కుందేటి జ్వరం..!
మెడిక్షనరీ
ఈ జబ్బు పేరు కుందేలు జ్వరం. పేరుకు కుందేలు జ్వరం అయినా నిజానికి ఇది ఫ్రాన్సిస్ టులరెన్సిస్ అనే ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు కాబట్టి దీన్ని వైద్యపరిభాషలో ‘టులెరేమియా’ అని కూడా అంటారు. కుందేళ్లు, ఆ జాతికి చెందిన ఇతర ప్రాణుల వల్ల వాటి నుంచి మనుషులకూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పెంపుడు కుందేళ్లకు తగిన వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే గ్లౌవ్స్ వంటివి తొడుక్కోవడం మేలు. ఇక కుందేలు జ్వరం వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్ట్రెప్టొమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ తరగతికి చెందిన యాంటీబయాటిక్స్‌తో దీనికి చికిత్స చేయవచ్చు.