సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, ఆర్బీఐ మీడియా సమావేశం నిర్వహించనుందనే వార్తతో ఆరంభంలోనే వెయ్యి పాయింట్లకు పైగా జంప్ చేశాయి. అన్ని రంగాల షేర్లూ కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. ఒక దశలో నిప్టీ 93 వందల స్థాయిని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 979 పాయింట్లు ఎగిసి 31584 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ఎగిసి 9273 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా మినహా బ్యాంకింగ్, ఐటీ, ఎఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, ఐటీ ఇలా అన్నిరంగాలు దూకుడుగా ఉన్నాయి. ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ ఈ ఉదయం మీడియానుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతుండగా, వేదాంతా, క్యాడిల్లా, టొరంటో ఫార్మ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment