ends
-
ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం(ఫిబ్రవరి5) పోలింగ్ ఉండడంతో 48 గంగల ముందు ప్రచారాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఆపేశాయి.చివరిరోజు ఆమ్ఆద్మీపార్టీ,బీజేపీ,కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టా లేక ఇతర ఏదైనా పెద్ద పోస్టు ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీపార్టీ, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది. -
ప్రియుడి బ్లాక్‌మెయిలింగ్ భరించలేక..
మల్లాపూర్ (హైదరాబాద్): ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఎస్వీనగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్‌రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. కాగా ఇంద్రచరణ్‌రెడ్డి గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం, వేధించడంతో మనస్తాపానికి గురైన పూజిత సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఇంద్రచరణ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
మైకులు బంద్.. ముగిసిన ‘మహా’ ఎన్నికల ప్రచారం
ముంబయి:మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం(నవంబర్18) సాయంత్రం ముగిసింది. ప్రచారం చివరి రోజు మరింత వేడెక్కి పార్టీల మధ్య యాడ్వార్ నడిచింది. ప్రత్యర్థుల వైఫల్యాలివే అంటూ అధికార, విపక్షాలు వార్తాపత్రికల్లో భారీ ప్రకటనలిచ్చాయి.కర్ణాటక పథకాలపై మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను కన్నడ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై బీజేపీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడులు మొదలుకొని కొవిడ్ కిట్ స్కామ్ వరకు అనేక అంశాలను ప్రకటనల్లో బీజేపీ ప్రస్తావించింది.పాల్గర్లో సాధువుల హత్య, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిలివేసిన ఉద్ధవ్ ఠాక్రే, ముంబయి రైలు పేలుళ్లు, అంబానీ ఇంటికి బెదిరింపులతో పాటు ఎంవీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పత్రికల్లో బీజేపీ ప్రకటనలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. బుధవారం(నవంబర్20) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం
సాక్షి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానం విరమించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం మొదలైన మోదీ ధ్యానం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఆయన దాదాపు 45 గంటలపాటు ధ్యానంలో నిమగ్నమయ్యారు. రెండు రోజులపాటు కేవలం ద్రవాహారం తీసుకున్నారు. ధ్యానం ముగిసిన తర్వాత మోదీ రాక్ మెమోరియల్ నుంచి పడవలో అక్కడికి సమీపంలోని తమిళ కవి తిరువళ్లువర్ విగ్రహం కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. తిరవళ్లువర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం తీరానికి చేరుకున్న మోదీ హెలికాప్టర్లో తిరువనంతపురం బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. మరోసారి ఎన్డీఏకే పట్టం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి మోదీ న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశవాద ‘ఇండియా’ కూటమిని ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. విపక్ష కూటమి తిరోగమన రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ప్రజలు చూశారని, తమకు మళ్లీ అధికారం అప్పగించబోతున్నారని వెల్లడించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల క్రియాశీల భాగస్వామ్యమే మూలస్తంభమని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు తోడ్పడిన భద్రతా దళాలకు సైతం ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఎన్నికల ప్రచారానికి తెర
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. రాజస్థాన్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు. రూ.682 కోట్లు స్వాధీనం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. -
ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
-
మేడ్చల్: బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతం
-
ముగిసిన రాకేశ్ అంత్యక్రియలు.. వేలాదిగా తరలిన జనం (ఫొటోలు)
-
ప్రగతి మంత్రం.. పల్లె చిత్రం
సాక్షి, హైదరాబాద్: ప్రగతి మంత్రం ఫలించింది. పల్లెచిత్రం మారింది. హరితహారమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణే కర్తవ్యంగా రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో సాగిన రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అక్షరాస్యతలోనూ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని భావించిన ప్రభుత్వం.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’నినా దం కింద తొలిసారి గ్రామ పంచాయతీల్లో 25,03,901 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తిం చింది. ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,54,804, నల్లగొండ జిల్లాలో 1,47,054 మంది వయోజన నిరక్షరాస్యులు ఉం డగా, యాదాద్రి జిల్లాలో 1,32,412 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,21,847 మంది, నిర్మల్ జిల్లాలో 1,20,597 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం సర్కారు అక్షర యజ్ఞం చేపట్టనుంది. దశాబ్దాలుగా సమస్యల వలయంలో చిక్కుకొని కునారిల్లుతున్న గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా విస్తృతంగా అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఈసారి విశేషం. తొలిరోజు గ్రామ సభల్లో వార్షిక ప్రణాళిక, పంచా యతీ ఆదాయ వ్యయాలు, తొలి విడత పల్లెప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచడం ద్వారా పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామ సభలు, పాదయాత్రలు, శ్రమదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల హడావుడితో గత 11 రోజులు పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. పరిసరాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠధామాలు, కంపోస్టు యార్డు, శాశ్వత నర్సరీలకు స్థలాలను గుర్తించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి. దాతల సహకారం... పల్లె దాటినా సొంతూరిపై మమకారంతో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన పలువురు దాతలు పల్లె ప్రగతికి ఇతోధికంగా సహకారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి 15,739 మంది దాతృత్వంతో ముందుకొచ్చారు. వీరంతా రూ. 11.64 కోట్ల విరాళాలను అందజేశారు. మరింత ఆర్థిక సాయం అందించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పల్లెల సత్వర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ పద్దుల కింద రూ. 1,475.28 కోట్లు విడుదల చేయగా ఈ నిధులకు దాతల సాయం చేదోడువాదోడుగా నిలవడంతో అభివృద్ధి పట్టాలెక్కనుంది. పల్లెసీమలకు సమస్యల నుంచి విముక్తి లభించనుంది. మొత్తం గ్రామ పంచాయతీలు : 12,751 గ్రామీణ జనాభా : 2.03 కోట్లు గ్రామ సభలు నిర్వహించిన పంచాయతీలు : 12,749 భాగస్వామ్యమైన ప్రజలు : 7,02,563 -
సం‘గ్రామం’.. సమాప్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. తొలి దశలో తప్పిస్తే రెండు, మూడో దశల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చివరి దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో భాగంగా ఎనిమిది మండలాల్లోని 227 పంచాయతీలకు గాను 24 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 203 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవసరం రాకపోవడం.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 85.91 శాతం నమోదు మూడో దశ ఎన్నికల సందర్భంగా 85.91 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈనెల 21న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.71 శాతం, 25వ తేదీన రెండో దశ ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా మూడో దశలో పోలింగ్ నమోదైనట్లయింది. పర్యవేక్షించిన అధికారులు ఎన్నికల సందర్భంగా అటు ఉద్యోగులు, ఇటు ఓటర్లకు ఇటు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎనిమిది మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించిన వారు సజావుగా సాగేలా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకొడిగా... మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చలి ప్రభావం పెరిగింది. ఇది బుధవారం జరిగిన పోలింగ్‌పై ప్రభావం చూపింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనా పెద్దగా ఓటర్లు రాలేదు. ఇక 9 గంటల తర్వా త మాత్రం పోలింగ్ జోరందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 31.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత 11 గంటల్లోపు ఇది 66.07 శాతానికి చేరింది. మొత్తంగా ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సరికి పోలింగ్ శాతం 85.91గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి పోలింగ్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. కోస్గి మండలంలోని ముశ్రీఫా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న నర్సప్ప (48)కు ఎన్నికల సందర్భంగా అదే పంచాయతీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే కన్నుమూశారు. ఓటు వేసిన ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూత్పూర్ మండలంలోని సొంత గ్రామమైన అన్నసాగర్లో ఆయన ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బారులు తీరిన ఓటర్లు ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సాహం చూపారు. మూడో విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, అత్యధికంగా దేవరకద్ర మండలంలో 91.49 శాతం, తక్కువగా గండీడ్ మండలంలో 74.75 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో ఉదయం మందకొడిగా సాగినా.. 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక సమయం ముగిసే ఒంటి గంటకు కొద్దిముందు ఓటర్లు ఎక్కువగా> రాగా.. అందరినీ అనుమతించారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఆ బూత్‌ల్లో గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రెమారాజేశ్వరి స్వయంగా పలు కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. ఓటు వేసిన 2,17,049 మంది మూడో విడతగా ఎన్నికలు జరిగిన 203 పంచాయతీల్లో 2,52,647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జీపీల్లో మొత్తం 1,26,476 మంది పురుషులు, 1,26,090 మంది మహిళా ఓటర్లతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1,08,778 మంది పురుషులు, 1,08,269 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇద్దరు ఇతరులు ఓటు వేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. అనంతరం భోజనం కోసం అధికారులు గంట పాటు విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. -
తెలంగాణలో ముగిసిన పంచాయితీ పోరు
-
గులాబీదే జోరు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ దళం దూసుకుపోతోంది. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. పేరుకు పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలే అయినా.. పంచాయతీల్లో అభ్యర్థులు పార్టీల వారీగానే విడిపోయి పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం మిర్యాలగూడ డివిజన్లోని పది మండలాల పరిధిలోని 276 గ్రామ పంచాయతీల్లో జరిగింది. మొత్తం పంచాయతీల్లోనామినేషన్ల ఉప సంహరణల నాటికే 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పంచాయతీల్లోని వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిపారు. కాగా, మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పది మండలాల్లోని మొత్తం పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 92.01శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగా ఏర్పాటైన అడవిదేవులపల్లి మండలంలో అత్యధికంగా 95.24శాతం, అత్యల్పంగా తిరుమలగిరి (సాగర్) మండలంలో 88.44శాతం పోలింగ్ నమోదైంది. పది మండలాలకు గాను ఏకంగా ఎనిమిది మండలాల్లో తొంభై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగిలి రెండు మండలాల్లో సైతం 88శాతానికి పైనే ఓట్లు పోలయ్యాయి. డివిజన్లో మొత్తం 2,59,040 ఓట్లకు గాను, 2,38,351 ఓట్లు పోలయ్యాయి. గులాబీ జోరు గ్రామ పంచాయతీ ఎన్నికల మలి విడతలోనూ అధికార టీఆర్ఎస్ హవా కనిపించింది. 276 పంచాయతీలక గాను నామినేషన్ల దశలోనే ఏకగీవ్రంగా 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా కాగా, వాటిలో 51 మంది సర్పంచులు టీఆర్ఎస్ మద్దతు దారులే కావడం గమనార్హం. ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. మిగిలిన 224 పంచాయతీల్లో 146 మంది టీఆర్ఎస్కు చెందిన వారు సర్పంచులుగా విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో 66 మంది కాంగ్రెస్ మద్దతు దారులు, సీపీఎం 02, స్వతంత్రులు 09 మంది సర్పంచులుగా విజయం సాధించారు. -
ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
-
ఆ మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్స్ బంద్
శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ ఫోన్ 7.5, విండోస్ ఫోన్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ కూడా పనిచేయదు. విండోస్ 8.1, విండోస్ 10 మొబైళ్లకు మాత్రం పుష్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. రోజు మొత్తం ఊగిసలాటలో సాగిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు పెరిగి 28,352 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,805 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సెక్టార్ డీలీ పడగా ప్రయివేట్ బ్యాంకింగ్ షేర్లు లాభాలనార్జించడం విశేషంగా నిలిచింది. రియల్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది. ఐటీ లాభపడింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో దాదాపు 11 శాతం నష్టపోయి బీవోబీ, ఐడియా 2.5 శాతం క్షీణించి టాప్ లూజర్‌గా నిలిచింది. అరబిందో, భెల్, స్టేట్‌బ్యాంక్, మారుతీ, బాష్, హీరోమోటో, లుపిన్, ఐటీసీ నష్టాల్లో ఐషర్, యస్‌బ్యాంక్, టాటా పవర్, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, జీ, హిందాల్కో, హెచ్‌యూఎల్ లాభాల్లో ముగిశాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి రూ.67.01 వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్ మార్కెట్ లో స్వల్పంగా నష్టపోయింది. పది గ్రా. రూ. 29,149 వద్ద కొనసాగుతోంది. -
పాజిటివ్ నోట్ తో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలనుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి. దాదాపు 170 పాయింట్లకు పైగా క్షీణించిన మార్కెట్లు చివరలో కోలుకుని పాజిటివ్ నోట్ తో ముగిసాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు బలపడి 27,916 వద్ద నిఫ్టీ ఫ్లాట్ గా 8615 వద్ద ముగిసింది. అక్టోబర్ డెరివేటివ్స్ ముగింపు, ఎఫ్ఐఐల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినా, మారుతి, ఓ ఎన్జీసీ సెప్టెంబర్ ఫలితాలతో మిడ్ సెషన్లో తరవాత నష్టాలను తగ్గించుకుని లాభాల్లోకి మారింది. ముఖ్యంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్ లాభాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి కాగా ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, మెటల్స్, రియల్టీ రంగాలు నష్టపోయాయి. టాటా కంపెనీల షేర్ల నష్టాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, యస్‌బ్యాంక్, జీ, విప్రో, అంబుజా, గ్రాసిమ్, బజాజ్ ఆటో నష్టపోగా, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, భారతీ టాప్ లూజర్ గా నిలువగా, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి. మరోవైపు మిడ్ క్యాప్ సూచీ స్మాల్ క్యాప్ సూచీలలో బలహీనత కొనసాగింది. అటు రూపాయ 0.03 పైసల బలహీనంతో 66.86 వద్ద, పసిడి పది గ్రా.రూ.97 లాభంతో రూ.29,931 వద్ద ఉంది. -
నష్టాల్లో రియాల్టీ,ఆటో,హెల్త్‌కేర్
-
బ్రెగ్జిట్ బ్లాస్ట్ నుంచి కొద్దిగా తెప్పరిల్లిన మార్కెట్లు
బ్రెగ్జిట్ బ్లాస్ట్ తో అతలాకుతలమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి . సెన్సెక్స్ 645 పాయింట్ల నష్టంతో 26, 356 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 8,076 పాయింట్ల దగ్గర క్లోజయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా భారీ పతనంతో ట్రేడర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా తెప్పరిల్లాయి. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారు కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పతనం దిశగా పయనించాయి. ముఖ్యంగా ఐటీ,బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు కుదేలయ్యాయి. దీంతో ఈ పరిణామాన్ని బ్లాక్ ఫ్రేడే గా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. -
తమిళనాడులో ముగిసిన వేట నిషేధం!
చెన్నయ్‌ః సముద్ర జలాల్లో చేపల వేటపై తమిళనాడులో 45 రోజుల పాటు విధించిన నిషేధం ముగిసింది. జాలర్లు ఇకపై వేటకు వెళ్ళొచ్చని అధికారులు తెలిపారు. అయితే శ్రీలంక, భారత జాలర్ల సమస్య పరిష్కారానికి నాలుగో విడత సమావేశాలు త్వరలో ప్రారంభించాలని ఈ సందర్భంలో జాలర్లు కోరారు. తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి మే 29 తేదీవరకూ మొత్తం 45 రోజులపాటు చేపల వేటను నిషేధించిన విషయం తెలిసిందే. మెకనైజ్డ్ బోట్లలో సముద్రంలో చేపలు పట్టే జాలర్లకు ప్రతియేటా చేపల సంతానోత్సత్తి కోసం ఈ నిషేధాన్నిఅధికారులు అమల్లోకి తెస్తారు. నాగపట్నం, రామనాథపురం, తూథుకుడి, పుదుక్కొట్టై, కన్యాకుమారిల్లో ఆదివారం అర్థరాత్రినుంచి నిషేధాన్ని తొలగించడంతో జాలర్లు తిరిగి వేటకు వెళ్ళేందుకు తమ పడవలను చేపలు నిల్వ చేసేందుకు కావలసిన ఐస్ తోనూ, డీజిల్ తోనూ నింపి సిద్ధం చేసుకుంటున్నారు. -
94 రోజుల నిరాహారదీక్ష..
హెబ్రూన్: వర్తమాన ప్రపంచంలో భారత ఉక్కు మహిళ ఇరోం శర్మిల(15 ఏళ్లు) తర్వాత రికార్డు స్థాయిలో నిరాహార దీక్ష చేసిన పాలస్తీనా జర్నలిస్ట్ మొహమ్మద్ అల్ ఖెక్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. తన అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ 94 రోజులగా ఖెక్ చేపట్టిన నిరాహారదీక్ష నేటితో ముగిసిందని ఆయన భార్య ఫైహా శుక్రవారం అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. 33 ఏళ్ల అల్ ఖెక్.. సౌదీకి చెందిన ఓ వార్తా సంస్థలో రిపోర్టర్. విధినిర్వహణలో భాగంగా గత ఏడాది నవంబర్ 21న పాలస్తీనా సరిహద్దుకు వెళ్లిన అతణ్ని ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఖెక్ కు ఉగ్రవాద సంస్థ హమస్ లో సంబంధాలున్నాయని ఆరోపించిన ఇజ్రాయెల్.. విచారణకు అవకాశం లేకుండా ఖెక్ ను అత్యవసర నిర్బంధ(అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్) చట్టం కింద కేసులు నమోదు చేసింది. అయితే తాను నిర్దోషినని మొదటినుంచి వాదిస్తోన్న ఖెక్.. జైలులో పెట్టిన నాలుగో రోజు నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఖెక్ అక్రమ నిర్బంధంపై ఆయన భార్య ఫైహా పెద్ద పోరాటమేచేశారు. పాలస్తీనా పాలకులు కూడా అందుకు మద్దతు తెలపడంతో జర్నలిస్టయిన ఖెక్ ను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ కు సూచించింది. దీంతో ఇజ్రాయెట్ సుప్రీంకోర్టు అతని విడుదల చేసేందుకు సమ్మతించింది. అయితే మూడు నెలల తర్వాత అంటే మే 21న ఖేక్ ను విడుదల చేయాలని కోర్టు చెప్పింది. విడుదల ఖరారు కావడంతో జైలు ఆసుపత్రిలో ఉన్న ఖేక్ 94 రోజుల దీక్ష విరమించారు. ఇజ్రాయెల్ లో అత్యవసర నిర్బంధం కింద జైళ్లలో మగ్గిపోతోన్నవారి సంఖ్య 600కు పైనే ఉంటుందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల అంచనా. మొహమ్మద్ విడుదల కోసం ఆందోళన చేస్తోన్న అతని భార్య, కుమారుడు(ఫైల్ ఫొటో) -
శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
-
మరో పెద్ద పతనాన్ని చవిచూశాయి
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
-
ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం
-
మున్సిపల్ సమ్మెకు తెర
- విరమిస్తున్నట్టు ప్రకటించిన జేఏసీ.. నెగ్గిన సర్కారు పంతం - డిమాండ్లు పరిష్కారం కాకుండానే ముగింపు - నేటినుంచి విధుల్లోకి 14 వేల మంది కార్మికులు - 67 మున్సిపాలిటీల్లో 40 రోజులు జరిగిన సమ్మె సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పంతమే నెగ్గింది. కార్మిక ఐక్య సంఘాలు వెనక్కి తగ్గాయి. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కనీస వేతనాల పెంపుతో సహా 16 డిమాండ్ల సాధనకు జూలై 6 నుంచి చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 67 మున్సిపాలిటీల్లోని 14 వేల మంది కార్మికులు శనివారం నుంచి విధుల్లో చేరనున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే సమ్మెను విరమించడం తెలిసిందే. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక జేఏసీ పంతాలు, పట్టింపుల వల్ల సమ్మె సుదీర్ఘంగా 40 రోజులు కొనసాగింది. జేఏసీ భారీగా ఆందోళలు చేసినా, విపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా సర్కారు దిగిరాలేదు. జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలను పెంచుతూ జూన్ 16నే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, ఇతర మున్సిపాలిటీల కార్మికుల విషయంలో మాత్రం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. చివరిదాకా ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరించింది. శుక్రవారం కూడా ప్రభుత్వంతో చర్చలకు కార్మిక జేఏసీ తీవ్రంగా ప్రయత్నిచినా లాభం లేకపోయింది. సచివాలయంలో పలువురు మంత్రులను కలిసేందుకు జేఏసీ నేతలు విఫలయత్నం చేశారు. సమ్మెపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో మంత్రులెవరూ ఇందులో జోక్యం చేసుకోడానికి ఇష్టపడలేదు. దాంతో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నేతృత్వంలో కార్మిక జేఏసీ నేతలు శుక్రవారం రాత్రి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. కానీ వారి డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వలేనంటూ ఆయన చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున భావి కార్యాచరణపై జేఏసీ నేతలు డి.వెంకట్(సీపీఎం), ఎం.సాయిబాబ, రెబ్బా రమారావు, శేఖర్, ఏసు రత్నం, వి.కృష్ణ, ఎంకే బోస్ తదితరులు అక్కడే అత్యవసరంగా సమావేశమై, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనలు కొనసాగిస్తాం.. జేఏసీ సమ్మెలో ఉన్నవారిలో 90 శాతానికి పైగా దళిత, మహిళా కార్మికులు గనుకనే వారిపట్ల ప్రభుత్వం వివక్ష చూపిందని కార్మిక జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేయడం, డెంగీ మరణాలు చోటు చేసుకోవడంతో సమ్మెను విరమించామన్నారు. డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. -
రాజీనామా చేయాల్సిందే.. వాళ్లు చేయరు!
న్యూఢిల్లీ: అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగానే ముగిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుపక్షాలు ఎవరి ధోరణిని వారు కొనసాగించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంత్రులు రాజీనామా చేయాలని విపక్షం, చేస ప్రసక్తే లేదని కేంద్రం ఎవరి పట్టు మీద వాళ్లున్నారు. దీంతో ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలపై విపక్షాలు పట్టుబట్టాయి. సుష్మ, రాజే, చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని, అప్పటి వరకు చర్చలు జరిగేది లేదని విపక్షం గట్టిగా వాదించింది. విపక్షాలు డిమాండ్లను తోచ్చిపుచ్చిన కేంద్రం.. వాళ్లెవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అయితే ప్రధాని సభలో సమాధానం చెబుతారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి విపక్షాలు ససేమిరా అన్నాయి. వ్యాపం, లలిత్ గేట్ వివాదాలతో గత వారం రోజులుగా పార్లమెంటు అట్టుడుకుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నాయి. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో హోరెత్తిస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు లలిత్ మోదీ వీసా విషయంలో బ్రిటిష్ గవర్నమెంటుకు తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో ప్రకటించారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అఖిలపక్షం ముగిసిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లోనూ విపక్ష సభ్యుల నిరసనల హోరు కొనసాగుతోంది. -
భారీనష్టాల్లో ముగిసిన స్టాక్ మార్క్ట్లు
-
జనహారతి
పుష్కరుడు పులకరించిన వేళ! 12 రోజుల్లో 2.92 కోట్ల మంది పుణ్యస్నానాలు మహాహారతితో ముగిసిన పన్నెండేళ్ల పండుగ పుష్కరుడు పులకరించేలా.... గోదారమ్మ పరవశించేలా పన్నెండేళ్ల పండుగ వైభవంగా ముగిసింది. గోదావరి మహాపుష్కరాలు ఆరంభమైంది మొదలు ముగిసేవరకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. గతంలో ఏ పుష్కరాలకు లేనంతగా 12 రోజుల్లో 2,92,17,992 మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా పుష్కర స్నానమాచరించారు. పన్నెండు రోజుల పండుగతోపుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో 6 కోట్ల మందికి పైగాపుష్కరస్నానమాచరిస్తే అందులో సగం మంది మన జిల్లాకే వచ్చారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిశాయి. 14న ఉదయం 6.20 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా ధర్మపురిలో పుష్కరాలు ప్రా రంభించిన నాటి నుంచి మొదలు శనివారం సాయంత్రం 6.21 గంటలకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతుల చేతుల మీదుగా మహాహారతి కార్యక్రమంతో పుష్కర పండుగకు ఘన వీడ్కోలు పలికేంతవరకు జనం తండోపతండాలుగా పుష్కర ఘాట్లకు వస్తూనే ఉన్నారు. గోదావరి పుష్కరాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన దాఖలాల్లేవు. రాష్ర్టవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా పుష్కర స్నానమాచరిస్తే అందులో సగం మంది కరీంనగర్ జిల్లాకే రావడం విశేషం. వీరిలో పుష్కర స్నానం చేసి వివిధ ఆలయాల్లో దైవదర్శనం చేసుకున్న వారు 1.73 కోట్ల మంది ఉన్నారు. సాధారణ భక్తులతోపాటు పుష్కర స్నానం చేసేందుకు జిల్లాకు తర లివచ్చిన ప్రముఖులెందరో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, సినీ, కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు... ఇలా ప్రముఖులెందరో వచ్చారు. పన్నెం డు రోజుల పండుగతో పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజు లక్షల మంది భక్తులతో ధర్మపురి దద్దరిల్లింది. కాళేశ్వరం కిటకిటలాడింది. కోటిలింగాల కోటేశ్వరుడి నామస్మరణతో ఊగిపోయింది. మంథని మహాజాతరలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.... గోదావరి పుష్కరాలు కరీంనగర్‌కు ప్రత్యేక శోభను సంతరించి వెళ్లాయి. కాళేశ్వరంలో... త్రిలింగ క్షేత్రం... త్రివేణి సంగమంలో 12 రోజుల పండగ మహా వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. 12 రోజుల్లో 83 లక్షల పైచిలుకు భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. ఇందులో 30 లక్షల మంది కాళేశ్వర ముక్తీరస్వామిని దర్శించుకున్నారు. అభిషేకాలు, దర్శన టికెట్లు, లడ్డూ, పులి హోర ప్రసాదాల ద్వారా రూ.1.40కోట్ల ఆదాయం ఆలయూనికి సమకూరింది. అంచనాకు మించి భక్తులు తరలిరావడంతో పలుమార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 5 నుంచి 8వ రోజు వరకు రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు తరలిరావడంతో కాస్త అసౌకర్యం తప్పలేదు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు కాళేశ్వరంలోనే బస చేయగా, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పన్నెండు రోజులు ఇక్కడే మకాం వేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బరాయుడు నిరంతర పర్యవేక్షణతో ట్రాఫిక్ సమస్య సహా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా అపశ్రుతులు దొర్లాయి. పుష్కర స్నానానికి వస్తూ కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంథని మండలం ఎగ్లాస్పూర్ వద్ద ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్రలోని వెంకటాపురానికి చెందిన ఒకరు, కథలాపూర్ మండలం తాం డ్రియాల సర్పంచ్ పానుగం టి శంకర్ అస్వస్థతతో మరణించారు. పుష్కరాలను రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించగా, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మహాహారతితో ముగింపు పలికారు. ధర్మపురి... భక్తకోటి ధర్మపురి పుష్కరఘాట్లలో 93 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. మొదటి నుంచే భారీగా తరలివచ్చారు. మొదటి రెండు రోజు లు భక్తుల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.25 లక్షల మధ్యలో ఉండగా తరువాత రోజుల్లో భక్తజనం పెరిగింది. గడిచిన శని, ఆదివారాల్లో అత్యధికంగా జనం వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బం దులతో భక్తులు సమస్యల పాలయ్యారు. స్పీకర్ మధుసూదనాచారితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆర్టీసీ వారు ధర్మపురిలో 60-100 ఉచిత బస్సులు నడిపి భక్తులకు ఘాట్ల వద్దకు చేర్చారు. ధర్మపురి గోదావరి పుష్కర స్నానాల అనంతరం లక్ష్మీనృసింహస్వామివారిని 50 లక్షల మంది దర్శించుకున్నారు. మొత్తం 12 రోజుల వ్యవధిలో గుడికి రూ.1.38 కోట్ల ఆదాయం సమకూరింది. సాయంత్రం ధర్మపురి అన్ని ఘాట్లలో పూర్ణాహుతి నిర్వహించడంతోపాటు మంత్రి ఈటల చేతుల మీదుగా మహాహారతి ఇచ్చి పన్నెండు రోజుల పండుగకు ముగింపు పలికారు. మంథని, గోదావరిఖనిలోనూ... మంత్రపురిగా పిలువబడే మంథనిలో సైతం పుష్కర గోదావరి పరవశించింది. పన్నెండు రోజుల్లో 24 లక్షల మంది భక్తులు పుష్కర స్నా నం చేశారు. పది లక్షల మంది భక్తులు గౌతమేశ్వరున్ని దర్శించుకున్నారు. గోదావరిఖని వద్దనున్న మూడుఘాట్ల వద్ద 12రోజులుగా 17.25 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు పుష్కరఘాట్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఢిల్లీకి చెందిన బోర్డు డెరైక్టర్ డీఎన్ ప్రసాద్ గోదావరిఖని పరిసర ప్రాంత పుష్కరఘాట్లలో స్నానం చేసి వెళ్లారు. కోటిలింగాలలో 20 లక్షలు కోటిలింగాలలో పుష్కరాల మొదటిరోజు ప్రారంభమైన భక్తుల ప్రవాహ ఝరి చివరిరోజు వరకు కూడా తగ్గలేదు. శనివారం లక్ష మంది పుష్కరస్నానం చేశారు. మొత్తం 12 రోజుల్లో 20 లక్షలమంది స్నానమాచరించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు మొదలైన రద్దీ ఘాట్లు ముగిసే వరకు కొనసాగింది. మంత్రి ఈటల, చీఫ్ విప్ కొప్పుల, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోటిలింగాల పుష్కర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటిలింగాల పుష్కర ఘాట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బోట్లో వెళ్లి వచ్చారు. కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డెప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
గ్రీస్ సంక్షోభాన్ని అధిగమించిన మార్కెట్లు
ముంబై: సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. దాదాపు 300 పాయింట్ల భారీ నష్టాల నుంచి కోలుకొని దాదాపు 115 పాయింట్లకు పైగా లాభాలతో ముగిశాయి. గ్రీస్ సంక్షోభం భారత మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చన్న ఆర్థిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ మద్దతుస్థాయికి పైన చాలా బలంగా నిలబడింది. ఉదయం 8,400 మార్క్ దగ్గర ఒడిదుడుకులకు లోనైన నిఫ్టీ చివరకు నొలదొక్కుకుని 8522 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 28,209 పాయింట్ల వద్ద ముగిశాయి. మరోవైపు గ్రీస్ సంక్షోభం చాలా స్వల్ప కాలం మాత్రమే ప్రభావంచూపిస్తుందని, దీర్ఘకాలంలో మన మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రానున్న 18 నెలల్లో నిఫ్టీ 11 వేల మార్క్ దాటొచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చరిత్రలో కలిసిన 15వ లోక్‌సభ