
శ్రీనగర్: 62వ వార్షిక అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది.
యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు.