
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్నారు.
హామీలు నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
కాగా, స్వయంగా కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఓటమి పాలవడం గమనార్హం. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సిసోడియా,సత్యేందర్‌జైన్ వంటి ఆప్ నేతలంతా ఓటమి పాలవడం హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఆప్ సీనియర్ నేత, ప్రస్తుత సీఎం అతిషి మాత్రం కల్కాజి నియోజకవర్గంలో బీజేపీ నేత రమేష్ బిదూరిపై విజయం సాధించడం విశేషం.

Comments
Please login to add a commentAdd a comment