విమానాలకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
Published Sat, Feb 25 2017 3:35 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. విమానాశ్రయ రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం తృటిలో తప్పిందని రన్ వే అధికారులు ప్రకటించారు. అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. భయాందోళనకు దారి తీసిందని.. అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్‌పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకున్న ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానం జస్ట్ ల్యాండ్ అయ్యి ట్యాక్సీ వే వైపు పోతోంది. అదే సమయంలో స్పైస్ జెట్ విమానం టేక్ ఆఫ్(ఎగరడానికి) సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న అనుకోని ఘటన ఎందురైంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ రన్‌వై మీద కుందేలు ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆఖరి నిమిషంలో ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చేశారు. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో సిబ్బంది ఒక్కక్షణం భయభ్రాంతులకు లోనయ్యారు.
అటు రన్ వే పై కుందేలును గమనించినట్టు ఇండిగో పైలట్లు, రన్ వే క్లియర్ కాకుండా, ఇండిగోవిమానం అక్కడే ఉండడాన్ని చూసి అప్రమత్తమైనట్టు టేక్ ఆఫ్ తీసుకున్న స్సైస్ జెట్ పైలట్లు నివేదించారు. అయితే ఏటీసీ అధికారుల సూచనలతో విమానాల పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటు ఏవియేషన్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ ఉదంతంపై రెండు విమానాలకు చెందిన పైలెట్లు అహ్మదాబాద్ ఏటీసీకి తమ నివేదికను అందించారు.
Advertisement
Advertisement