భారీ వర్షం.. నిలిచిన విమానాలు | Air India Vistara IndiGo SpiceJet Disruptions Their Dubai Bound Flights | Sakshi
Sakshi News home page

Dubai Floods: భారీ వర్షం.. నిలిచిన విమానాలు

Published Thu, Apr 18 2024 12:47 PM | Last Updated on Thu, Apr 18 2024 1:01 PM

Air India Vistara IndiGo SpiceJet Disruptions Their Dubai Bound Flights - Sakshi

ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్‌కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్‌లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్‌కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. 

‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్‌ బుక్‌చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. 

ఇదీ చదవండి: ఎన్‌పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం!

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్‌కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement