
గ్రీస్ సంక్షోభాన్ని అధిగమించిన మార్కెట్లు
ముంబై: సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. దాదాపు 300 పాయింట్ల భారీ నష్టాల నుంచి కోలుకొని దాదాపు 115 పాయింట్లకు పైగా లాభాలతో ముగిశాయి. గ్రీస్ సంక్షోభం భారత మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చన్న ఆర్థిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ మద్దతుస్థాయికి పైన చాలా బలంగా నిలబడింది. ఉదయం 8,400 మార్క్ దగ్గర ఒడిదుడుకులకు లోనైన నిఫ్టీ చివరకు నొలదొక్కుకుని 8522 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 28,209 పాయింట్ల వద్ద ముగిశాయి.
మరోవైపు గ్రీస్ సంక్షోభం చాలా స్వల్ప కాలం మాత్రమే ప్రభావంచూపిస్తుందని, దీర్ఘకాలంలో మన మార్కెట్ల ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రానున్న 18 నెలల్లో నిఫ్టీ 11 వేల మార్క్ దాటొచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.