మాన్‌సూన్ వచ్చేసింది.. విమానయాన సంస్థలు కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికుల ముందుకు వచ్చేశాయి. గగనతలంలో ఒక్కసారైనా చక్కర్లు కొట్టాలనే ఆశపడే వారి కలల్ని నేరవేర్చేందుకు విమానయాన సంస్థలు బిగ్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని సెక్టార్లలో విమాన టిక్కెట్లను అత్యంత తక్కువగా రూ.1,199కే ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ ఆఫర్ చేసే టిక్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం..
స్పైస్‌జెట్: ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమానాల్లో ప్రయాణించడానికి రూ.1,149 నుంచి టికెట్లు విక్రయిస్తోంది స్పైస్‌జెట్ సంస్థ. ఈ టిక్కెట్లను ఈనెల 30 వరకు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణకాలం జులై 1 నుంచి అక్టోబరు 8 మధ్యలో చేయవలసి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో వన్ వే ధరలకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందబుఆటులో ఉంటుంది.
ఇండిగో: ఎంపిక చేసిన మార్గాల్లో, ఎంపిక చేసిన విమానాలకు అన్ని ఎక్స్‌క్లూజివ్ ఫేర్స్‌ను కలుపుకుని టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభవుతుంది. ఇవి కూడా జూన్ 30 లోపు బుక్ చేసుకోవాలి. ప్రయాణం జులై 11 నుంచి సెప్టెంబరు 27 మధ్య చేసేవారికి అనుకూలం. మధ్యలో ఆగి మరో చోటుకి వెళ్లాలంటే కుదరదు. నాన్‌స్టాప్ గమ్యాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ బుకింగ్స్ ట్రావెల్ చేయడానికి 15 రోజుల ముందు వరకు మాత్రమే వాలిడ్‌లో ఉంటాయి.
గో ఎయిర్: స్వదేశంలో ప్రయాణానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో టిక్కెట్ ధర రూ.1199 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 30 వరకి ఈ బుకింగ్ పిరియడ్ ఉంటుంది. జూలై 10 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి ఈ టిక్కెట్లు వర్తిస్తాయి. బ్లాక్ తేదీలు అమల్లో ఉంటాయని, టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే వీటిని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందని గోఎయిర్ తెలిపింది. తేదీ మార్పు లేదా రూట్ల మార్పు ఉండదు. ఇన్‌ఫాంట్ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. తేదీ మార్పు, రీబుకింగ్, రీఫండ్ ఛార్జ్‌లు ఫేర్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి.
జెట్ ఎయిర్‌వేస్: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే వారికి కనీసధరపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. ఇది కూడా జూన్ 30 వరకే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 5 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఆమ్‌స్టర్ డ్యామ్, కొలంబో, పారిస్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇండియాలోనే ప్రయాణించాలనుకునే ఎంపిక చేసిన విమానాల ఎకానమీ టిక్కెట్ల బేస్ ఛార్జీకి 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు 30 శాతం వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రయాణాలనుకునే తేదీకి 15 రోజుల ముందస్తుగా ఈ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కిందనే అంతర్జాతీయ మార్గాల్లో ఎకానమీ విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయలు, ప్రీమియర్ విమాన టిక్కెట్లపై 2500 రూపాయల తగ్గింపు కూడా లభిస్తోంది.
ఎయిరేషియా: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణానికి 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులో జులై 1 వరకు టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. జులై 2 నుంచి నవంబరు 30 మధ్య ప్రయాణించే సౌలభ్యం ఉంది. వన్‌వేకి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. పేర్ల మార్పు ఉండదు.
ట్రూజెట్: హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.899 నుంచి ప్రారంభమవుతుంది. తమ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలంటే కూడా రాయితీ ఉంటుందని కంపెనీ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment