![Milkipur by Election Result Strong Fight Between bjp and sp in Milkipur](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/bjp-main.jpg.webp?itok=S2ZMZJdH)
యూపీలోని అయోధ్య పరిధిలోగల మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీజేపీ 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అవధేష్ ప్రసాద్ ఎంపీ అయిన తర్వాత ఈ సీటు ఖాళీ అయింది. ఈ సీటు కోసం సమాజ్‌వాదీ పార్టీ, బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ అజిత్ ప్రసాద్‌ను బరిలోకి దింపగా, బీజేపీ చంద్రభాను పాస్వాన్‌ను ఎన్నికల్లో నిలబెట్టింది.
అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉన్నారు . ఉప ఎన్నికల్లో 10 మంది ఎన్నికల బరిలో దిగారు. కాగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఎస్పీ నిరాకరించింది. మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం రిజర్వ్డ్ సీటు. ఈ స్థానంలో పెద్ద సంఖ్యలో దళిత ఓటర్లు ఉన్నారు. వారు మద్దతు ఇచ్చే పార్టీ గెలవడం దాదాపు ఖాయమనే అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment