
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 4వ దశ ఎన్నికల ప్రచారం గురువారం ముగిసింది. రేపు 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24పరగణ, అలిపురదౌర్, కూచ్‌బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో(బీజేపీ), బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ మనోజ్ తివారీ(టీఎంసీ), నటి పాయల్ సర్కార్(బీజేపీ), ఎంపీ లాకెట్ చటర్జీ(బీజేపీ), సుజన్ చక్రవర్తి(సీపీఎం) తదితర ప్రముఖులు ఈ నాలుగో దశ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఇందులో 187 కంపెనీలను కూచ్‌బిహార్ జిల్లాకే కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment