రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్‌పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.
హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్‌యూ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్‌జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్‌ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్‌పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు
Comments
Please login to add a commentAdd a comment