
Amarnath Yatra 2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్‌నాథ్‌యాత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్ర ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రోజుల మాత్రమే పరిమితం. బాబా బర్ఫానీ యాత్రగా చెప్పుకునే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు వరకు సాగనుంది. శివుడి ప్రతిరూపమైన మంచు లింగాన్ని చూడటానికి ప్రతిరోజూ 15వేల మంది యాత్రికులు ఇక్కడికి తరలివస్తారు. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. 2025 ప్రయాణానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 14 నుంచి మొదలైనట్టు బోర్డు ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహకు సాగే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ల కంటే తక్కువ 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు. అంతేకాదు అమర్‌నాథ్‌కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్‌కు ఒక్క భక్తుడు మాత్రమే అర్హులు ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉండదు అని గమనించాలి. అమర్ నాథ్ యాత్ర 40-60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 14 తేదీ నుంచే ప్రారంభం అయింది. ఈ యాత్ర ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్రబోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది.
ఈ కష్టతరమైన ప్రయాణానికి జాగ్రత్తలు, తీసుకెళ్లకూడని ఆహారపదార్థాలు, తీసుకెళ్ల కూడని వస్తువుల జాబితాను కూడా ప్రకటించారు. ఈ యాత్ర సమయంలో జంక్ ఫుడ్ యాత్రికులకు పెద్ద అడ్డంకిగా మారింది. చాలా మంది భక్తులు లంగర్ సేవలను ఎంచుకుంటారు. ఇక్కడ స్వచ్ఛంద సేవకులు, సంస్థలు మార్గంలో కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజనం, పానీయాలను అందిస్తాయి. వీటికితోడు స్థానిక వ్యాపారులు నడిపే స్థానిక తినుబండారాలు, రెస్టారెంట్లు , టీ స్టాళ్లు కూడా యాత్రికులకు ప్రాంతీయ వంటకాలు , రిఫ్రెష్‌మెంట్‌లు ఉండనే ఉంటాయి.
నిషేధిత ఆహార పదార్థాలు
మాంసాహార ఆహారాలు: అన్ని రకాల మాంసం ఉత్పత్తులు
మత్తు పదార్థాలు: ఆల్కహాల్, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాలు
వేయించిన ఆహారాలు: పూరీ, బతురా, పిజ్జా, బర్గర్, స్టఫ్డ్ పారంతా, దోస, వేయించిన రోటీ, వెన్నతో బ్రెడ్
క్రీమ్ ఆధారిత వంటకాలు: భారీ క్రీమ్‌తో తయారుచేసిన ఏదైనా ఆహారం
సంభారాలు: ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్
ఫాస్ట్ ఫుడ్స్: చౌమీన్ , ఇతర సారూప్య తయారీలు, శీతల పానీయాలు
తీపి మిఠాయిలు: కర్రా హల్వా, జలేబీ, గులాబ్ జామున్, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా తదితర స్వీట్లు
కొవ్వు ,ఉప్పు అధికంగా ఉండే స్నాక్స్: చిప్స్, కుర్కురే, మత్తి, నమ్కీన్ మిశ్రమం, పకోరా, సమోసా, వేయించిన డ్రై ఫ్రూట్స్
అనుమతి ఉన్న ఆహార పదార్థాలు
స్టేపుల్స్: తృణధాన్యాలు, పప్పులు, బియ్యం
తాజా ఉత్పత్తులు: ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ సలాడ్, పండ్లు, మొలకలు
సహజ తీపి పదార్థాలు: బెల్లం లాంటివి,
దక్షిణ భారత వంటకాలు, సాంబార్, ఇడ్లీ, ఉత్తపం, పోహా
పానీయాలు: హెర్బల్ టీ, కాఫీ, తక్కువ కొవ్వు పెరుగు, షర్బత్, నిమ్మకాయ గుజ్జు/నీరు
ఎండిన పండ్లు: అంజీర్, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ఇతర వేయించని రకాలు
డెజర్ట్‌లు- స్వీట్లు: ఖీర్ (బియ్యం/సాబుదానా), తెల్ల ఓట్స్ (దలియా), తక్కువ కొవ్వు పాలు సావైన్, తేనె, ఉడికించిన స్వీట్లు (క్యాండీ)
తేలికపాటి స్నాక్స్: వేయించిన పాపడ్, ఖాక్రా, నువ్వుల లడ్డు, ధోక్లా, చిక్కీ (గుచక్), రేవేరి
ఫులియన్ మఖానే, ముర్మారా, డ్రై పెథా, ఆమ్లా మురబా, ఫ్రూట్ మురబా, పచ్చి కొబ్బరి లాంటివి తీసుకెళ్ళొచ్చు.