fourth phase election
-
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ స్వల్ప ఘర్షణ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సోమవారం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 67.70 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయంలోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 78.37 శాతం పోలింగ్ నమోదైంది. ‘‘శ్రీనగర్ నియోజకవర్గంలో 37.98 శాతం పోలింగ్ రికార్డయింది. ఆరి్టకల్ 370 రద్దుతర్వాత కశీ్మర్ లోయలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌లో 36 శాతం స్థాయిలో పోలింగ్ నమోదవడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి’’ అని ఈసీ ప్రకటించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఏడుదశల్లో జరుగుతుండగా తొలి దశలో 66.14, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 స్థానాలతో కలిపి ఇప్పటిదాకా 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో 379 స్థానాలకు పోలింగ్ ముగిసింది. వీటితోపాటు అరుణాచల్ ప్ర దేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 2019 ఎన్నికల్లో నాలుగో దశలో 71 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65.51% పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో ఘర్షణలు పశి్చమబెంగాల్‌లోని 8 నియోజకవర్గాల పరిధిలోని కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘర్షణలకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ ఏజెంట్ల అడ్డగింత తదితరాలకు సంబంధించి దాదాపు 1,700 ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఓటర్లను మభ్యపెట్టారని, ఏజెంట్లపై దాడులు చేశారని టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం వందలాది ఫిర్యాదులు చేశాయి. బర్ధమాన్‌లో బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్‌పై రాళ్ల దాడి ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ఒడిశాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. జార్ఖండ్‌లో మారుమూల గ్రామాల ప్రజలు ఓట్లేయకుండా మావోయిస్టులు రోడ్లపై చెట్లు నరికి పడేయగా భద్రతాసిబ్బంది సమయానికి అన్నీ తొలగించారు. ఐదో దశ మే 20, ఆరో దశ మే 25, ఏడో దశ జూన్ ఒకటోతేదీన జరగనుంది. అన్నింటి ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపడతారు. -
Lok Sabha Election 2024: నాలుగో దశ ప్రచారానికి తెర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి. బరిలో దిగ్గజాలు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(యూపీలోని కనౌజ్), కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్ (బిహార్‌లోని బెగుసరాయ్), నిత్యానంద్ రాయ్(బిహార్‌లోని ఉజియాపూర్), కాంగ్రెస్ నేత అ«దీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్లోని బహరాంపూర్), బీజేపీ నాయకురాలు పంకజ ముండే(మహారాష్ట్రలోని బీడ్) తదితరులు మే 13న జరిగే నాలుగోదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021నాటి లఖీంపూర్‌ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడైన ఆశిశ్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈసారి యూపీలోని ఖేరీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం చెమటోడుస్తున్నారు. నాడు 40 చోట్ల ఎన్డీఏ విజయం నగదుకు ప్రశ్నలు ఉదంతంలో పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మరోసారి బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి పోటీకి నిలబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత అఘా సయ్యద్ రుహుల్లా మెహ్దీ, పీడీపీ తరఫున వహీద్ పారా, ఆప్ తరఫున ఆష్రాఫ్ మీర్ పోటీచేస్తున్నారు. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇక్కడ ‘నోటా’కు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారంచేసింది. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్‌బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. లోక్‌సభలో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్‌సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్‌స్టాప్‌గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్‌లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్‌కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్‌ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్‌గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్‌లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్‌సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్‌కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్‌నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్‌పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్‌దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్‌లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్‌కు గురై కాంగ్రెస్‌లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్‌పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్‌కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్‌ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్‌కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్‌ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: బీజేపీకి సవాలు
నాలుగో విడతలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. 29 స్థానాల్లో మూడు విడతల్లో 21 సీట్లకు ఎన్నిక ముగిసింది. 2019లో బీజేపీ ఏకంగా 28 సీట్లు సొంతం చేసుకోగా కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది... ఇండోర్ పోలింగ్‌కు ముందే ఇక్కడ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు! దాంతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ విజయం ఖాయమైపోయింది. కంగుతిన్న కాంగ్రెస్ ఇక్కడ నోటాకు ఓటేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తోంది! ఎందుకంటే ఇక్కడ బరిలో ఉన్న 14 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ మద్దతివ్వడానికి స్వతంత్రులెవరూ లేరు. మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇండోర్ బీజేపీ కంచుకోట. 35 ఏళ్ల నుంచి ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. 1989 నుంచి 2014 దాకా లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ గెలుస్తూ వచ్చారు. ఎన్నికల వేళ ముగ్గురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తులు కూడా బీజేపీలో చేరారు. ఇక్కడ ఫలితం యువత చేతుల్లోనే ఉంది. 30–39 ఏళ్ల ఓటర్లు 6.71 లక్షలు, 20–29 వయసు వారు 5.26 లక్షల మంది, తొలిసారి ఓటర్లు 62,000 మంది ఉన్నారు.ఉజ్జయిని ఈ ఎస్సీ స్థానంలో గత రెండు ఎన్నికల నుంచి బీజేపీదే విజయం. 2014లో ప్రొఫెసర్ చింతామణి మాలవీయ, అనంతరం 2019లో అనిల్ ఫిరోజియా మూడున్నర లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు! ఫిరోజియాపై కాంగ్రెస్ నుంచి మహేశ్ పర్మార్ తలపడుతున్నారు. బీజేపీ ప్రధానంగా ఇంటింటి ప్రచారాన్నే నమ్ముకుంది. మరోవైపు పర్మార్ మాత్రం ప్రసిద్ధ క్షిప్రా నది కాలుష్యంపై వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. నదిలో కలుస్తున్న మురుగునీటి ప్రవాహంలో కూర్చోవడమే గాక అందులో మునకలు వేశారు. కాలుష్యం నుంచి నదిని రక్షించేందుకు తుదికంటా పోరాడతానని ప్రకటించారు. ఇందుకు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుండటం విశేషం.ధార్ ఈ ఎస్టీ స్థానం నుంచి బీజేపీ తరఫున సావిత్రి ఠాకూర్ బరిలో ఉన్నారు. ఆమె 2014లోనూ బీజేపీ అభ్యరి్థగా ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్ నుంచి రాధేశ్యామ్ మువెల్ పోటీ చేస్తున్నారు. మువెల్‌ను మార్చాలని ఓ దశలో పార్టీ భావించినా చివరికి ఆయన్నే కొనసాగించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట కాంగ్రెసే గెలిచింది. దాంతో ఈసారి బీజేపీ గెలుపు సునాయాసంగా కని్పంచడం లేదు. అందుకే సిట్టింగ్ ఎంపీని కాదని సావిత్రికి బీజేపీ టికెటిచి్చంది. రాహుల్‌గాంధీ, ప్రధాని మోదీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు.ఖాండ్వ ఎన్నికల సంఘం రెడ్ అలెర్ట్ ప్రకటించిన స్థానమిది. 11 మంది అభ్యర్థుల్లో నలుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర పటేల్ కూడా ఉన్నారు! 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి నందకుమార్ సింగ్ చౌహాన్ విజయం సాధించారు. 2021లో ఆయన కరోనాతో మరణించారు. ఉప ఎన్నికలో బీజేపీ నేత జ్ఙానేశ్వర్ పాటిల్ గెలిచారు.దేవాస్ దేవాస్ లోక్‌సభ స్థానంలో ఈసారి భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మహేంద్రసింగ్ సోలంకి (40) మరోసారి బరిలో ఉన్నారు. ఆయన సివిల్ జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ జానపద గాయకుడు ప్రహ్లాద్ సింగ్ తిపానియా (65)పై ఘన విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి రాజేంద్ర మాలవీయ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2014లోనూ బీజేపీయే గెలిచింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.చరిత్ర సృష్టించిన బామ్మ ధార్ నియోజకవర్గం పరిధిలోని 113 ఏళ్ల బామ్మ ఇంటి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకుని చరిత్ర సృష్టించింది. ఏకల్దున గ్రామానికి చెందిన భవార్ బాయి ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవడంతో.. అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఇందుకు అవకాశం కలి్పంచారు. ఈ నియోజకవర్గ పరిధిలో 85 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 900 మంది ఓటర్లు, 343 మంది దివ్యాంగులు సైతం ఇంటి నుంచి ఓటేశారు. అంజేరా గ్రామానికి చెందిన సాఫియాన్ జులి్ఫకర్ హుస్సేన్ అనే 109 ఏళ్ల వృద్ధుడు కూడాఈ జాబితాలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్‌లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్‌లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్‌లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్‌లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
4th Phase Election: ఏపీ, తెలంగాణలో అభ్యర్థుల సంఖ్య..
సాక్షి, ఢిల్లీ: నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా.. బీహార్‌లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీజమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మందిజార్ఖండ్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీమధ్యప్రదేశ్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు 74 మంది పోటీమహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మందిఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మందిఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు బరిలో 130 మందివెస్ట్ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది. -
నాలుగో విడతకు నేడే నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. -
బెంగాల్లో ముగిసిన నాలుగో దశ ప్రచారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 4వ దశ ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. రేపు 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24పరగణ, అలిపురదౌర్, కూచ్‌బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో(బీజేపీ), బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ మనోజ్ తివారీ(టీఎంసీ), నటి పాయల్ సర్కార్(బీజేపీ), ఎంపీ లాకెట్ చటర్జీ(బీజేపీ), సుజన్ చక్రవర్తి(సీపీఎం) తదితర ప్రముఖులు ఈ నాలుగో దశ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇందులో 187 కంపెనీలను కూచ్‌బిహార్ జిల్లాకే కేటాయించారు. -
కోనసీమలో పల్లెపోరు
సాక్షి, అమలాపురం: రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ (అమలాపురం డివిజన్)కు ఒక గుర్తింపు ఉంది. ఒకవైపు సముద్రం, మూడు వైపులా గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక స్థానముంది. పూర్తి వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతం కొబ్బరి సాగులో దేశంలోనే గుర్తింపు పొందింది. స్వతంత్ర ఉద్యమం నాటినుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం అధికం. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నాలుగో దశలో జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 273 పంచాయతీలున్నాయి. వీటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 259 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 711 మంది తలపడుతున్నారు. జాతీయస్థాయిలో రాణింపు కోనసీమకు చెందిన పలువురు నాయకులు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులు పొందారు. దివంగత కళా వెంకట్రావు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రెవెన్యూ, ఆంధ్రాలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత జీఎంసీ బాలయోగి దేశంలోనే అత్యుత్తమైన పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. మాజీమంత్రి పరమట వీరరాఘవులు పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. దివంగత మాజీమంత్రి మోకా విష్ణుప్రసాద్ తొలుత సర్పంచ్‌గా తరువాత అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణ గృహిణిగా ఉన్న చిల్లా జగదీశ్వరి సైతం తొలుత సర్పంచ్‌గా, తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోరు ఏకపక్షమే కోనసీమలో పంచాయతీ పోరు ఏకపక్షమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల వ్యవస్థతో పల్లె కేంద్రంగా సాగుతున్న పాలనతో గ్రామాలు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు పెరగడంతో యువతలో ఉద్యోగ భరోసా ఏర్పడింది. రైతుభరోసా ద్వారా పెట్టుబడి సహాయం, కనీస మద్దతు ధరలు అందేలా తీసుకుంటున్న చర్యలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం వంటివి రైతులకు ఎంతో లబ్ధి కలిగిస్తున్నాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, వరదలు, వర్షాల వల్ల మూడుసార్లు ఆయా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్న రైతులకు రెండు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ముఖ్యంగా కొబ్బరికాయ ధర రూ.6కు పడిపోయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయించింది. అప్పటినుంచి కొబ్బరి ధర రూ.10కి తగ్గలేదు. ఈ చర్యలన్నీ రైతులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాయి. దీంతో కోనసీమ గ్రామాలు వైఎస్సార్సీపీ అభిమానులకే పట్టంకట్టే పరిస్థితి కనిపిస్తోంది. తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ఏకపక్షంగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో గెలుపు నమ్మకం సడలిపోయింది. -
ముగిసిన నాలుగో దశ ప్రచారం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ ప్రచారం శనివారంతో ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. వివిధ నియోజకవర్గాల పోలింగ్ సమయాలు వేర్వేరుగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగియడానికి ముందు ఉండే 48 గంటల కాలాన్ని ‘నిశ్శబ్ద కాలం’గా పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారమైనా నిషిద్ధం. ప్రచారం గడువు ముగియడంతో మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలకు, వీధి కూడలి సమావేశాలకు తెరపడింది. -
ప్రచారంలో వెనకబడిన రాహుల్, సోనియా
పట్నా: ప్రతిష్టాత్మకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎందుకు ఎక్కువ పాల్గొనడం లేదు? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం రావాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీల వెంటపడి ప్రాధేయపడేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? సోనియా గాంధీ ఇప్పటి వరకు బిహార్ ఎన్నికల ప్రచారంలో రెండు, మూడు పర్యాయాలు మాత్రమే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ ప్రచార సభల్లోనే పాల్గొంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? బిహార్ ఓటర్లు యూపీఏ-2 ప్రభుత్వంలో వెలుగుచూసిన కుంభకోణాలను ఇప్పటికి మరచిపోలేక పోతున్నారని, సోనియా, రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం చేస్తే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులే భావిస్తున్నారని రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. వారికన్నా లాలూ, నితీష్ కుమార్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారానికి రావాలని లాలూ, నితీష్‌లు కూడా కోరుకోవడం లేదని వారన్నారు. సోనియా, రాహుల్ కంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సినీ తారలు రాజ్‌బబ్బర్, నగ్మాల ఎన్నికల ప్రచారాన్నే అభ్యర్థులు ఎక్కువగా కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో గులామ్ నబీ ఆజాద్ ప్రచారం ఉపయోగపడుతుండగా, జన సమీకరణలో నగ్మా గ్లామర్, రాజ్‌బబ్బర్ వాక్ఛాతుర్యం ఉపయోగపడుతోందన్నది అభ్యర్థుల వాదనగా వినిపిస్తోంది. ఎన్డీయే ప్రచార సారథి నరేంద్ర మోదీకి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న లాలూ, నితీష్ల ద్వయం కాంగ్రెస్ పార్టీ అధినాయకులపై ఏ మాత్రం ఆధారపడకుండా ప్రచారపర్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటికప్పుడు మోదీపై వాగ్బాణాలు విసురుతుండగా, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్ర, తంత్రాలను ప్రయోగిస్తున్నారు.