సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్పొరేట్ సంస్థలు ఓటర్లను ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ రాయితీ పొందాలనుకునే ప్రయాణికుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎన్నికల సమయంలో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమమంలో మొబైల్ యాప్, కంపెనీ వెబ్‌సైట్‌ను వినియోగించాలి. ఈ ఆఫర్‌ను పొందే ప్రయాణికులు విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డ్‌లను సేకరించేటప్పుడు గ్రౌండ్ సిబ్బందికి తమ ఓటర్ ఐడీ కార్డును తప్పకుండా చూపించాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ భారతదేశంలోని 31 గమ్యస్థానాలకు తమ సర్వీసులను నడుపుతోంది.
ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫారాలతో నష్టం ఎంతంటే..
ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్‌గార్గ్ మాట్లాడుతూ.. ‘త్వరలో సంస్థ 19 ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో యువ ఓటర్లకు ఈ 19 శాతం రాయితీ ఆఫర్‌ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత కీలకపాత్ర పోషిస్తుంది. వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment