10 రాష్ట్రాలు,యూటీల్లోని 96 స్థానాల్లో పూర్తయిన ఎన్నికలు
స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ స్వల్ప ఘర్షణ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సోమవారం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 67.70 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయంలోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది.
పశి్చమబెంగాల్‌లో అత్యధికంగా 78.37 శాతం పోలింగ్ నమోదైంది. ‘‘శ్రీనగర్ నియోజకవర్గంలో 37.98 శాతం పోలింగ్ రికార్డయింది. ఆరి్టకల్ 370 రద్దుతర్వాత కశీ్మర్ లోయలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనగర్‌లో 36 శాతం స్థాయిలో పోలింగ్ నమోదవడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి’’ అని ఈసీ ప్రకటించింది.
ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఏడుదశల్లో జరుగుతుండగా తొలి దశలో 66.14, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 స్థానాలతో కలిపి ఇప్పటిదాకా 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో 379 స్థానాలకు పోలింగ్ ముగిసింది. వీటితోపాటు అరుణాచల్ ప్ర దేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 2019 ఎన్నికల్లో నాలుగో దశలో 71 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65.51% పోలింగ్ నమోదైంది.
పశి్చమబెంగాల్‌లో ఘర్షణలు
పశి్చమబెంగాల్‌లోని 8 నియోజకవర్గాల పరిధిలోని కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘర్షణలకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ ఏజెంట్ల అడ్డగింత తదితరాలకు సంబంధించి దాదాపు 1,700 ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఓటర్లను మభ్యపెట్టారని, ఏజెంట్లపై దాడులు చేశారని టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం వందలాది ఫిర్యాదులు చేశాయి.
బర్ధమాన్‌లో బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్‌పై రాళ్ల దాడి ఘటనలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ఒడిశాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. జార్ఖండ్‌లో మారుమూల గ్రామాల ప్రజలు ఓట్లేయకుండా మావోయిస్టులు రోడ్లపై చెట్లు నరికి పడేయగా భద్రతాసిబ్బంది సమయానికి అన్నీ తొలగించారు. ఐదో దశ మే 20, ఆరో దశ మే 25, ఏడో దశ జూన్ ఒకటోతేదీన జరగనుంది. అన్నింటి ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment