second list
-
రెండో విడత నామినేటెడ్ పందేరం
సాక్షి, అమరావతి: రెండో విడత నామినేటెడ్ పదవుల్లోనూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కంటి తుడుపుగా ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా పదవులు ఇచ్చారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండో దఫా 59 నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వీటిలో రెండు సలహాదారుల పదవులు ఉన్నాయి. ఏ పార్టీతో సంబంధం లేని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు విద్యార్థులకు నైతిక విలువలు బోధించే పదవిని ఇచ్చారు. మిగిలిన 58 పదవుల్లో జనసేనకు దక్కింది 9 మాత్రమే. బీజేపీకి రెండే పదవులు ఇచ్చారు.ఓ సలహాదారు పదవి సహా మిగిలినవన్నీ టీడీపీకే. మొదటి విడత ప్రకటించిన 20 కార్పొరేషన్లలోనూ కేవలం మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇచ్చి అవమానించారు. వీటితో సంబంధం లేకుండా టీటీడీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు తన ఇష్ట్రపకారం భర్తీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో 58 పదవులు ప్రకటించినా, అంతకంటే ఘోరంగా జనసేన, బీజేపీకి నామమాత్రంగా.. అదీ కూడా అసలు ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని ఆ పార్టీల నేతలు వాపోతున్నారు. కీలకమైన, ప్రాధాన్యం ఉన్న పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఎంఏ షరీఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. మిగిలిన 57 మందిని ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్పర్సన్లుగా నియమించింది. వీటిలో 18 కుల కార్పొరేషన్లు, 13 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్టు దక్కని నేతలకు ఈ జాబితాలో అవకాశం కల్పించారు.రెండోదఫా నామినేటెడ్ పదవులు సలహాదారులు 1. మహమ్మద్ షరీఫ్ – మైనారిటీ వ్యవహారాలు 2. చాగంటి కోటేశ్వరరావు – స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ వివిధ సంస్థల చైర్మన్లు 1. కుడిపూడి సత్తిబాబు – ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2. మాల సురేంద్ర – ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3. రోణంకి కృష్ణంనాయుడు – ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4. పీవీజీ కుమార్ – ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5. దేవేంద్రప్ప – ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6. ఆర్ సదాశివ – ఏపీ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7. సావిత్రి – ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీజేపీ) 8. పాలవలస యశస్వి – ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 9. కప్పట్రాల సుశీలమ్మ – ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10. సీఆర్ రాజన్ – ఏపీ వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11. నరసింహ యాదవ్ – ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 12. చిలకలపూడి పాపారావు – ఏపీ అగి్నకుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 13. వీరంకి వెంకట గురుమూర్తి – ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 14. గండి బాబ్జి – ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ 15. మంజులారెడ్డి రెంటచింతల – ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్టŠస్ అండ్ కల్చరల్ సొసైటీ 16. నీలాయపాలెం విజయ్‌కుమార్ – ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు 17. జీవీ రెడ్డి – ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ 18. మన్నవ మోహన్‌కృష్ణ – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ 19. తేజస్వి – ఏపీ కల్చరల్ కమిషన్ 20. పోలంరెడ్డి దినే‹Ùరెడ్డి – ఏపీ ఎని్వరాన్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ 21. సుజయ్‌కృష్ణ రంగారావు – ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 22. గోనుగుంట్ల కోటేశ్వరరావు – ఏపీ గ్రంధాలయ పరిషత్ 23. డేగల ప్రభాకర్ – ఏపీ ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 24. కేకే చౌదరి – ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు 25. చిల్లపల్లి శ్రీనివాసరావు – ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన ) 26. ప్రగడ నాగేశ్వరరావు – ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 27. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి – ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ 28. ఆనం వెంకట రమణారెడ్డి – ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 29. రఘురామరాజు – ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్సస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ 30. సావల దేవదత్ – ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్టŠస్ సర్టిఫికేషన్ అథారిటీ 31. రావి వెంకటేశ్వరరావు – ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 32. కావలి గ్రీష్మ – ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 33. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు – దొన్ను దొర, రెడ్డి అప్పలనాయుడు (జనసేన), సురేష్ రెడ్డి (బీజేపీ), పోలా నాగరాజు 34. సజ్జా హేమలత – ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ 35. గుమ్మడి గోపాలకృష్ణ – ఏపీ నాటక అకాడమీ 36. సీతంరాజు సుధాకర్ – ఎనీ్టఆర్ వైద్య సేవ 37. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ – స్వచ్ఛాంధ్ర మిషన్ 38. అల్లాడ స్వామినాయుడు – అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 39. టీసీ వరుణ్ – అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 40. రూపానందరెడ్డి – అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 41. సలగల రాజశేఖర్‌బాబు – బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 42. తెంటు లక్ష్మీనాయుడు – బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 43. కె హేమలత – చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 44. తుమ్మల రామస్వామి – కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 45. సోమిశెట్టి వెంకటేశ్వర్లు – కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 46. మట్టా ప్రసాద్ – మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బీజేపీ ) 47. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 48. బొడ్డు వెంకట రమణచౌదరి – రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 49. కె. రవికుమార్ – శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జనసేన) 50. ప్రణవ్ గోపాల్ – విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 51. ముస్తాక్ అహ్మద్ – ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 52. డి. రాకేష్ – ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 53. వి. సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) – ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ (జనసేన) 54. కొత్తపల్లి సుబ్బారాయుడు – ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జనసేన) 55. ఉండవల్లి శ్రీదేవి – ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 56. పి. విజయ్‌కుమార్ – ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (జనసేన ) 57. కిడారి శ్రావణ్ – ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ -
Jharkhand Election: రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
రాంచీ: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్‌పై బార్హెట్ స్థానం నుండి గమ్లియాల్ హెంబ్రోమ్ పోటీకి దిగారు.హెంబ్రోమ్ 2019లో బార్హెత్ నుంచి ఏజేఎస్‌యూ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 2,573 ఓట్లను పొందారు. తుండి స్థానం నుంచి వికాస్ మహతో అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హెట్ (ఎస్జీ)నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటీవల బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 66 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీని ధన్వార్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ పెద్ద కోడలు, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్‌ను పార్టీ జమ్తారా నుంచి పోటీకి దింపింది. జంషెడ్పూర్ తూర్పు నుంచి మాజీ సీఎం, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు -
Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. బీజేపీని వీడి ఆప్‌లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్‌ను బర్వాలా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.తాజాగా ప్రకటించిన జాబితాలో సధైరా నుంచి రీటా బమ్నేయకు టిక్కెట్టు ఇచ్చారు. థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. ముక్త్యార్ సింగ్ బాజిగర్కు రాటియా నుంచి, అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్‌కు అడంపూర్ నుంచి, జవహర్‌లాల్‌కు బవాల్ టిక్కెట్ ఇచ్చారు. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాలను అభ్యర్థులుగా ప్రకటించారు.మరోవైపు గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. పొత్తులో భాగంగా ఆప్ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆ పార్టీకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్లేనని తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. -
జమ్ము కశ్మీర్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ శాల్టెంగ్ స్థానం నుంచి జమ్ము కశ్మీర్ పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రాను బరిలోకి దించింది కాంగ్రెస్. అదేవిధంగా రియాసీ-ముంతాజ్ ఖాన్, శ్రీ మాతా వైష్ణోదేవీ- భూపేందర్ జమ్వాల్, రాజౌరీ (ఎస్టీ)- ఇఫ్తికార్ అహ్మద్, ఠాణామండీ (ఎస్టీ)- షాబీర్ అహ్మద్ ఖాన్, సురాన్‌కోట్ (ఎస్టీ)- మొహమ్మద్ షానవాస్ ఛౌదరీ పోటీ చేస్తారని తెలిపింది. Congress releases a list of 6 candidates for the upcoming Assembly elections in J&K. pic.twitter.com/mx8NdsRdgk— ANI (@ANI) September 2, 2024 ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలో కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకం కూడా ఖరారు అయింది. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
యూపీ లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థులెవరు? ఎందుకింత జాప్యం?
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రస్తావన లేదు. దీంతో పార్టీ తన మూడో జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తాజాగా 72 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంకా ఉత్తరప్రదేశ్ జాబితాను విడుదల చేయలేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్థానం, పూర్వాంచల్, అవధ్లలో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సమస్యగా మారిందని అంటున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు యూపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి సమస్యలేదని ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ సీట్లపై పార్టీ నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 2న విడుదల చేసింది. ఇందులో 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి, హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ఉన్నాయి. కాగా బీజేపీ రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ సహా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయి. -
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 43 అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. రెండో జాబితాలో.. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో జనరల్ కేటగిరీకి చెందిన 10 మంది అభ్యర్థులు, 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒకరు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. అస్సాం నుంచి 12 మంది, గురజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరఖండ్ 3, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి రెండో జాబితాలో చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సెగ్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ను మరోసారి బరిలోకి దింపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్‌కు రాజస్థాన్‌లోని జలోర్ సెగ్మెంట్‌ను కేటాయించారు. అదేవిధంగా సోమవారం బీజేపీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాహుల్ కుశ్వాన్‌ను రాజస్థాన్‌లోని చురూ లోకసభ నియోజకవర్గం బరితో దింపింది. LIVE: Congress party briefing by Shri @kcvenugopalmp in New Delhi. https://t.co/K3nuDYA7P9 — Congress (@INCIndia) March 12, 2024 చదవండి: 39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా -
నేడు బీజేపీ రెండో జాబితా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల మలి జాబితా ఖరారు కసరత్తు ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 8 సీట్లకు సంబంధించి ఆదివారం రెండో జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న 8 సీట్లలో కొన్నింటికి అభ్యర్థులను ప్రకటించ వచ్చునని పార్టీ వర్గాల సమాచారం. జలగం భేటీలు కొలిక్కి వచ్చేనా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు శుక్రవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డితో కలవగా, శనివారం బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో పార్టీలో చేరికతో పాటు ఖమ్మం నుంచి పోటీ విషయంలో త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తామని వెంకటరావు తెలియజేసినట్లు సమాచారం. ఖమ్మం లోక్‌సభ సీట్లో వెంకటరావును నిలిపే దిశగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం చర్చలు జరిపినట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడిగా వెంకటరావుకు గుర్తింపు ఉందని.. దీనికితోడు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా, గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఎంపీగా పోటీ చేయిస్తే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మహబూబూబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. పాలమూరు సీటు డీకే అరుణకే? మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెదక్ సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, అంజిరెడ్డి పోటీపడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతాసాంబమూర్తి, కొండేటి శ్రీధర్.. నల్లగొండ నుంచి జి.మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, జితేందర్ గుప్తా, రంజిత్యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎస్.కుమార్‌తోపాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లను మాదిగ సామాజికవర్గానికే కేటాయించడం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిత్తశుద్ధిగా ఉన్నాయని చూపుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
వైఎస్సార్ సీపీ ఇంచార్జిల రెండో జాబితా విడుదల
-
గాంధీభవన్‌లో ఉద్రిక్తత
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
అగ్రవర్ణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న ప్రకటించిన 55 స్థానాలకు తోడు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరో 45 స్థానాలను క్లియర్ చేయడంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో విడత జాబితాలో అగ్రవర్ణాలకు చెందిన నేతలకు పెద్ద పీట వేయగా, బీసీలకు 8 స్థానాలను, ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇక ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గానికి 21, వెలమలకు 2, బ్రాహ్మణులకు 1, కమ్మ సామాజిక వర్గానికి మూడు టికెట్లను కేటాయించింది. ప్యారాచూట్లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టం చేస్తోంది. గతంలో చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, వివిధ కారణాలతో వేరే పార్టీల్లోకి వెళ్లి ఇటీవలే తిరిగి సొంతగూటికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి)లకు టికెట్లు కేటాయించారు. అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన బి.మనోహర్‌రెడ్డి (తాండూరు), శ్యాంనాయక్ (ఖానాపూర్), కంది శ్రీనివాస్‌రెడ్డి (ఆదిలాబాద్), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), బండి రమేష్ (కూకట్పల్లి), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), నారాయణరావు పాటిల్(బోథ్), వొడితల ప్రణవ్ (హుజూరాబాద్), కస్తూరి నరేందర్ (రాజేంద్రనగర్), విజయారెడ్డి (ఖైరతాబాద్), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మురళీ నాయక్ (మహబూబాబాద్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కె.ఆర్.నాగరాజు (వర్ధన్నపేట)లకు అవకాశ మిచ్చారు. బల్మూరి, విష్ణుకు మొండిచేయి అనుబంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి (వనపర్తి), బల్మూరి వెంకట్ (హుజూరాబాద్)లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబానికి ఒక టికెట్‌తోనే సరిపెట్టింది. జూబ్లీహిల్స్ టికెట్‌ను పీజేఆర్ తనయుడు విష్ణు ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి అవకాశమిచ్చింది. వరంగల్ జిల్లాలో కొండా దంపతులిద్దరికీ టికెట్ వస్తుందని భావించినా వరంగల్ తూర్పులో సురేఖకే అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో పార్టీలో చేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ ఖరారు చేసింది. ఇక ఖానాపూర్‌లో కొమురం భీం మనుమడు ఎడ్మ బొజ్జుకు, నారాయణపేటలో చిట్టెం కుటుంబానికి చెందిన డాక్టర్ పర్ణికారెడ్డి, పాలకుర్తిలో ప్రవాసాంధ్రురాలు హనుమాండ్ల ఝాన్సీ కోడలు యశశ్వినిరెడ్డి (ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో పిన్నవయసు్కరాలు (26))లకు అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న స్థానాలివే.. మిర్యాలగూడ, వైరా (సీపీఎంకు కేటాయించే అవకాశం), చెన్నూరు, కొత్తగూడెం (సీపీఐకి కేటాయించినట్లు సమాచారం), పటాన్చెరు, అశ్వారావుపేట, తుంగతుర్తి, సూర్యాపేట, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, చార్మినార్, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సామాజిక వర్గాల వారీగా ఇలా.. ఎస్సీలు–15 (మాదిగ–9, మాల–6) ఎస్టీలు–8 (ఆదివాసీలు–5, లంబాడీ–3) బీసీలు–20, మైనార్టీలు–4, ఓసీలు–53 (రెడ్డి–38, వెలమ–9, బ్రాహ్మణ–3, కమ్మ–3) బీసీలకు 20 సీట్లే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 20 స్థానాలే వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు దక్కాయి. మొదటి జాబితాలో 12 మందికి ఇవ్వగా, ఈసారి 8 మందికి అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన లిస్టులో 3 గౌడ, 2 ముదిరాజ్, పద్మశాలి, ఆరె మరాఠి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మధుయాాష్కీ, పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్ (గౌడ) కస్తూరి నరేందర్, వాకిటి శ్రీహరి (ముదిరాజ్), కొండా సురేఖ (పద్మశాలి, భర్త మున్నూరు కాపు), నారాయణరావు పాటిల్ ( ఆరె మరాఠి), పూజల హరికృష్ణ (మున్నూరు కాపు)లకు టికెట్లు ఖరారయ్యాయి. కాగా ప్రకటించిన 100 సీట్లలో 20 శాతమే బీసీలకు కేటాయించి 53 శాతం ఓసీ వర్గాలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు కేటా యించిన 20 సీట్లలో యాదవ–4, గౌడ –3, మున్నూరుకాపు–3, ముదిరాజ్–3, పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కులాలకు ఒక్కొక్కటి దక్కాయి. -
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా రెడీ.. విడుదల ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇక, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఈనెల 21వ తేదీన రెండో లిస్టును విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో జాబితాను 21న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, సెకండ్ లిస్ట్ కోసం టీకాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, సెకండ్ లిస్ట్ ప్రకటనలోపు పలువురు నేతల చేరికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగబోతోంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. బస్సు యాత్రని ఆరంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఈ యాత్రలో నిరుద్యోగులు , సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతుల, మహిళలతో భేటీ ఆయన అవుతారు. బస్సు యాత్ర పూర్తి షెడ్యూల్.. ►బుధవారం మధ్యాహ్నాంకల్లా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న రాహుల్, ప్రియాంక ►బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామప్ప టెంపుల్‌కు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ►రామప్ప టెంపుల్లో అన్నాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు ►సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక ►రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర ►ములుగులో బహిరంగ సభలో మహిళలతో రాహుల్ ,ప్రియాంకా ప్రత్యేక సమావేశం ►ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ ►ములుగు బహిరంగ సభ తర్వాత.. భూపాలపల్లి చేరుకొనున్న బస్సు యాత్ర ►భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ ►రాత్రికి.. భూపాలపల్లిలోనే బస చేయనున్న రాహుల్ గాంధీ 19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర ►మంథని లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు ►మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర ►పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు బస్సు యాత్ర ►కరీంనగర్లో రాహుల్ గాంధీ రాత్రి బస 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్‌కు కాంగ్రెస్ బస్సు యాత్ర ►బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ ►ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ ►పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం ►నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ►20వ తేదీ సాయంత్రం తో ముగియనున్న టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర -
ఆరుగురితో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇటీవల 10 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురికి స్థానం కల్పించింది. మెదక్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావును ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను అధిష్టానానికి పార్టీ రాష్ట్ర కమిటీ పంపింది. అయితే, సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన ఎస్.కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని భావించిన అధిష్టానం ఆయనకే సీటు కేటాయించింది. జహీరాబాద్ సీటు కోసం బానాల లక్ష్మారెడ్డి, బిష్కిం ద పీఠాధిపతి సోమాయప్పల పేర్లును పరిశీలించిన అధిష్టానం ఈసారి బానాల లక్ష్మారెడ్డికే అవకాశం కల్పించింది. హైదరాబాద్ స్థానం నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా ఆయన విముఖత చూపారు. దీంతో భగవంతరావుకు సీటు కేటాయించింది. చేవెళ్ల నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన నందకుమార్ యాదవ్‌ల పేర్లను పరిశీలించి జనార్దన్రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పించింది. లోక్‌సభ అభ్యర్థులు.. అదిలాబాద్ (ఎస్టీ): సోయం బాబూరావు; పెద్దపల్లి (ఎస్సీ): ఎస్.కుమార్; జహీరాబాద్: బానాల లక్ష్మారెడ్డి; హైదరాబాద్: డా.భగవంతరావు; చేవెళ్ల: బెక్కరి జనార్దన్‌రెడ్డి; ఖమ్మం: వాసుదేవ్‌రావు -
పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా
-
దాసోజు శ్రవణ్‌కు టికెట్.. విష్ణుకు మరో చాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్ రాధోడ్‌కు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్‌లో బీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక, ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్‌కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) టికెట్‌ను అదూరి లక్ష్మణ్ కుమార్‌కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా ఇది ఖానాపూర్ (ఎస్టీ) రమేష్ రాథోడ్ ఎల్లారెడ్డి జాజల సురేందర్ ధర్మపురి (ఎస్సీ) అదూరి లక్ష్మణ్ కుమార్ సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి మేడ్చల్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఖైరతాబాద్ దాసోజు శ్రవణ్ జూబ్లీహిల్స్ పి విష్ణువర్ధన్ రెడ్డి షాద్‌నగర్ సీ ప్రతాప్‌రెడ్డి భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి పాలేరు కాందాల ఉపేందర్‌రెడ్డి సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెండో జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ సహజంగానే పెద్ద పీట వేసింది. రెండో జాబితాలో రెడ్లకు 6 టికెట్లు కేటాయించగా.. బీసీలకు రెండు టికెట్లు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో టికెట్ చొప్పున కేటాయించింది. -
28 మందితో బీజేపీ రెండో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నేతలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా 28 మందితో రెండో జాబితాకు బీజేపీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు 66 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా వాటిని దీపావళి తర్వాత మూడో జాబితాలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రెండో జాబితా అభ్యర్థులు వీరే.. సిర్పూర్– డా. శ్రీనివాసులు, అసిఫాబాద్ (ఎస్టీ)– అజ్మీరా ఆత్మారామ్ నాయక్, ఖానాపుర్ (ఎస్టీ)– సట్ల అశోక్, నిర్మల్– డా.ఎ.సువర్ణారెడ్డి, నిజామాబాద్ అర్బన్– యెండల లక్ష్మీనారాయణ, జగిత్యాల– ముడుగంటి రవీందర్‌రెడ్డి, రామగుండం– బాల్మూరి వనిత, సిరిసిల్ల– ఎం.నర్సారెడ్డి, సిద్దిపేట– నాయిని నరోత్తంరెడ్డి, కూకట్పల్లి– మాధవరం కాం తారావు, రాజేంద్రనగర్– బద్దం బాల్‌రెడ్డి, శేరిలిం గంపల్లి– జి. యోగానంద్, మలక్‌పేట్– ఆలె జితేంద్ర, చార్మినార్– టి. ఉమామహేంద్ర, చాంద్రాయణ్‌గుట్ట– సయ్యద్ షహెజాది, యాఖుత్‌పుర– చర్మాని రూప్‌రాజ్, బహదూర్‌పుర– హనీఫ్ అలీ, దేవరకద్ర– అగ్గాని ఎన్. సాగర్, వనపర్తి– కొత్త అమరేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్– ఎన్. దిలీప్చారీ, నాగార్జున సాగర్– కె. నివేదిత, ఆలేరు– డి. శ్రీధర్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ)– పెరుమండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ వెస్ట్– ఎం. ధర్మారావ్, వర్ధన్నపేట (ఎస్సీ) – కొత్త సరంగారావ్, ఇల్లందు (ఎస్టీ)– మోకల్ల నగ స్రవంతి, వైరా (ఎస్టీ) – రేష్మా రాథోర్, అశ్వారావుపేట– డా.భూక్యా ప్రసాద్‌రావు నో సూర్యనారాయణ.. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసేందుకు యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న సూర్యనారాయణకు నిరాశే మిగిలింది. ఈ స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో అధిష్టానం యెండల వైపే మొగ్గుచూపింది. నటి రేష్మాకు వైరా టికెట్ సినీ నటి ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోర్‌కు వైరా టికెట్ దక్కింది. ఇల్లందుకు చెందిన రేష్మా ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. రాజేంద్రనగర్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడంతో ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ తండ్రి తోకల శ్రీశైలంరెడ్డికి నిరాశే ఎదురైంది. 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, మలక్‌పేట్, బహదూర్ పురలో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. -
బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో బీజేపీ మరో జాబితా విడుదల చేసింది. రెండో విడత జాబితాలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌తో పాటు పలువురు అగ్రనాయకులు పాల్గొన్నారు. (బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా) తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే 177 మంది, మిజోరంకు పోటీ చేసే 24 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెక్రటరీ జేపీ నడ్డా లేఖ విడుదల చేశారు. రెండో విడత అభ్యర్థుల జాబితా సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు 1 ఆసిఫాబాద్(ఎస్టీ) అజ్మీరా ఆత్మారాం నాయక్ 2 ఖానాపూర్(ఎస్టీ) సాట్ల అశోక్ 3 నిర్మల్ డాక్టర్ ఐండ్ల సువర్ణా రెడ్డి 4 నిజామాబాద్ అర్బన్ యెండల లక్ష్మీనారాయణ 5 సిర్పూర్ డాక్టర్ శ్రీనివాసులు 6 జగిత్యాల మూడుగంటి రవీందర్ రెడ్డి 7 రామగుండం బల్మూరి వనిత 8 సిరిసిల్ల మల్లాగారి నర్సాగౌడ్ 9 కూకట్ పల్లి మాధవరం కాంతా రావు 10 సిద్ధిపేట నైని నరోత్తం రెడ్డి 11 రాజేంద్రనగర్ బద్దం బాల్ రెడ్డి 12 శేరిలింగం పల్లి జి. యోగానంద్ 13 మలక్ పేట్ ఆలె జితేంద్ర 14 చార్మినార్ టి. ఉమా మహేంద్ర 15 చాంద్రాయణగుట్ట సయ్యద్ షాహజాదీ 16 యాకుత్‌పురా చర్మాని రూప్‌రాజ్ 17 బహదూర్‌పురా హనీఫ్ అలీ 18 దేవరకొండ అగ్గని నర్సింహులు సాగర్ 19 వనపర్తి కొత్త అమరేందర్ రెడ్డి 20 నాగర్ కర్నూల్ నేదనూరి దిలిప్ చారి 21 నాగార్జున్ సాగర్ కంకనాల నివేదిత 22 ఆలేరు దొంతిరి శ్రీధర్ రెడ్డి 23 స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) పెరుమాండ్ల వెంకటేశ్వర్లు 24 వరంగల్ వెస్ట్ ఎం ధర్మారావు 25 వర్ధన్నపేట(ఎస్సీ) కొంత సారంగ రావు 26 ఇల్లెందు(ఎస్టీ) మోకాళ్ల నాగ స్రవంతి 27 వైరా(ఎస్టీ) భూక్యా రేష్మా భాయి 28 అశ్వారావు పేట డాక్టర్ భూక్యా ప్రసాద రావు -
నేడు రెండో జాబితా విడుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించడానికి బీజేపీ కసరత్తు పూర్తిచేసింది. గురువారం ఢిల్లీలో కేంద్ర నాయకత్వం ఆమోదముద్ర వేసిన అనంతరం ఈ జాబితా విడుదల కానుంది. దసరా మరుసటి రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. తాజాగా మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టి.. మిగతావాటిని వెల్లడించనుంది. షాద్‌నగర్, కల్వకుర్తి, ఎల్బీనగర్, తాండూరు, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కొడంగల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో రాజేంద్రనగర్‌కు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే, స్థానిక నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన తోకలశ్రీశైలంరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా పార్టీ తీర్థం పుచ్చుకోనందున ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించలేనట్లు కనిపిస్తోంది. కూకట్‌పల్లికి మాధవరం కాంతారావు, శేరిలింగంపల్లికి పారిశ్రామికవేత్త యోగానంద్, కొడంగల్‌కు సీనియర్ నాయకుడు నాగురావు నామోజీ, ఇబ్రహీంపట్నంకు కొత్త ఆశోక్‌గౌడ్ పేరును రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీ జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ అయ్యే ఎన్నికల కమిటీలో వీరి అభ్యర్థిత్వాలపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఇదిలావుండగా, ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని సంకేతాలందిన నియోజకవర్గాల టికెట్లను పెండింగ్‌లో పెట్టాలని యోచిస్తోంది. -
రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్!
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారులకు షాకిచ్చే దిశగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా కదులుతోంది. కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ మరో జాబితాను సిద్ధం చేసింది. దాదాపు 30-40 కంపెనీలతో కూడిన రెండవ జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేయనుంది. ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఈ సెప్టెంబర్ లో ఈ రెండవ జాబితాను బహిర్గతం చేయనుందని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సెక్టార్ కంపెనీలు ఉండనున్నాయి. ఉత్తమ్ గాల్వా, వీడియోకాన్, విసా స్టీల్, కాస్టెక్స్ టెక్నాలజీస్ , జెఎస్పీఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉండనున్నాయి. కాగా ఈ వార్తలపై స్పందించడానికి ఉత్తం గాల్వా, వీడియో కాన్ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారని ఎకానమిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ అంచనాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా
-
కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్ధుల రెండో జాబితా
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో 49 డివిజన్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గ్రేటర్ నామినేషన్లకు గడువు ముగిసింది. ఏఎస్ రావు నగర్ - శిరీషారెడ్డి చర్లపల్లి - మహేష్ గౌడ్ మల్లాపూర్ - భాస్కర్ నాచారం - శాంతి నాగోల్ - పుష్పలత మన్సూరాబాద్ - ప్రభాకర్ రెడ్డి బీఎన్ రెడ్డి నగర్ - సుమన్ గౌడ్ వనస్థలిపురం - మహేష్ యాదవ్ హస్తినాపురం - ప్రవల్లిక చంపాపేట్ - రఘుమారెడ్డి లిగోజీగూడ - రాజశేఖర్ రెడ్డి గడ్డి అన్నారం - తులసీ శ్రీనివాస్ సరూర్ నగర్ - కొండాల్ రెడ్డి ఆర్ కె పురం - దీపా సురేఖ కొత్తపేట - రాహుల్ గౌడ్ మలక్ పేట్ - అఫ్రిన్ జాఫ్రీ అక్బర్ బాగ్ - వినోద్ కుమార్ జంగమెట్ - అవద్ ఆఫ్నీ సులేమన్ నగర్ - మహ్మద్ బేగం శాస్త్రి పురం - జైపాల్ మైలాదేవుల పల్లి - శ్రీనివాస్ గౌడ్ రాజేంద్రనగర్ - దివ్య అత్తాపూర్ - యాపా రమేష్ కార్వాన్ - రవీందర్ లంగర్ హౌజ్ - కోటా అక్షిత నానల్ నగర్ - రాజు ఆసిఫ్ నగర్ - హైమావతి విజయ్ నగర్ - ఆకుల ఇందిర మల్లేపల్లి - భాగ్య రేఖ కాచిగూడ - తోట అనురాధ నల్లకుంట - చంద్రకళ అంబర్ పేట్ - ప్రతాప్ ముషీరాబాద్ - నాగమణి రాంనగర్ కల్పన యాదవ్ అమీర్ పేట్ - లలితా చౌహాన్ సనత్ నగర్ - రేణుకారెడ్డి బన్సీలాల్ పేట్ - రజనీ దేవి రాంగోపాల్ పేట్ - కిరణ్మయి బేగంపేట్ - మహేశ్వరి మోండా మార్కెట్ - వసంత యాదవ్ గచ్చిబౌలి - రవి గౌడ్ మియాపూర్ - రఘుపతి రెడ్డి అల్లాపూర్ - కీర్తిరేఖ రెడ్డి ఫతేనగర్ - రాజు ముదిరాజ్ బాలానగర్ - ప్రకాశ్ గౌడ్ ఈస్ట్ ఆనంద్ బాగ్ - ఆంటోని అడ్డగుట్ట - భానుప్రియ మెట్టుగూడ - ప్రీతి ప్రియాంక సీతాఫల్ మండి - వాణి ముదిరాజ్ -
కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండోజాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో మాజీ ఎంపీ మహబల్ మిశ్రా, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రితోపాటు 25 మంది పేర్లు ఉన్నాయి. కాగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఈసారి రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్వాలియాకు టికెట్ కేటాయించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పోటీచేసి కేజ్రీవాల్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ద్వారకా నుంచి మిశ్రా, మాలవీయనగర్ నుంచి శాస్త్రి పోటీచేయనున్నారు. మరో మాజీ స్పీకర్ చౌదరీ ప్రేమ్ సింగ్ రిజర్వ్డ్ స్థానమైన అంబేద్కర్‌నగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే కోండ్లీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ అమ్రిష్ సింగ్ గౌతమ్, కస్తూర్బానగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా ఉంటారని పార్టీ పేర్కొంది. దీంతో ఢిల్లీ విధానసభలోని 70 స్థానాలకు గాను 49 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. మాజీ కేంద్ర మంత్రి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన అజయ్ మాకెన్ సదర్ బజార్ నుంచి పోటీచేయనున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి అయిన కృష్ణకాంత్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నా అతడి అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రామ్‌వీర్ షౌకీన్ భార్య రీతా షౌకీన్‌కు ముండ్కా నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. రామ్‌వీర్ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే వజీపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, త్రినగర్ నుంచి అనిల్ భరద్వాజ్ పార్టీ తరఫున పోటీచేయనునున్నారు. అలాగే తిమర్పూర్ నుంచి సురేందర్ పాల్ సింగ్ బరిలో ఉంటారు. కాగా, ఈ జాబితాలో కొందరు కొత్తవారికి సైతం స్థానం కల్పించడం గమనార్హం. -
రుణమాఫీ లబ్ధిదారుల రెండవ జాబితా సిద్ధం
-
15 మందితో బిజెపి రెండో జాబితా
తెలంగాణ ప్రాంతంలో పదిహేను మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను బిజెపి బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలు సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీనియర్ సభ్యుడు ఎన్ రామచంద్రరావు, నగర బిజెపి మాజీ అధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డిల పేర్లున్నాయి. టీడీపీతో కుదిరిన పొత్తు మేరకు బిజెపి తెలంగాణలో ఎనిమిది లోకసభ సీట్లకు, 47 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది. బుధవారం పార్టీ జారీ చేసిన అభ్యర్థుల జాబితా ఈవిధంగా ఉంది. డి వెంకట రెడ్డి (మలక్ పేట) ఆది శ్రీనివాస్ (వేములవాడ) కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి (నిజామాబాద్) ఆకుల విజయ (సిరిసిల్ల ) యడవల్లి విజయేందర్ రెడ్డి (హుస్నాబాద్) చింతల రామచంద్రా రెడ్డి (ఖైరతాబాద్) బద్దం బాలరెడ్డి (కార్వాన్) కూతురు వ్రీనివాస రెడ్డి (నల్గొండ) బిజెపి ఎం ధర్మారావు (వరంగల్ పశ్చిమ) ఎన్ రామచంద్ర రావు (మల్కాజ్ గిరి) రాం వేణు (చెన్నూరు) గుజ్జుల రామకృష్ణ రెడ్డి (రామగుండం) బండి సంజయ్ (కరీంనగర్) డి ఎల్లయ్య (ఆందోల్) ఇట్టం సిద్ధి రాములు (కామారెడ్డి) -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల
-
ఆప్ రెండో జాబితాలో రాష్ట్రం నుంచి పది మంది
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల కోసం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో మహారాష్ట్రలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో పది మంది అభ్యర్థులను ప్రకటించి తాము ఎన్నికలకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఠాణే నుంచి సంజీవ్మానే, షోలాపూర్ నుంచి లలిత్ బాబర్, బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో నందు మాధవ్, మావల్ నుంచి మారుతి భాపకర్, అమరావతి నుంచి భావనా వాసనిక్, సాంగ్లీ నుంచి శమినా ఖాన్, గోండియా నుంచి ప్రశాంత్ మిశ్రా, చంద్రాపూర్ నుంచి వామన్రావ్ చటప్, ఔరంగాబాద్ నుంచి సుభాష్ లోమటే, జాల్నా నుంచి దీపక్ మస్కేలు ఉన్నారు. దీనికి ముందు ప్రకటించిన మొదటి జాబితాలో మేధా పాట్కర్ (ఈశాన్య ముంబై), మీరా సన్యాల్ (దక్షిణ ముంబై), మయంక్ గాంధీ (వాయవ్య ముంబై), విజయ్ పాండరే (నాసిక్) అంజలీ దమానియా (నాగపూర్) తదితరులు ఉన్న విషయం విదితమే.