
ముత్తారం: లక్కారం గ్రామానికి చెందిన సిలివేరు కుమార స్వామి(21) అనే యువకుడు జ్వరంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సిలి వేరు నర్సయ్య, శంకరమ్మ దంపతులకు ఒక కూతురు, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. కుమారస్వామికి తొలుత జ్వరం రాగా స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. జ్వరం తీవ్రత పెరగడంతో పెద్దపల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ అస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.