
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండవ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రస్తావన లేదు. దీంతో పార్టీ తన మూడో జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ తాజాగా 72 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్ సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంకా ఉత్తరప్రదేశ్ జాబితాను విడుదల చేయలేదని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం నెలకొందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్థానం, పూర్వాంచల్, అవధ్‌లలో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి సమస్యగా మారిందని అంటున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు యూపీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి సమస్యలేదని ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ సీట్లపై పార్టీ నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 2న విడుదల చేసింది. ఇందులో 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి, హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ఉన్నాయి. కాగా బీజేపీ రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ సహా ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment