆలోచనలను గుర్తు తెచ్చుకొని సిగ్గుపడింది. అపురూపమైన ఏనుగు జన్మను తాను అపార్థం చేసుకుంది. భగవంతుడు ఏనుగు లాంటి బలమైన జంతువు వల్ల చిన్నా చితకా ప్రాణులకు ప్రాప్తించే ప్రయోజనమేమిటో కుట్టికి అవగతమైంది. తన తల్లికి తటస్థపడ్డ విపత్తు నుండి విముక్తి కలిగించిన మాతంగానికి మోదంతో మనసులోనే కృతజ్ఞత తెలిపింది కుట్టి. - నరిశేపల్లి లక్ష్మీనారాయణ -
తిక్క కుదిరింది
పిల్లల కథ ఒక అడవిలో నివసిస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు బాగా పొగరుగా ఉండేది. అది ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని ఉత్తపుణ్యానికి హింసిస్తూ ఉండేది. చివరకు చీమలను కూడా వదిలిపెట్టేది కాదు. ఆహారం కోసం అవి బారులు తీరి వెళుతూంటే, తొండంతో నీటిని తెచ్చి వాటిపై విరజిమ్మేది. చీమలు నీటి నుంచి బయటపడ్డానికి పడుతున్న అవస్థ చూసి ఆనందించేది. నిష్కారణంగా చెట్లకొమ్మలను విరిచి పడేసేది. అలా చేయడం తప్పని తోటి ఏనుగులు ఎన్నిసార్లు చెప్పినా పొగరుబోతు ఏనుగు తీరు మారలేదు. రాను రాను పొగరుబోతు ఏనుగు ఆగడాలు మితిమీరి పోవడంతో ఒకరోజు జంతువులన్నీ ఏకమై, తమ రాజైన సింహాన్ని కలిసి ఏనుగు పెట్టే బాధల్ని చెప్పాయి.సింహం వెంటనే వెళ్లి ఆ ఏనుగును తన వద్దకు తీసుకురమ్మని ఎలుగుకు పురమాయించింది. బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు. తర్వాత చిరుతపులి, తోడేలు, ఖడ్గమృగం, జింక వగైరా జంతువులకు చెప్పి చూసినా... ఆ ఏనుగు వద్దకెళ్లడానికి ఏ ఒక్కటీ సాహసించలేదు. ‘చాలా ఆశ్చర్యంగా ఉందే! కేవలం కబురు చెప్పడానికే భయపడిపోతున్నారేమిటి?’ అనుకుంటూ సింహం క్షణకాలం వాటన్నింటినీ పరీక్షగా చూసి, ‘‘ఇదిగో, కుందేలు బుల్లోడా! ఏనుగు వద్దకు నువ్వెళ్లు. ఎవరూ వెళ్లకపోతే సమస్య ఎలా పరిష్కారమవుతుంది?’’ అన్నది. కుందేలు లోలోపల భయపడుతూనే... ధైర్యం కూడగట్టుకొని పొగరుబోతు ఏనుగు చెంతకెళ్లి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది. ‘‘నేను రాను. కావలిస్తే ఆయనే వస్తాడు. నువ్వు ఫో!’’ అంది మహాగీరగా ఏనుగు. ఆగమేఘాల మీద వచ్చేసి, ఆ మాట సింహానికి చెప్పింది కుందేలు. ‘‘అబ్బో! చాలా పొగరుగా ఉందే. మీరంతా వెళ్లి దాన్ని మెత్తగా తన్ని తీసుకురాలేరా?’’ అంది చిరాకుపడుతూ సింహం. బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు. జంతువులేవీ నోరు మెదపలేదు. ‘‘మీరింత పిరికిపందలనుకోలేదు. సరే, ఇక చేసేదేముంది? నేనే వెళతాను’’ అని సింహం బయలుదేరబోతూంటే చీమలరాణి ముందుకొచ్చి, ‘‘మృగరాజా! ఆ ఏనుగు తమ చెంతకొచ్చేలా నేను చేస్తాను’’ అంది ధైర్యంగా. ఆ మాటలకు జంతువులన్నీ పెద్ద పెట్టున నవ్వాయి. ‘‘మీరెవ్వరూ చెయ్యలేని పని అది చేస్తూంటే సిగ్గుపడ్డం మాని నవ్వుతున్నారా’’ అంటూ వాటిని తిట్టి, చీమలరాణిని వెళ్లమని ప్రోత్సహించింది సింహం. తక్షణం చీమలను వెంటబెట్టుకొని ఆ ఏనుగు ఉండే తావుకు చేరుకొంది చీమలరాణి. కొంతసేపటి తర్వాత పొగరుబోతు ఏనుగు, సింహం సమక్షానికి వచ్చింది. ఏనుగు హఠాత్తుగా రావడం చూసి, అది ఎవరిమీద విరుచుకుపడుతుందోనని అక్కడున్న జంతువులన్నీ భయపడ్డాయి. అయితే ఆ ఏనుగు ఏదో బాధతో సతమతమవుతూ సింహాన్ని సమీపించి, ‘‘రాజుగారూ! నేను ఆదమరచి నిద్రపోతుంటే చీమలు నా తొండంలో దూరి, అదే పనిగా కుడుతున్నాయి. అమ్మో! ఈ మంట భరించలేకపోతున్నాను. నన్నిలా బాధించడం వీటికి తగునా?’’ అని మొరపెట్టుకుంది. సింహం మందహాసం చేస్తూ, ‘‘ఏనుగు తమ్ముడూ! బాధ అనేదెలా ఉంటుందో నీకిప్పుడు తెలిసిందా?’’ అంది. ‘‘తెలిసింది మృగరాజా!’’ అంటూ కంటనీరు పెట్టుకుంది ఏనుగు. ‘‘ఇకముందు ఏ జంతువునూ హింసించకుండా, వృక్షాలను ధ్వంసం చెయ్యకుండా ఉంటావా?’’ అడిగింది సింహం. ‘‘ఉంటాను రాజా. వనదేవత సాక్షిగా ఇంకెప్పుడూ బాధపెట్టను’’ అంది ఏనుగు. ఏనుగు అలా వాగ్దానం చెయ్యగానే చీమలరాణి, ఆమె సైన్యం దాని తొండంలో నుండి బయటకొచ్చేశాయి. ‘‘చూశారా! చీమలు చిన్నవే కావచ్చు, అవి కలిసికట్టుగా ఎంత శక్తిని ప్రయోగిస్తాయో ఇప్పుడు మీకు తెలిసిందిగా!’’ అంది సింహం. జంతువులన్నీ బుద్ధిగా తలలూపాయి. తెలివిగా పొగరుబోతు ఏనుగు పొగరణచినందుకు చీమలరాణిని, ఆమె సైన్యాన్ని ఎంతగానో మెచ్చుకుంది సింహం. - చోడిశెట్టి శ్రీనివాసరావు -
నాతో స్నేహం చేస్తావా?
ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి స్నేహితులు లేరు. ఒకరోజు అది ఎవరితోనైనా స్నేహం చేద్దావునుకుంది. దానికి ఒక కుందేలు కనిపించింది. ‘‘నువ్వు నాతో స్నేహం చేస్తావా?’’ అంటూ కుందేలును అడిగింది ఏనుగు. ‘‘అమ్మో నీతోనా? నువ్వు సరిగా చూసుకోకుండా కాలు వేస్తే నీ కాలి కింద నలిగి చచ్చిపోతా!’’ అంది కుందేలు. ఏనుగు ఒక కోతిని కలుసుకుని తన కోరిక చెప్పింది. ‘‘నేనేమో చెట్లమీద గెంతుతూ ఉంటాను. నువ్వేమో నేల మీద నడుస్తావు. వునకెలా స్నేహం కుదురుతుంది.?’’ అంటూ కిచకిచలాడింది కోతి. ఇంతలో ఒక కప్ప కనిపించడంతో, కనీసం కప్పతోనైనా స్నేహం చేయూలనుకుంది ఏనుగు. దాని కోరిక విని కప్ప- ‘‘నిన్ను చూసి నా స్నేహితులంతా భయుంతో పారిపోతారు. నీతో స్నేహం వద్దు బాబూ’’ అంటూ చెరువులోకి దూకి వెళ్ళిపోరుుంది కప్ప. ఆ తరువాత ఏనుగు చాలా జంతువులను కలుసుకుంది. చివరకు తాబేలును కూడా అడిగింది తనతో స్నేహం చేయువుని. కానీ అన్నీ దాని భారీ ఆకారాన్ని చూసి భయుపడ్డారుు. ఏం చేయూలో పాలుపోక నిరాశగా ఒక చెట్టు కింద నిలబడింది ఏనుగు. ఇంతలో అడవిలోని జంతువులన్నీ ప్రాణభయుంతో పరుగెత్తసాగారుు. ‘‘ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నారు’’ అంటూ ఒక జింకను ఆపి అడిగింది ఏనుగు. ‘‘పులి... పులి వువ్ముల్ని చంపడానికి వూ వెంట పడింది.’’ వుుందుకు ఉరుకుతూ చెప్పింది జింక. ఏనుగుకు చాలా కోపం వచ్చింది. పులిని వెతుక్కుంటూ వుుందుకు వెళ్ళింది. భీకరంగా గర్జిస్తూ దారిలోనే ఎదురుపడింది పులి. ‘‘నీకు తినడానికి ఈ అవూయుకపు ప్రాణులే దొరికాయూ?’’ దారికి అడ్డంగా నిలబడి అడిగింది ఏనుగు. ‘‘ప్రశ్నించడానికి నువ్వెవరు?’’ గాండ్రించింది పులి. ఏనుగు పులిని ఒక్క తన్ను తన్నింది. పులి ఎగిరి దూరంగా వెళ్ళి పడింది. తర్వాత అవమాన భారంతో అక్కడి నుండి చల్లగా జారుకుంది. పొదల చాటు నుండి ఈ దృశ్యం చూసిన జంతువులు సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఏనుగు వుుందుకు వచ్చారుు. ‘‘నీలాంటి మిత్రుడు ఒక్కడుంటే చాలు. నీ వంటి బలశాలి, ధైర్యవంతునితో స్నేహం చేయడం మాకెంతో సంతోషం’’ అంటూ ఏనుగు చుట్టూ జంతువులన్నీ చేరి తవుతో స్నేహం చేయువుని ప్రాధేయుపడ్డారుు. ‘ఒక వుంచిపని ఎంతవుంది స్నేహితులను సంపాదించి పెడుతుందో కదా’ అని ఆనందించింది ఏనుగు. -
సఫారీలో సహాయకారి
ప్లే టైమ్ కుందేలును పోలిన చెవులు, కంగారూను పోలిన తోక, ముంగీస వంటి రూపం, పందిని పోలిన మూతి... ఇన్ని పోలికలున్నా దీనికి వాటితో ఎలాంటి సంబంధమూ లేదు. దీని పేరు అర్ద్వర్క్. ఈ పేరు ఆఫ్రికాలోని గిరిజనుల భాష నుంచి వచ్చింది. సఫారీల్లో, ఆఫ్రికన్ ఎడారి ప్రాంతాల్లో కీటకాలు, చీమలను తింటూ బతుకుతుంది అర్ద్వర్క్. తీవ్రమైన వేడిమిని తట్టుకొనే శక్తి ఉంటుంది దీనికి. బలమైన పళ్లు, పొడవాటి నాలుక అర్ద్వర్క్కు ఉన్న ప్రత్యేకతలు. తన పళ్లతో నేలను తవ్వుతూ, పొడవాటి నాలుకతో చీమలనూ, చెదను పడుతూ ఆహారాన్ని సంపాదించుకొంటుంది. సఫారీల్లో దీనికి సింహాలు, హైనాలు, పైథాన్ల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. చిక్కాయంటే అర్ద్వర్క్లు వాటికి ఆహారం అయిపోతుంటాయి. అనువైన స్థానంలో గుంతలు తవ్వి, వాటిని నివాసానికి తగువిధంగా తీర్చిదిద్దుకొనే అర్ద్వర్క్లకు వలసవెళ్లే గుణం ఉంటుంది. అటువంటి సమయంలో ఇవి తవ్విన కందకాలు ఇతర చిన్న చిన్నజంతువులకు ఆవాసంగా ఉపయోగపడతాయి. అందుకే అర్ద్వర్క్లను ఇతర జంతువులకు సహాయకారులని అంటారు. -
త్రీమంకీస్ - 48
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 48 - మల్లాది వెంకటకృష్ణమూర్తి తాబేలు ఓటమిని అంగీకరించలేదు. ఆలోచించి కుందేలుని మళ్ళీ పోటీకి పిలిచింది. ఈసారి కుందేలు వేగంగా పరిగెత్తి ఫినిష్ లైన్‌కి ముందున్న ఓ చెరువు దగ్గర ఆగిపోయింది. దానికి ఈత రాదు. తాబేలు నింపాదిగా వచ్చి, చెరువులోకి దూకి, ఈది అవతల ఒడ్డున ఉన్న ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. ఈసారి నీతి ఏమిటి? గెలుపు కోసం నీ మార్గాన్ని మార్చుకో. ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు బ్రదర్. ఇది ముఖ్యమైన కథ. సరే. కుందేలు తాబేలుని మళ్ళీ పరుగు పోటీకి పిలిచి, తాబేలుతో - ‘చెరువు గట్టు దాకా నువ్వు నా భుజాన కూర్చో. చెరువుని దాటేప్పుడు నీ భుజం మీద నేను కూర్చుంటాను’ అని చెప్పింది. అందుకు తాబేలు ఒప్పుకుంది. ఆ ప్రకారం కుందేలు, దాని భుజం మీది తాబేలు చెరువు దాకా చేరుకున్నాయి. చెరువులోని నీళ్ళల్లో ఈదే తాబేలు వీపు మీద కుందేలు కూర్చుని చెరువుని దాటింది. ఆ రెండూ సమానంగా ఒకేసారి ఫినిషింగ్ లైన్‌ని చేరి రెండూ గెలిచాయి. నీతి ఏమిటి? ఎవరినైనా ఓడగొట్ట లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి నెగ్గు. నన్ను నువ్వు నెగ్గలేవు. సఖ్యత వల్ల ఇద్దరికీ మంచిదే. శతృత్వం వల్ల నీకు మాత్రమే నష్టం. ఏమంటావు?’’ మర్కట్, వానర్లు ఆ మాటల్ని మెచ్చుకుంటూ వెంటనే చప్పట్లు కొట్టారు. ‘‘సరే’’ కోపాన్ని దిగమింగుకుని దుర్యోధన్ చెప్పాడు. ‘‘జాగ్రత్త. మాట తప్పితే జైల్లోంచి ఒక్కరూ బయటకి వెళ్ళలేరు. జైల్లోంచి అంతా గమనిస్తూంటాం. రేపు రాత్రి పథకం ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘రేపు రాత్రి గార్డ్ మా అందరి సెల్స్ తాళాలు తెరుస్తాడు. పోలీసులు మర్నాడు కట్టి పడేసిన అతన్ని చూస్తారు. తేలు తేలు అని అరిచినందుకు తెరిచానని చెప్తాడు’’ దుర్యోధన్ చెప్పాడు. ‘‘ఇందాక నువ్వు ఫోన్ చేసింది అతనికే నన్నమాట.’’ ‘‘అదీ తెలుసా?’’ దుర్యోధన్ ఉలిక్కి పడ్డాడు. ‘‘మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ని మిల్లీ లీటర్ల మూత్రం పోసావో కూడా మాకు తెలుసు. ఏ సెల్ లోంచి సొరంగం తవ్వారు?’’ వానర్ అడిగాడు. ‘‘టు నాట్ టు సెల్ లోంచి’’ దుర్యోధన్ ఓడిపోయిన వాడి మొహం పెట్టి చెప్పాడు. ‘‘సొరంగం ఏ మేరకి తీశారేమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘దేనికి?’’ దుర్యోధన్ కోపంగా ప్రశ్నించాడు. ‘‘నేను చదివింది ఇంజనీరింగ్ కోర్స్. సొరంగం చుట్టు కొలత మూడు అడుగులు ఉంటే అంతకు రెట్టింపు సీలింగ్ పైన ఉండాలి. అంటే మూడడుగుల సొరంగానికి కనీసం ఆరు అడుగుల మట్టిపైన ఉండాలి. లేదా అది కూలే ప్రమాదం ఉంది. అదీ లెక్క.’’ ‘‘నాకా లెక్కలు తెలీవు కాని నా చిన్నప్పుడు నేను మా నాన్నతో దొంగతనాలకి వెళ్ళేవాడిని. ఆయన కన్నపు దొంగ. ఇలాంటి వాటిలో నాకు అనుభవం ఎక్కువ. నేను తీసిన ఏ సొరంగం ఇంత దాకా కూల్లేదు.’’ ‘‘ఇంకేం?’’ అతను దూరంగా వెళ్ళాక మిత్రులు ముగ్గురూ తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. ‘‘డాక్టర్ మూలిక ప్రవర్తన మీతో ఎలా ఉంది?’’ వానర్ అడిగాడు. ‘‘మామూలుగానే ఉంది. ఏం?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాతో మాత్రం పేషెంట్ - డాక్టర్ల మధ్య సంబంధంలా లేదు...’’ తన అనుభవాన్ని వివరించాడు. వెంటనే మర్కట్ సన్నగా ఈల వేసి చెప్పాడు. ‘‘నిన్ను రోజూ పిలుస్తోందా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి మూలిక నీతో ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఏమంటావ్?’’ ‘‘అవును. నాతో కూడా ఒకరు ప్రేమలో పడ్డారు. పేరు రుధిర’’ కపీష్ రుధిర గురించిన విషయాలు చెప్పాడు. ‘‘నా జోడీ గురించి మీ ఇద్దరికీ తెలుసు. ఆమె పేరు వైతరణి అని కూడా మీకు తెలుసు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మనం పారిపోయేందుకు వాళ్ళేమైనా ఉపయోగిస్తారేమో చూద్దాం. లేదా కనీసం మనకి బెయిల్ అయినా ఇప్పించవచ్చు. కాబట్టి వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచుదాం’’ కపీష్ చెప్పాడు. జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక విజిల్ ఊది చెప్పాడు. ‘‘అంతా మీ మీ సెల్స్‌కి వెళ్ళండి.’’ 13 ఆ రాత్రి మెస్‌లో గార్డ్లు ఎప్పటిలా ఖైదీల మీద ఓ కన్నేసి ఉంచారు. భోజనాల దగ్గర ఎప్పటిలా మిత్రులు ముగ్గురూ ఒకేచోట కూర్చుని గొంతు తగ్గించి మాట్లాడుకోసాగారు. ‘‘అడుగో దుర్యోధనుడు. నేను వెళ్ళి మేజిక్ నేర్పి వస్తాను’’ చెప్పి కపీష్ లేచాడు. దుర్యోధన్ ముందు కూర్చుని చెప్పాడు. ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని నువ్వు స్పెషల్ ఖైదీ అని పెట్టి ఉంటారు. దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిని పైకి విసిరేసి పైకి చూడసాగాడు. అంతా కూడా పైకి చూస్తూండగా ఆ లడ్డూని విసిరేస్తే మర్కట్ దాన్ని పట్టుకున్నాడు. ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు. వాళ్ళల్లో కదలిక లేదు. అంతా కపీష్ ధైర్యానికి, దుర్యోధన్ స్పందించకపోవడానికి ఆశ్చర్యపోయారు. గుసగుసలు మొదలయ్యాయి. (దేవుడ్ని నవ్వించడం ఎలా?)