సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్‌లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో 979 మంది..
తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్‌గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మిగతా రాష్ట్రాల్లో ..
నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్‌లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్‌లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్‌లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు.
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
Published Sat, May 4 2024 5:35 AM | Last Updated on Sat, May 4 2024 5:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment