AirIndia express
-
ఎయిరిండియా సిబ్బందికి షేరింగ్ రూమ్
ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దుఅధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పెరుగుతున్న బుకింగ్‌లు
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. గోవా, జైపూర్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 పట్టణాల్లో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. సంస్థ ప్రకటించిన ‘ఎక్స్‌ప్రెస్ లైట్ జీరో-బ్యాగేజీ ఛార్జీ’లకు ఆదరణ ఎక్కువవుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు దేశీయంగా, దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారీగా టెకెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు 15న ఉన్న బుకింగ్‌లు పెరిగాయి.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలపంద్రాగస్టు ఉన్న మూడోవారంలో ప్రధానంగా గోవా, జైపూర్, బాగ్డోగ్రా, శ్రీనగర్, కొచ్చి, అయోధ్య, వారణాసి వంటి దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణాలు పెరుగనున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థకు అధిక రెవెన్యూ గల మార్గాల్లో కోల్‌కతా-కొచ్చి, బెంగళూరు-జైపూర్, హైదరాబాద్-వారణాసి, బెంగళూరు-బాగ్డోగ్రా, లఖ్‌నవూ-దుబాయ్, తిరుచిరాపల్లి-సింగపూర్, ఢిల్లీ-అయోధ్య ఉన్నాయని చెప్పారు. -
విమానం ఎక్కేయండి.. రూ. 883 లకే!!
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్‌ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్‌కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది. దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది. -
యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్పొరేట్ సంస్థలు ఓటర్లను ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ రాయితీ పొందాలనుకునే ప్రయాణికుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎన్నికల సమయంలో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమమంలో మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్‌ను వినియోగించాలి. ఈ ఆఫర్‌ను పొందే ప్రయాణికులు విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డ్‌లను సేకరించేటప్పుడు గ్రౌండ్ సిబ్బందికి తమ ఓటర్ ఐడీ కార్డును తప్పకుండా చూపించాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ భారతదేశంలోని 31 గమ్యస్థానాలకు తమ సర్వీసులను నడుపుతోంది. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్‌గార్గ్ మాట్లాడుతూ.. ‘త్వరలో సంస్థ 19 ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో యువ ఓటర్లకు ఈ 19 శాతం రాయితీ ఆఫర్‌ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలకపాత్ర పోషిస్తుంది. వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది’ అని అన్నారు. -
భారీ వర్షం.. నిలిచిన విమానాలు
ప్రపంచంలోనే రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దిల్లీ విమానాశ్రయంలో దుబాయ్‌కి వెళ్లే పది విమానాలు, దుబాయ్ నుంచి వచ్చే తొమ్మిది విమానాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. భారత్‌లోని వివిధ నగరాల నుంచి ఎయిరిండియా దుబాయ్‌కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. #6ETravelAdvisory: Flights to/fro #Dubai stand canceled until 12 PM on Apr 18, due to Airport restrictions and operational challenges caused by bad weather and road blockages. Do explore our alternate flight options or request for a full refund by visiting https://t.co/xe8o6KQdpT — IndiGo (@IndiGo6E) April 17, 2024 ‘రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం బాధిత ప్రయాణికులకు వసతి కల్పించడానికి కృషిచేస్తున్నాం. 16, 17 తేదీల్లో ప్రయాణాలకోసం టికెట్ బుక్చేసినవారు ఒకసారి తేదీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనున్నాం. దాంతో వారు తమ గమ్యస్థానాలు చేరేలా ఏర్పాటు చేస్తున్నాం’అని ఒక ప్రతినిధి చెప్పారు. #TravelUpdate: SpiceJet flights to/from Dubai (DXB) are affected due to adverse weather conditions in Dubai. Please refer link https://t.co/rNJZcxc6Wo for an alternate flight, or a full refund. You may also get in touch with our 24/7 Customer Care Helpline Numbers at +91 (0)124… — SpiceJet (@flyspicejet) April 17, 2024 ఇదీ చదవండి: ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో సహా ఇతర విమానయాన సంస్థలు దుబాయ్‌కి వెళ్లే మార్గంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్‌కి వెళ్లే అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రకటించింది. 2023 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
కాలిన వాసనతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 48 గంటల్లో నాలుగోది!
ఢిల్లీ: కాలికట్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు అధికారులు. విమానం క్యాబిన్‌తో పాటు ప్రయాణికులు ఏదో కాలిపోతున్నట్లు వస్తున్న వాసనను గుర్తించారు. దీంతో బీ737-800 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-ఏక్స్ఎక్స్ అనే విమానాన్ని అత్యవసరంగా మస్కట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు.. మస్కట్‌లో విమానం ల్యాండింగ్ చేసిన తర్వాత పరిశీలించగా.. ఎలాంటి మంటలు, పొగ, లీకేజీలు కనిపించలేదని అధికారులు తెలిపారు. 'కాలిన వాసన వచ్చిన నేపథ్యంలో విమానాన్ని క్షణ్నంగా పరిశీలించాం. రెండు ఇంజిన్లతో పాటు ఏపీయూ యూనిట్‌లోనూ ఎలాంటి మంటలు, పొగ, కనిపించలేదు. ఇంధనం, ఆయిల్, హైడ్రోజన్ లీకైనట్లు సైతం కనిపించలేదు.' అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రన్ వేపై విమానాన్ని అన్ని విధాల పరీక్షించినట్లు చెప్పారు. 48 గంటల్లో నాలుగో సంఘటన.. సాంకేతిక సమస్యలతో విమానాన్ని దారి మళ్లించటం ఒకే రోజులో ఇది రెండో సంఘటన కావటం గమనార్హం. అయితే.. 48 గంటల్లో ఇది నాలుగో సంఘటన. ఆదివారం ఉదయం ఓ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఈ విమానంలో మార్గ మధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీలో దించారు. భారత్‌కు చెందిన ఓ విమానం పాక్‌లో ల్యాండ్ కావడం గడిచిన రెండు వారాల్లో ఇది రెండోసారి. జులై 16న ఎథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తుండగా.. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జులై 15న శ్రీలంకకు చెందిన విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఇదీ చూడండి: Indigo Flight Emergency Landing: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
ఎయిర్ ఇండియా ఖాతాలో మరో 4 విమానాలు
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ కంపెనీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఖాతాలో కొత్తగా నాలుగు బోయింగ్ 737 రకం విమానాలు జతకూడనున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో డిమాండ్ పుంజుకుంది. ఈనేపథ్యంలోనే ఎయిరిండియా తాజా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ప్రయాణ అడ్డంకులు తొలగిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా అధికం అయిందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటికే సంస్థ వద్ద బోయింగ్ 737 విమానాలు 24 ఉన్నాయి. దీనికి మరో నాలుగు విమానాలు తోడు కావడంతో మొత్తం 28 విమానాలకు చేరనుంది.ఆగస్టు 2020లో కోజికోడ్ విమాన ప్రమాదంలో ఒక విమానాన్ని కోల్పోయింది. అన్ని విమాన మార్గాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సంఖ్య పరంగా కాలానుగుణ వ్యత్యాసాలు సహజమని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ప్రతిరోజు 100 సర్వీసుల ద్వారా భారత్‌లోని 13 విమానాశ్రయాలతోపాటు అంతర్జాతీయంగా 13 ఎయిర్‌పోర్టుల్లో ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆగస్టు18న హాంకాంగ్ ఎయిరిండియా విమానాలను ఆగస్టు 31వరకు సస్పెండ్ చేసింది. ఇది రెండో నిషేధం. (ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ) ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్తో ప్రయాణం చేసినప్పటికీ వారికి వ్యాధి నిర్ధారణ జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. కాగా ఇదే ఆరోపణలతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. (ఎయిరిండియా విమానాలపై నిషేధం) -
ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ తగిలింది. ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీరియస్ గా స్పందించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను15 రోజులపాటు నిషేధించింది. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 4న జైపూర్ నుండి దుబాయ్ వచ్చిన ప్రయాణీకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ అధారిటీ తన సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం ఇది రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2వ తేదీన జైపూర్ లోని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ ద్వారా అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంది. తద్వారా విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసారనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రాంతీయ మేనేజరుకు రాసిన లేఖలో ఆరోపించింది. కరోనా మహమ్మారి కాలంలో ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాన్ని ఉల్లంఘించారని మండిపడింది. -
మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్‌గ్రేషియా
సాక్షి,తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదంపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదిగా అభివర్ణించింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. (కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది) 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు, 12 ఏళ్లలోపు మృతుల కుటుంబీకులకు 5 లక్షల రూపాయలు చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించనున్నామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చెల్లిస్తామని పేర్కొంది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ప్రయాణీకులకు తగిన సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1800222271టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. 10 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు చెల్లిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. (విమాన ప్రమాదం : కరోనా కలకలం) -
రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు
సాక్షి, కోళీకోడ్: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాద దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. ప్రమాద స్థలంలో భయంతో పిల్లల రోదనలు మిన్నంటిన దృశ్యం హృదయాల్ని కదిలించక మానవు. రక్తమోడే దుస్తులతో కకావికలమైన ప్రయాణికులు ఒకవైపు..ఏం జరిగిందో తెలియని గందరగోళంలో తీవ్ర నొప్పితో క్షతగ్రాతుల ఆర్తనాదాలు, మరోవైపు అంబులెన్స్ సైరన్ల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ప్రమాద తీవ్రతను గమనించేలోపే ప్రయాణీకుల ప్రాణాల్లో కలిసిపోయిన వైనం బాధితుల బంధువుల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. (ఆయన ధైర్యమే కాపాడింది!) రెండు ముక్కలై పోయిన విమాన శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్న స్థానిక సివిల్ పోలీసులతో సహా రెస్క్యూ సిబ్బంది బాధితులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిన్న పిల్లలు సీట్ల క్రింద చిక్కుకుపోయిన దృశ్యం చాలా బాధ కలిగించిందని స్థానికులు చెప్పారు. భయంకరమైన శబ్దం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు... కొందరికి, చేతులు కాళ్ళు విరిగిపోయాయి.. వారిని తరలిస్తున్న సమయంలో తమ చేతులు, దుస్తులు రక్తంలో తడిచిపోయాయంటూ తన భయంకర అనుభవాన్ని వివరించారు. నాలుగైదు సంవత్సరాల లోపు పిల్లలు భయంతో తమకు అతుక్కుపోయారంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అంబులెన్స్‌లు చేరుకోడానికే ముందే గాయపడిన వారిని కార్లలో వివిధ ఆసుపత్రులకు తరలించడం ప్రారంభించామన్నారు. కాగా ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 10 మంది చిన్నారులతోపాటు 174 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉండగా, ఇద్దరు పెలెట్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. షార్జా, దుబాయ్‌లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. -
విమానంలో ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత : కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కొంతమంది ప్రయాణీకులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. విమాన టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే నలుగురు ప్రయాణికులకు ముక్కునుంచి రక్తం కారడం మొదలైంది. మరికొంతమంది చెవి నొప్పి లాంటి ఇతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణిల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మస్కట్ నుంచి ఎయిరిండియా విమానం కాలికట్( కాజీకోడ్) వెడుతుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. వెంటనే అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. బాధిత ప్రయాణీకులకు పూర్తి వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం ప్రమాదం ఏదీ లేదని తేల్చడంతో మస్కట్ విమానాశ్రయం నుంచి విమానం తిరిగి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. విమానంలో వైమానిక పీడనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నలుగురు ప్రయాణీకులకు ముక్కునుంచి రక్తస్రావం జరిగిందని వారికి తగిన చికిత్స అందిచినట్టు తెలిపారు. బోయింగ్ 737 , 8 ఐఎక్స్ -350 విమానంలో మొత్తం 185 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ముగ్గురు శిశువులు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
కొచ్చి: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు చేరుకున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ఎయిర్ పోర్టులోని టాక్సీవేనుంచి పార్కింగ్ వే వైపు దూసుకుపోయింది. దీంతో ముంగు బాగం బాగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సీఐఏఎల్) అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ, అలాగే డిఐజిసి ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి అందుబాటులో లేరు.