
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందు నిలిచి విశేష సేవలందిస్తున్న వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తామని ఇండిగో గురువారం తెలిపింది. టఫ్ కుకీ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో ఈ తగ్గింపును అందిస్తున్నట్టు వెల్లడించింది.
ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఏడాది చివరి వరకు వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇందుకు చెక్-ఇన్ సమయంలో వారి గుర్తింపునకు సంబంధించిన ఆసుపత్రి ఐడిలను అందించాల్సి ఉంటుందని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 టికెట్ల కొనుగోలుకు, ప్రయాణానికి ఈ తగ్గింపు చెల్లుతుందని తెలిపింది. అంతేకాదు వీరి ప్రత్యేకతను ప్రయాణంలో ప్రతి దశలో గుర్తించేలా చేస్తుందని వెల్లడించింది. ఇండిగో చెక్-ఇన్ వద్ద కుకీ టిన్, బోర్డింగ్ గేట్ వద్ద స్వాగత ప్రకటన, పీపీఈ కిట్ పై ప్రత్యేక టఫ్ కుకీ స్టిక్కర్ తోపాటు, విమానంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment