న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం(ఫిబ్రవరి5) పోలింగ్ ఉండడంతో 48 గంగల ముందు ప్రచారాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఆపేశాయి.
చివరిరోజు ఆమ్‌ఆద్మీపార్టీ,బీజేపీ,కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టా లేక ఇతర ఏదైనా పెద్ద పోస్టు ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు.
కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీపార్టీ, కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్‌కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఇటీవల ప్రకటించిన మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment