piligrims
-
వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్‌లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్‌లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు. జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్‌లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా. మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్‌కు చేరుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం! -
షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.!
గోపాల్పేట: దేవుడి మొక్కు తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై ముగ్గురు గాయాలపాలైన ఘటన ఏదుల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం ఏదుల సమీపంలోని కథాల్‌సాయన్న దేవుడికి తమకు మొక్కుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులు పెద్దదగడ నుంచి ఏదుల కథాల్‌సాయన్న గుడి వద్దకు డీసీఎంలో సుమారు 15మంది వచ్చారు. డీసీఎంలో వచ్చిన వారు కొంత దూరంలోనే దిగారు. వృద్ధులు గుడి దగ్గరకు వెళ్లి అక్కడ దిగేందుకు డీసీఎంలోనే కూర్చున్నారు. గుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత డ్రైవర్ డీసీఎంను నిలిపేందుకు వెళ్తుండగా, 11 కేవీ వైర్లు కిందకు వేలాడుతూ ఉండటంతో డీసీఎంకు తగిలాయి. అలాగే ముందుకు వెళ్లడంతో కరెంటు పోల్ విరిగిపోయి వైర్లు తెగి నేలకు తగిలాయి. దీంతో డీసీఎం అంతా షాక్ రావడంతో అందులో ఉన్న వృద్ధులు ఈశ్వరమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తప్పించుకున్నాడు. వెంటనే కరెంట్ బంద్ చేయించి వారిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైర్లు వేలాడటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇది చదవండి: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...! -
కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..
హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు. కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు. ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి -
భారీ భద్రత నడుమ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర ఈరోజు(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 31వ తేదీ వరకూ అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రం దర్శనలో భాగంగా భక్తులు మంచుతో కూడిన శివలింగాన్ని దర్శించుకోనున్నారు. మొత్తంగా 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకోనున్నారు. మొదటి మార్గంలో వెళ్లేవారు షెహల్గావ్ నుంచి పంచతరుణికి వెళ్లి.. అక్కడ నుంచి అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. రెండో మార్గంలో వెళ్లే వారు శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు వెళ్లి అక్కడ నుంచి సుమారు 14 కి.మీ పయనించి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్ నాధ్ యాత్రకి ఐటీబీపీ దళాలు భారీ భద్రత కల్పిస్తున్నాయి. ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు అమర్నాథ్ యాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు. -
పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి
ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు. మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. अरे अरे.. हिंदूत्ववादी सरकारचे ढोंग उघडे पडले.. मुखवटे गळून पडले..औरंगजेब यापेक्षा वेगळे काय वागत होता?वारकऱ्यांचा हिंदू आक्रोश सरकार असा चिरडून टाकतआहे. मोगलाई महाराष्ट्रात पुन्हा अवतरली आहे..@BJP4Maharashtra @Dev_Fadnavis @AUThackeray @ https://t.co/pnUc45IZ01 — Sanjay Raut (@rautsanjay61) June 11, 2023 श्री क्षेत्र आळंदी येथे वारकरी बांधवांवर पोलिसांनी लाठीमार केल्याचा प्रकार अत्यंत संतापजनक आहे. वारकरी संप्रदायाचा पाया रचणारे थोर संत ज्ञानेश्वर महाराज यांच्या आळंदीत वारकरी बांधवांचा झालेला हा अपमान अत्यंत निषेधार्ह आहे. वारकरी संप्रदाय, वारकरी बांधव यांच्याबद्दल सरकारची काही… pic.twitter.com/IDtIy1azn3 — Chhagan Bhujbal (@ChhaganCBhujbal) June 11, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. -
దైవ దర్శనానికి వెళ్తూ జీపు బోల్తా.. ఆరుగురు యాత్రికులు మృతి
బెళగావి: దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7 -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఒకే కుటుంబంలో 9 మంది దుర్మరణం!
బెంగళూరు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టెంపో ట్రావెలర్‌ను ఓ పాల వ్యాన్ ఢీకొట్టటంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. జిల్లాలోని అర్సికేరే తాలుకాలోని గాంధీనగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు చెప్పారు. ‘గాంధీనగర్ సమీపంలో టెంపో ట్రావెలర్, కేఎంఎఫ్ పాల వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.’ అని పేర్కొన్నారు. Hassan, Karnataka | 9 people died in an accident involving a head-on collision between a Tempo traveller vehicle and a KMF milk vehicle near Gandhinagar in Arsikere taluka while returning home after visiting Dharmasthala, Subramanya, Hasanamba temples: Police pic.twitter.com/DTbMkbWnWI — ANI (@ANI) October 16, 2022 ఇదీ చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన -
క్షేమంగా తిరిగొచ్చిన అమర్నాథ్ యాత్రికులు
నందిగామ: భగవంతుని దర్శనానికి వెళ్లిన వారు భద్రంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. పరమేశ్వరుని దయతో విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డామని చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్నాథ్ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు. వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మంది కలిపి మొత్తం 35 మంది గత నెల 27న విజయవాడ నుంచి రైలులో అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటికే అప్పటివరకు వారు బస చేసిన ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. వీరంతా అప్పటికే ఆ ప్రాంతాన్ని వదిలి కొద్దిదూరం వచ్చేయటంతో సురక్షితంగా బయటపడగలిగారు కానీ, ఆ భీతావహ వాతావరణంలో కొందరు బృందం నుండి విడిపోయారు. తప్పిపోయిన వారు ఆదివారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకోవటంతో ఆర్మీ సిబ్బంది మొత్తం 35 మందిని ఒకే బస్సులో ఎక్కించి ఆదివారం రాత్రికి జమ్మూకు చేరవేశారు. అక్కడి నుంచి చండీగఢ్æకు వచ్చి, అక్కడి నుంచి రైలు ద్వారా మంగళవారం రాత్రికి విజయవాడకు చేరుకున్నారు. దేవుడే రక్షించాడు విపత్తు సంభవించటానికి కొద్దిసేపటి ముందువరకు మేము అక్కడే ఉన్నాము. అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే భీతావహమైన ఘటన చోటు చేసుకుంది. అలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. దేవుడు మమ్మల్ని రక్షించాడు. – అత్తలూరి పార్వతమ్మ, చందర్లపాడు ప్రభుత్వం సహకరించింది కొండ మార్గంలో ఒక్కసారిగా వరద ముంచెత్తిన సమయంలో మాతో వచ్చిన కొందరు తప్పిపోయారు. మన ప్రభుత్వం చొరవ చూపి జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు విచారించింది. మొత్తం మీద సురక్షితంగా ఇంటికి చేరాం. – అత్తలూరి అక్షయలింగ శర్మ, చందర్లపాడు -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని నున్వాన్ క్యాంప్, గందర్బల్ జిల్లా బాల్టాల్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి.. ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
జైపూర్: రాజస్తాన్‌లోని నగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బికనీర్-జోధ్‌పూర్ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు, టక్కు పరస్పరం ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బికనీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంగా మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజస్తాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి ప్రమాద ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. మధ్యప్రదేశ్‌కు తిరుగు ప్రయాణమైన 11 మంది యాత్రికులు నగౌర్‌లోని శ్రీబాలాజీ పట్టణం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని గెహ్లాట్ పేర్కొన్నారు. బాధితులకు నష్టపరిహారం రాజస్తాన్ రోడ్డు ఘటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కాగా నాగౌర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ గ్రేషియా సహాయాన్ని ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు. -
ఆదర్శనీయులు ఆర్కాట్ నవాబులు.. ‘డచ్చస్’ క్లబ్ ప్రశంసలు
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆర్కాట్ నవాబులు సంస్కృతి, సంప్రదాయాలకే కాదు, కుల మతాలకు అతీతంగా సేవలు అందించడంలో ఆదర్శనీయులని డచ్చస్ క్లబ్ వ్యవస్థాపకురాలు, హోటల్ సవేరా మేనేజింగ్ డైరెక్టర్ నీనారెడ్డి శ్లాఘించారు. మహిళా సాధికారత, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న డచ్చస్ క్లబ్ ప్రతినెలా ఒక ప్రముఖుడితో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూన్ నెల విశిష్ట అతిధిగా ఆర్కాట్ నవాబు దాదా మహమ్మద్ ఆసిఫ్ అలీని ఆహ్వానించి జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నీనారెడ్డి మాట్లాడుతూ, ఆర్కాట్ నవాబుల్లో రాజదర్పమే కాదు, మానవతా విలువలూ మూర్తిభవించాయన్నారు. అనేక హిందూదేవాలయాల నిర్మాణాల్లో ఆర్కాట్ నవాబులది ప్రధాన పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఆర్కాట్ నవాబ్ ఆసిఫ్ అలి మాట్లాడుతూ, చెన్నై రాయపేటలోని ఆమీర్ మహల్ ఆనాటి ఆర్కాట్ నవాబుల వైభవ జీవితానికి, అభిరుచులకు నిలువుట్టద్దంగా నిలుస్తూ నేటికీ వర్ధిల్లుతోందని అన్నారు. అమీర్ మహల్‌లోని పూర్వీకుల తైలవర్ణ చిత్రాలు, మేనా (పల్లకి), షాండిలియర్స్ అందాలు వర్ణనాతీతమన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందం అమీర్ మహల్ సొంతమని వర్ణించారు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆలయం, చెన్నై మైలాపూర్ ఆలయంతోపాటూ పలు హిందూ దేవాలయాల నిర్మాణాలకు తన తాతముత్తా లు అందజేసిన సేవల గురించి ఆయన వివరించారు. ఆర్కాట్ నవాబుల విశేషాలు, అమీర్ మహల్ అందాలు తిలకించే భాగ్యం కల్పించిన ఆర్కాటు నవాబుకు డచ్చస్ క్లబ్ తరపున నీనారెడ్డి, అనుఅగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. డచ్చస్ ప్రతినిధులు సుజాత ముంద్రా, అను అగర్వాల్, అను సచ్చిదేవ్, రా«ధీ నీలకంఠన్ తదితర 100 మంది సభ్యులు పాల్గొన్నారు. -
మేడారం జాతరలో అపశ్రుతి
సాక్షి, వరంగల్ : మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా గుర్తించారు. వీరిద్దరు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనానికి వచ్చి స్నానాలు చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో వారికి మూర్ఛ వచ్చి వాగులో పడి మృతిచెందారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం బాటపట్టారు. పెద్ద మొత్తంలో వాహనాలు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు ప్రారంభించారు. -
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
డేరాబాబా నానక్ (గురుదాస్‌పూర్)/ కర్తార్‌పూర్ (పాకిస్తాన్): పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం నాకు లభించిన వరం. ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా’అని తెలిపారు. నానక్ జీవితం సిక్కులకు మాత్రమే కాదు మానవాళికే స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కర్తార్‌పూర్‌లో భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుమారు 12 వేల మంది సిక్కు యాత్రికుల సమక్షంలో కారిడార్ ప్రారంభించారు. భారత్ నుంచి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు కుశల ప్రశ్నలు అడిగారు. -
తిరుమలలో తనిఖీలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి
-
తిరుమలలో తనిఖీలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల : తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, నారాయణ గిరి ఉద్యానవనం, బూందిపోటులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. తిరమలలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బూందిపోటులో స్టీమ్‌తో లడ్డూల తయారీని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. -
కుంభ్ జియో ఫోన్ : ఆఫర్లేంటంటే..
సాక్షి, ముంబై: 2019 కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం టెలికం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. భక్తుల సౌకర్యార్థం ఒక స్పెషల్ జియోఫోన్‌ను లాంచ్ చేసింది. తద్వారా జనవరి 15 నుంచి మార్చి 4 వరకు కొనసాగే ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే130 మిలియన్లమందికి పైగా భక్తులకు విశేష సేవలందించేందుకు సిద్ధమైంది. కుంభ మేళా, ముఖ్యమైన ఫోన్ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని డిజిటల్ సొల్యూషన్స్ అందించడానికి కుంబ్ జియో ఫోన్‌ను తీసుకొచ్చింది.1991 హెల్ప్‌లైన్ ద్వారా సహాయంతోపాటు, ఉచిత వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను అందించన్నుట్టు జియో ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో ఒక యాప్‌ను అందిస్తోంది. తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు జియో తెలిపింది. అలహాబాద్ కుంభమేళా సందర్భంగా యాత్రీకులకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కుంభ్ జియో ఫోన్‌ను ఆ విష్కరించింది. ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ కుంభ్ జియో ఫోన్ ద్వారా కుంభమేళాకు సంబంధించి ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. అలాగే కుంభ్ రేడియో ద్వారా 24x7 భజనలు, ఇతరభక్తి సంగీతాన్ని వినే అవకాశాన్ని కూడా కల్పించింది. కుంభమేళా ప్రదేశం రూట్‌మ్యాప్‌తో పాటు బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారాన్ని కూడా ఎప్పటికపుడు అందిస్తుంది. ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. కుంభ్ జియో ఫోన్ ఫీచర్లు 1991 హెల్ప్‌లైన్ నంబరు ద్వారా ప్రత్యేక సేవలు కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యేక బస్సులు, రైళ్లకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ టికెట్స్ బుకింగ్, రైల్వేక్యాంప్ మేళా కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించే సదుపాయం. ఇలా ముఖ్యమైన సందేశాలు, ప్రకటనలు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటాయి. -
నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు
-
సాయం కోసం యాత్రికుల పడిగాపులు
సాక్షి, హిల్సా : కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్ క్యాంపు(భారత్-నేపాల్ సరిహద్దు)లో భారీ సంఖ్యలో యాత్రికులు చిక్కుకున్నారు. అందులో వందమందికిపైగా తెలుగు వారు కూడా ఉన్నారని విజయవాడ చిట్టీనగర్‌కు చెందిన ఒర్సు మురళీ కృష్ణ, ఒర్సు నాగేశ్వరరావులు తెలిపారు. ఆహారం కూడా దొరక్క యాత్రికులు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గత నెల 27న మనససరోవర్ యాత్రకు వెళ్లామని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకున్నారు. డబ్బులు కూడా అయిపోవడంతో యాత్రికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా హిల్సా బేస్‌క్యాంప్ వద్ద వాతావరణ పరిస్థితితో మార్పు కనిపించడం లేదు. ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హిల్సా వద్ద 550 మంది, సిమికోట్ వద్ద 525, టిబెట్ వైపు మరో 500 మంది చిక్కుకున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నేపాల్‌గంజ్, సిమికోట్ ప్రాంతాల్లో ఇండియన్ ఏంబసీ ప్రతినిధుల్ని నియమించింది. చిక్కుకున్న యాత్రికులకు భోజన వసతి సదుపాయాలపై అధికారలులు సమీక్ష నిర్వహించారు. సిమికోట్‌లో చిక్కుకున్న యాత్రికులకు స్థానిక వైద్యుడితో ఏంబసీ సిబ్బంది వైద్యపరీక్షలు చేపిస్తోంది. హిల్సాలో చిక్కుకున్న యాత్రికులకు నేపాల్ పోలీసుల సహాయంతో ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కుకున్న యాత్రికులను కుదిరితే సిమికోట్ వైపు, లేదంటే టిబెట్ వైపు తరలించి వైద్య సదుపాయాలు కల్పించాలని టూర్ ఆపరేటర్లకు సూచించారు. సిమికోట్-సుర్ఖేత్, సిమికోట్-జుమ్లా, సిమికోట్-ముగు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాత్రికుల్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాత్రికుల కుటుంబ సభ్యుల కోసం ఇండియన్ ఏంబసీ హాట్‌లైన్‌ను నెంబర్‌ను ఏర్పాటు చేసింది. తెలుగువారి కోసం +977-9808082292 నెంబర్లో అధికారి పిండి నరేష్ అందుబాటులో ఉంటారు. మరోవైపు మానస సరోవర యాత్రికులను రక్షించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కోరారు. తెలుగు వారు పడుతున్న కష్టాలను మురళీధర్ రావు వివరించారు. ఎంబసీ అధికారులు రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, యాత్రికులను సురక్షితంగా తరించేలా చర్యలు చేపడుతున్నామని సుష్మా స్వరాజ్ చెప్పారు. -
ఇబ్బందుల్లో కైలాస్ మానస సరోవర్ యాత్రికులు
-
విషాద యాత్ర
పన్నెండు రోజులు... కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం... అంతా సవ్యంగానే సాగింది. కాశీ వంటి తీర్థయాత్రలను విజయవంతంగా చేసుకుని వచ్చారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఓ బస్సులో బయలుదేరిన వీరంతా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్దకు చేరుకున్నారు. సముద్రస్నానాలు చేశారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని చివరిగా సింహాద్రప్పన్నను దర్శించి ఇళ్లకు చేరాలనుకుని బయలుదేరారు. ఇన్నాళ్ల ప్రయాణం వల్ల వచ్చిన బడలిక... వాతావరణం చల్లగా ఉండటం... కాస్త కడుపులో ఆహారం పడటంతో... అంతా చిన్నగా కునుకు తీస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టింది. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అంతా బస్సులోనే ఇరుక్కున్నారు. తేరుకుని చూసేసరికి గాయాలతో అందరి ఒళ్లూ రక్తసిక్తమై ఉంది. తమతో ప్రయాణిస్తున్న ఓ ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో 46మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ యలమంచిలి వాసుల విషాద యాత్ర. భోగాపురం (విజయనగరం జిల్లా), యలమంచిలి రూరల్, మాకవరపాలెం : సుదీర్ఘ యాత్ర సవ్యంగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి విషాదం నింపింది. తమతో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సులోనే ప్రాణాలు కోల్పోగా 46 మంది తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఐకమత్యంగా వెళ్లిన వారంతా... ఒక్క సంఘటనతో కకావికలమయ్యారు. ఇదీ బుధవారం మధ్యాహ్నం భోగాపురం మండలం జాతీయ రహదారి పోలిపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఫలితం. యలమంచిలి, ఎస్.రాయవరం, మాకవరపాలెం, చిన్నగుమ్ములూరు, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన 43 మంది తోడుగా ఇద్దరు వంటపనివారను తీసుకుని ఈ నెల రెండో తేదీన కాశీయాత్రకు ఎస్ఎస్ టీఆర్ ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. పది రోజులపాటు దిగ్విజయంగా యాత్రలు పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లారేసరికి పూసపాటిరేగ సమీపానికి చేరుకోగానే చింతపల్లి వద్ద సముద్రంలో స్నానాలు చేసుకున్నారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసి అక్కడినుంచి సింహాచలం వెళ్లి వరాహనర్సింహస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ వద్ద ఒక్కసారిగా యూ టర్న్ తీసుకునేందుకు ఆగగా... దాని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఆ ధాటికి అదుపు తప్పిన లారీ ఎదురుగా యాత్రికులతో వస్తున్న బస్సును ఢీకొంది. బస్సు రెండు పల్టీలు కొట్టి తలకిందులైంది. అనుకోని సంఘటనతో యాత్రికులంతా ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ప్రమాదం వార్త తెలుసుకున్న సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే విస్తరణ పనులు చేపడుతున్న వారికి సమాచారం అందించి మూడు జేసీబీలను తీసుకువచ్చి లారీలో, బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక పోతిరెడ్డి పాలేనికి చెందిన కరణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి(52)లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ఎస్పీ పాలరాజు ప్రమాద స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్, అంబులెన్స్, బొలెరో ఇలా అన్ని వాహనాల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 28 మందిని, విశాఖ కేజీహెచ్‌లో 9మందిని, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 7గురిని తరలిం చారు. వారంతా ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వెల్లకట్టలేని గ్రామీణుల సేవలు ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లా పాపలతో హాహాకారాలు చేస్తున్న యాత్రికులను స్థానిక యువకులు బస్సులోంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి సమాచారం అందడంతో వైద్యాధికారి సునీల్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయాలపాలై రక్తం కారుతూ ఉన్న వారికి ప్రథమ చికిత్స చేశారు. వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు నుంచి సిబ్బంది వచ్చి కట్టర్ల ద్వారా బస్ సీట్లను, బాడీని కట్ చేసి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయ ధర్మకర్త కర్రోతు పైడిరాజు విద్యుత్ సరఫరాను అందించారు. స్థానికులు జనరేటర్ తీసుకువచ్చి, రోడ్డుపైన పడిఉన్న క్షతగాత్రులకు ఫ్యాను సౌకర్యం కలగజేసి ఉపశమనాన్ని అందించారు. -
శ్రీవారి అలయం ముందు తప్పిన ప్రమాదం
-
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రాడూన్: కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న సంగతి తెలిసిందే. భక్తుల సందర్శనార్థం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది. భక్తుల కోసం వైద్య, విద్యుత్, నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మళ్లీ నవంబర్‌లో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. -
ఆలయాల సంరక్షణ ఎలా?
ఆ భగవంతునికి అర్చకుడు భగవత్ కైంకర్యంలో తన సర్వస్వాన్ని అర్పిస్తాడు. తనను, తన అధీనంలోని చేతన అచేతన సంపదను నిశ్శేషంగా సమర్పిస్తాడు. ఈ సమర్పణలో అర్చకుని భార్య, పిల్లలు, చుట్టాలు, ధన, కనక వస్తు వాహనాలు మొదలైనవి అతీ తం కావు, అన్నీ స్వామికి సమర్పించి, ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాడు. అర్చకుడు ఆలయంలో సేవ చేసినపుడు అతనితోపాటుగా అతని కుటుంబం కూడా శారీరకంగా, మానసికంగా పాలుపంచుకుంటుంది. అర్చకత్వం అనేది ఒక బృహత్తర బాధ్యత. సమాజం సుఖశాంతులతో, సహ భావనలతో వర్ధిల్లాలని భగవంతుని అనునిత్యం ప్రార్థించే అర్చకుడు తిరిగి తనకు అదే సమాజం వస్తు రూపకంగా ఏదైనా తిరిగి ఇవ్వాలని కోరుకోడు. నిస్వార్థంగానే సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తాడు. అటువంటి అమాయక అర్చకుని బాగోగుల గురించి సమాజం ఆలోచించాలి. అవును. తప్పకుండా ఆలోచించాలి. అర్చకుని గురించిన ఈ ఉపోద్ఘాతానికి కారణం ఉంది. ప్రస్తుత సమాజంలో క్షీణించిపోతున్న అర్చక వర్గ సంఖ్య గురించి వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. యువతరంలో అర్చకత్వంపట్ల సన్నగిల్లుతున్న సుముఖత, అర్చకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేని ఆడపిల్లలు వగైరా. అర్చక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు సైతం, అర్చకుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పరిణామం అత్యంత భయావహం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఇటువంటి నాజూకు విష యం గురించి పాఠకులతో తన భావాలను పంచుకోవాలనుకుంటున్నాము. మా ఉద్దేశం సమాజం ఈ సమస్యవైపు తన దృష్టి సారించలేదని కాదు. అర్చకులు ఆలయాలను విడిచిపెట్టి వెళ్లడానికి ప్రేరేపిస్తున్న కారణాల చిక్కుముడులను విప్పడానికి సమాజం కృషి చేస్తూనే ఉన్నది. 1987లో, నాటి ప్రభుత్వం ఆలోచనా రహితంగా చేసిన చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు అయింది. ఇది సరైన నిర్ణయం కాదని ఎలుగెత్తి చాటిన దేవాలయాల పరిరక్షణ ఉద్యమం, వంశపారంపర్య అర్చకత్వం మళ్లీ పునః అర్చకులకు ఇవ్వాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం స్ఫూర్తితో భక్తులను ఈ దిశలో ఆలోచించేలా చేసింది. తాము అర్చకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడానికి వంశపారంపర్య అర్చకత్వ రద్దే ప్రముఖ కారణంగా పలు వంశపారంపర్య అర్చక కుటుంబాలు పేర్కొన్నాయి. జీవనోపాధికై ఇతర ఉద్యోగాలను చూసుకోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ‘‘అర్చకుని కొడుకు తండ్రికి వారసుడుగా పనికిరాడని ప్రభుత్వమే చట్టం చేస్తే మేమేమి చెయ్యాలి’’ అని ప్రభుత్వంపై నింద మోపారు. తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారు. గ్రామీణ దేవాలయాలను మూతపెట్టి వలసలు వెళ్లిపోయారు. 1996లో అమలు చెయ్యడానికి సాధ్యపడని తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, ఒక అద్భుతమైన తీర్పును చెప్పినట్లుగా తమను తామే అభినందించుకుంది. ఎట్టకేలకు 2007లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనా రహిత చట్టాన్ని సవరించి వంశపారంపర్య అర్చకత్వానికి పునః అవకాశం కల్పించింది. ‘ధార్మిక పరిషత్’ను ప్రవేశపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు దేవాదాయ శాఖలోని కొద్దిమంది స్వార్థపరులైన అధికారులు తమ ధోరణిని మార్చుకోని కారణంగా ఆ చట్టం కూడా అమలుకు నోచుకోలేదు. అర్చకులు వీధినపడ్డారు. దేవాలయాలు మూతపడ్డాయి. దేవాదాయ చట్టంలో సూచించినట్లుగా భక్త సమాజాల స్థాపనే ఇక మనకు మిగిలిన ఏకైక ఆశ. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఈ ధోరణి ఇంకా భయపెట్టేదిగా ఉంది. గ్రామీణ ఆలయాలన్నీ మూతపడ్డాయి. అక్కడ పూజలు చెయ్యడానికి అర్చక కుటుంబాలు లేవు. స్థానికులు ఆలయాలను పూర్వస్థితికి తీసుకురావాలని ముందుకు వస్తున్నా కూడా, అర్చకులు తిరిగి తమ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం, అవును. భక్తులమైన మనమే దీనికి తగిన పరిష్కారం ఆలోచించాలి. అర్చకులు గ్రామీణ ఆలయాలను వదిలి వెళ్లకుండా ఆపాలి. వారి కుటుంబ బాధ్యత మనం స్వీకరించాలి. ఈ పని ప్రభుత్వం ఏవో కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా చెయ్యలేదు. దీనికి ఒకే మార్గం. భక్త సమాజాల స్థాపన. ఆలయాల నిత్య విధులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భక్త సమాజాలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వగలవు. ప్రతి గ్రామంలోనూ, అక్కడి స్థానికులైనా, లేకపోతే అక్కడి మూలాలు ఉన్నవారైనా కనీసం 15 కుటుంబాలు కలిసి సంవత్సరానికి కనీసం కొంత ధనాన్ని సేకరించగలిగితే, గ్రామంలోని ఆలయంలో నిత్య విధులు, ఉత్సవాలు సక్రమంగా జరిపించవచ్చు. నిజంగానే ఇది సాధ్యం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఈ లక్ష్య సాధనకై అందరం పాటుపడదాం. సి.ఎస్. రంగరాజన్ వ్యాసకర్త ఆలయాల సంరక్షణ ఉద్యమ కన్వీనర్ మొబైల్ : 98851 00614 -
సౌదీలో ప్రమాదం: నలుగురు బ్రిటిషర్ల మృతి
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ జాతీయులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర మక్కాకు 30 మైళ్ల దూరంలో ఉన్న అల్ ఖలాస్ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన 12 మంది కూడా బ్రిటిష్ జాతీయులేనని సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని మక్కాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ సౌదీ అంబాసిడర్ మహ్మద్ బిన్ నవాఫ్ ట్వీట్ చేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు. -
నేడు హజ్ యాత్రికుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికుల 2018 ఎంపికకు సంబంధించిన కంప్యూటరైజ్డ్ డ్రా పద్ధతిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లో ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు 17,146 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 ఏళ్లకు పైబడిన కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 508 మందిని నిబంధనల ప్రకారం డ్రా లేకుండా నేరుగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం దేశ హజ్ కోటాలో 5 వేలు పెంచడంతో రాష్ట్ర కోటాలో 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడేళ్లు యాత్రకు దరఖాస్తు చేసుకున్నా డ్రాలో ఎంపిక కానివారిని నాలుగోసారి నేరుగా ఎంపిక చేసే కేటగిరీని కేంద్ర హజ్ కమిటీ రద్దు చేసిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మందికి డ్రా ద్వారా యాత్రకు వెళ్లే అవకాశం దక్కనుందని పేర్కొన్నారు. -
చివరి నిమిషంలో పాక్‌కు షాక్.. సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను చూడటానికి వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై మన దేశంసహా పలు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్థాన్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే 192 మంది పాక్ యాత్రికులకు చివరి నిమిషంలో వీసా నిరాకరించి షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో ఉర్సు వేడుకలు జరుగనున్నాయి. నేపథ్యంలో ఇందులో పాల్గొనడానికి పాకిస్థాన్ నుంచి సుమారు 200 మంది యాత్రికులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటన్నింటిని భారత్ తిరస్కరించింది. చివరి నిమిషంలో ఈ ప్రకటనతో యాత్రికులు సహా పాక్ అధికారులు ఖంగుతిన్నారు. భారత్ తీసుకున్న చర్య దురదృష్టకరమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ చర్య సబబేనా అని భారత విదేశాంగ శాఖను ప్రశ్నిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. దౌత్య సంబంధాలను దెబ్బ తీసేలా భారత్ చర్యలు ఉన్నాయని.. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని తెలిపింది. కాగా, 1974 పాకిస్థాన్-ఇండియా ప్రోటోకాల్ ప్రకారం పవిత్ర స్థలాల దర్శన కోసం ఇలా ఇరు దేశాలు వీసా మంజూరు చేసుకోవటం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ అవులియా వర్థంతి సందర్భంగా వందల సంఖ్యలో పాకిస్థానీయులకు ఏటా భారత్ వీసా మంజూరు చేస్తుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని శనివారం 66,541 మంది భక్తులు దర్శించుకోగా 35,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.61 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
ఇల వైకుంఠానికి పోటెత్తిన భక్తజనం
సాక్షి, తిరుమల: ఇల వైకుంఠం తిరుమలక్షేత్రంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా సాగింది. ముక్కోటి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలోకి భక్తులు వెళ్లే సమయంలో తోపులాటలు జరిగాయి. గతేడా ది 2,800 వీఐపీ టికెట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని 4,200లకు పెంచారు. అర్ధరాత్రి తర్వాత వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించారు. తర్వాత 4.09 గంటకు సామాన్య భక్తులను అనుమతిం చారు. ముక్కోటి దర్శనానికి వచ్చే భక్తులను తొలుత 54 కంపార్ట్మెంట్లలోకి అనుమ తించారు. తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లలోకి, ఆలయ నాలుగుమాడ వీధుల్లోకి అనుమతించారు. వైకుంఠద్వార ప్రవేశంతో సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ వీధుల్లో.. గ్యాలరీల్లో తోపులాటలు ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావటంతో రావడంతో భక్తులు కింద పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు చవిచూసారు. సామాన్యులకే ప్రాధాన్యం: ఈవో సాంబశివరావు వైకుంఠ ఏకాదశిలో శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగానే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అధిక సమయం సామాన్య భక్తులకు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్, చల్లా కోదండరామ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రవిబాబు, తమిళ నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంతోష్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మాల దర్శిం చుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో స్వామివారిని దర్శించుకున్నారు. -
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ’ -
ట్రావెల్ సంస్థ యజమానికి జైలు
పాలకొల్లు టౌన్ : భక్తులను హరిద్వార్ తీసుకెళ్తానని నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన యతిరాజా ట్రావెల్ సంస్థ యజమాని రామానుజం వెంకటరమణకు ఏడాది జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం పాలకొల్లు కోర్టు మేజిస్ట్రేట్ ఎ.నాగశైలజ తీర్పుచెప్పారు. 2013 సెప్టెంబర్‌లో పట్టణానికి చెందిన మామిడి వెంకటేశ్వరరావు (బాబు)తోపాటు 23మంది హరిద్వార్ వెళ్లడానికి ట్రావెల్ సంస్థ యజమాని వెంకటరమణకు ఒక్కొక్కరూ రూ.13వేలు చొప్పున చెల్లించారు. ఢిల్లీ వరకు టికెట్లు తీశారు. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లేందుకు ట్రావెల్ యజమాని టికెట్లు తీయకుండా మోసం చేశారు. దీనిపై మామిడి వెంకటేశ్వరరావు పాలకొల్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేశారు. -
పీరీలను నిమజ్జనం చేసిన భక్తులు
ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో గురువారం మోహార్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ధర్మారం, మల్లాపూర్, ఎర్రగుంటపల్లి, మేడారం, దొంగతుర్తి తదితర గ్రామాలలోని హిందూ, ముస్లీంలు ఐక్యంగా వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఆయా గ్రామాలలో దర్గాల ఎదుట పీరీల వద్ద భక్తులు దూలాటలు ఆడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీరీలను ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో రష్యా దేశస్తులు
శ్రీముఖలింగం (జలుమూరు) : ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని రష్యా దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ దేవాలయాలు, కట్టడాలు పరిశీలించి భారత ప్రభుత్వ అనుమతితో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించనున్నట్లు రష్యా బృందం ప్రతినిధులు ఆంద్రీ, అరని, ఇరానీ, కిరే.పుతిన్ తెలిపారు. అనంతరం శ్రీముఖలింగం పరిధిలోని అన్ని దేవాలయాలను పరిశీలించారు. అలాగే ఆలయ అవరణలో ఉన్న శిల్పసంపదపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు వీరితో సెల్ఫీలు దిగారు. అర్చకులు శ్రీకృష్ణ ఆలయ చరిత్ర, కట్టడాలపై వివరించారు. -
పుష్కరాల నుంచి పుణ్య లోకాలకు...
విజయవాడ బెంజి సర్కిల్లో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి–ముగ్గురి పరిస్థితి విషమం మరో ముగ్గురికి గాయాలు పుష్కరాల నుంచి తిరిగొస్తుండగా విషాదం కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగొస్తుండగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మండలానికి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా గాయాల పాలైన వారికి హెల్ప్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఘటనతో ఆయా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... పొందూరు : మండలంలోని తోలాపి, కింతలి గ్రామాలకుS చెందిన పైడి వెంకటరమణ(45), సనపల హర్షవర్ధన్(10)లు విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పైడి అమ్మన్మమ్మ కుటుంబానికి చెందిన వారంతా తమ సొంత కారులో విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. కింతలి గ్రామానికి చెందిన పైడి అమ్మన్మమ్మ పెద్ద కొడుకు పైడి వెంకటరమణ(45), చిన్న కొడుకు పైడి అప్పలస్వామి, చిన్న కోడలు పైడి శారదాదేవి, మనవళ్లు మహేష్ వర్మ, జ్ఞాన సూర్య, తోలాపి గ్రామానికి చెందిన సనపల భూలక్ష్మి(అమ్మన్నమ్మ కూతరు), మనవడు సనపల హర్షవర్ధన్(10) ఒకే కారులో పెళ్లి, పుష్కరాల కోసం ఆదివారం బయలుదేరి వెళ్లారు. అన్నవరంలో ఓ పెళ్లికి వెళ్లి సోమవారం ఉదయమే విజయవాడ పుష్కరాలకు బయలుదేరారు. పుష్కర స్నానం చేసిన వెంటనే మంగళవారం ఏలూరులోని కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లేందుకు ప్రణాళిక వేసుకొని, భోజనం చేసేందుకు వస్తున్నామని ఉదయం 11.30 గంటలకు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. కాగా 12.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రమాదంలో గాయాల పాలైన సనపల భూలక్ష్మి భర్త సనపల మురళీధర్‌కు ఫోన్లో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు మృతి చెందారు. విషాదం... ఈ ఘటనతో తోలాపి, కింతలి గ్రామాల్లోని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలో విషాదం అలముకొంది. తోలాపిలో పైడి అమ్మన్నమ్మ, వెంకటరమణ, అప్పలస్వామి, శారదాదేవి, మహేష్ వర్మ, జ్ఞాన సూర్యలు నివాసముంటున్నారు. మృతుడు వెంకటరమణ సివిల్ ఇంజినీరింగ్ చదవడంతో ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. వారిలో వెంకటరమణ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తోలాపిలో నివాసముంటున్న సనపల మురళీధర్, సనపల భూలక్ష్మి, హర్షవర్దన్‌లు ఇటీవలనే శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి వెళ్లారు. మృతుడు హర్షవర్ధన్(10) సాయి విద్యామందిర్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సకల సౌకర్యాలు
సామాన్య భక్తులే లక్ష్యంగా వసతుల కల్పన జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కృష్ణాపుష్కరాలు గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు పుష్కరాలకు విస్తృతంగా సాంకేతిక సేవలు ‘సాక్షి’ ఇంటర్వూ్యలో కలెక్టర్ టీకే శ్రీదేవి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా సంస్కతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని, సాధారణ భక్తులే లక్ష్యంగా వసతులు కల్పిస్తామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. జిల్లాకే తలమానికంగా ఉన్న జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశనలుమూలల నాటేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. పుష్కరాలకు 1.50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యాత్రికులు వచ్చింది మొదలుకుని.. క్షేమంగా తిరుగు ప్రయాణమయ్యే వరకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని చెబుతున్నారు. కృష్ణాపుష్కరాల నిర్వహణపై శనివారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. అంగరంగ వైభవంగా.. రాష్ట్రంలో మొదటిసారిగా పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వం. యాత్రికులకు కావాల్సిన సమాచారం, సహాయం అందించేందుకు ప్రతిఘాట్ వద్ద స్వచ్ఛంద సేవకులను నియమిస్తున్నాం. సాధారణ భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగించేలా కార్యక్రమాలు చేపడ్తాం. 52 పుష్కరఘాట్లలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశాం. భక్తుల రద్దీకి తగిన విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన పారిశుద్ధ్యం సిబ్బందిని నియమించాం. ప్రతి ఘాట్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ఘాట్‌లో ఎంత మేరకు నీళ్లు ఉన్నాయో.. ఏ మేరకు వెళ్లి స్నానం చేయొచ్చొ తెలియజేసేందుకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. అందుబాటులో వైద్యసేవలు పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నాలుగు ప్రాంతాల్లో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నాం. పస్పుల, రంగాపూర్, బీచుపల్లి, సోమశిల ప్రాంతాల్లో వైద్యులు నిరంతర వైద్యసేవలు అందిస్తారు. లోతు ఉన్న ప్రాంతాలకు భక్తులకు వెళ్లకుండా పోలీస్, స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తారు. ఘాట్ల వద్ద బస్సులు, ఇతర వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ వసతి కల్పించాం. వాటికి సాధారణ రుసుం చెల్లించి సేవలను వినియోగించుకోవచ్చు. జిల్లా ప్రతిష్టతను పెంచేలా.. జిల్లాలో ప్రఖ్యాత జోగుళాంబ ఆలయ ప్రతిష్టను దేశం నలుదిశలా చాటేలా అలంపూర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జోగుళాంబను దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు రోజుకూ ఐదువేల చొప్పున లడ్డూప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు ఉచితంగా పంపిణీచేస్తున్నాం. గొందిమళ్లకు సీఎం కేసీఆర్ గొందిమళ్ల, సోమశిలలో వీఐపీ ఘాట్లను ఏర్పాటుచేశాం. సీఎం కేసీఆర్ గొందిమళ్లలో ఈనెల 12వ తేదీ ఉదయం కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక్కడ తెలంగాణ, జిల్లా సంçస్కృ తి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన చిత్రపటాలను సీఎం ప్రారంభిస్తారు. ప్రఖ్యాత హరిద్వార్‌లో గంగాహారతి తరహాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 12రోజుల పాటు జిల్లాలోని ఆరుఘాట్లలో కృష్ణవేణి హారతి నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం శాస్త్రోక్తంగా కొనసాగుతుంది. మిగిలిన ఘాట్ల వద్ద నిత్యం ఉదయం గంగపూజ నిర్వహిస్తాం. వలంటీర్లలో ప్రత్యేక సేవలు వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు పుష్కర స్నానాలు చేసేందుకు ఘాట్లవద్ద చర్యలు చేపడుతున్నాం. వీరికి సేవలు అందించేందుకు ప్రత్యేక వలంటీర్లు సేవలందిస్తారు. భక్తులెవరూ స్నానాలు చేసిన తర్వాత ఘాట్ల వద్దనే ఉండకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో రాకుండా క్రమపద్ధతిలో వచ్చిపోయేలా తగిన ఏర్పాట్లు చేశాం. సగటున ఒక్కో భక్తుడు నాలుగు నిమిషాల్లో నదీస్నానం ఆచరించేలా కార్యచరణ రూపొందించాం. పుష్కరాలకు అధునిక హంగులు యాత్రికుల సౌకర్యార్థం ఈసారి ఆధునిక సాంకేతికసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సెల్‌ఫోన్ సిగ్నళ్ల సమస్య తలెత్తకుండా వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని ఆరుఘాట్ల వద్ద ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం కొంత చార్జీని కూడా ప్రభుత్వం నుంచి సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించాం. వీటితో పాటు ‘వేర్ ఐ యామ్ ఐ’ గూగుల్ యాప్‌ని కూడా రూపొందించాం. స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకునే భక్తులకు వాళ్లు ఎక్కడున్నారు.. ఎక్కడ రద్దీ ఎలా ఉంది.. ఏ ఘాట్‌కు వారున్న ప్రదేశం నుంచి ఎలా వెళ్లాలి.. టాయిలెట్లు ఎటువైపు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఎటువైపు ఉంది.. అనే అంశాలను తెలుసుకోవచ్చు. -
హజ్ యాత్రలో విషాదం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లింలు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో ఈసారి నెల వ్యవధిలోనే రెండో విషాదం చోటు చేసుకుంది. పక్షం రోజుల క్రితం ఒక క్రేన్ కూలి 115మంది మరణించగా... గురువారం ఉదయం తొక్కిసలాట సంభవించి 700మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900మంది వరకూ గాయపడ్డారని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. 1990లో మక్కానుంచి మినాకు వెళ్లే దారిలో ఈ తరహాలోనే తొక్కిసలాట జరిగి 1,426 మంది కన్నుమూశారు. ఆ తర్వాత కనీసం నాలుగైదుసార్లు ఇలాగే తొక్కిస లాటలు చోటుచేసుకుని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2006లో మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో 364 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏవో చిన్న ఘటనలు మినహా అంతా సవ్యంగా గడిచింది. ఈసారి 20 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. మన దేశం నుంచి వెళ్లినవారి సంఖ్యే దాదాపు లక్షన్నర అని చెబుతున్నారు. మృతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన మహిళగా గుర్తించారు. జమారత్ స్థూపాల వద్దకు వెళ్లే మార్గాలను మూసేయడం వల్లనే లక్షలాదిమంది యాత్రికులు ఒకచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని ఇరాన్ హజ్ సంస్థ ముఖ్యుడు చెబుతున్నారు. అందుకు భిన్నంగా సైతాన్ను రాళ్లతో కొట్టే సందర్భంలో ఇలా జరిగిందని సౌదీ ప్రభుత్వం వివరణనిస్తోంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా పవిత్ర హజ్ ఆరాధనలో పాల్గొనాలని, దైవ ప్రసన్నం పొందాలని ముస్లింలంతా ఉవ్విళ్లూరుతారు. అందుకోసం ప్రత్యేకించి తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తుంటారు. మనస్సునూ, దేహాన్నీ నిర్మలంగా ఉంచుకుని అన్ని రకాల మనోవాంఛలకూ దూరంగా ఉంటూ నిరంతర దైవ ధ్యానంతో హజ్ యాత్రకు సిద్ధపడతారు. అలాంటి యాత్రలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తుంది. లక్షలాదిమంది ఒక చోటకు చేరే ఇలాంటి కార్యక్రమాలను నియంత్రించడం, అందరూ సురక్షితంగా తిరిగి వెళ్లేలా చూడటం సామాన్యమైన విషయం కాదు. ఇదంతా ఎన్నో ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది. హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లే చేసింది. లక్షమందికి పైగా పోలీసు సిబ్బందినీ, దాదాపు 30,000 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించింది. ఆపత్కాలంలో ఉపయోగించేందుకు వేలాది పడకలతో, అత్యవసర చికిత్సకు అవసరమైన పరికరాలతో ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అగ్నిమాపక దళాలను సిద్ధం చేసింది. 26 లక్షలమందికి సరిపడా గుడారాలను సమకూర్చింది. అవన్నీ అగ్ని ప్రమాదాలకు తావీయనివి. భక్తుల రద్దీ ఏటా పెరగడాన్ని గమనించి ఈసారి ప్రధాన మసీదు వద్ద 4,00,000 చదరపు మీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టింది. నిజానికి అందుకు సంబంధించిన నిర్మాణ పనులు సాగుతుండగానే పదిహేను రోజుల క్రితం క్రేన్ ఒక్కసారిగా కూలి వందమందికి పైగా మరణించారు. రద్దీని తగ్గించడం కోసం ఈసారి సౌదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. రిజిస్ట్రేషన్లు, పర్యాటక వీసాల్లో పెట్టిన నిబంధనలన్నీ తొలిసారి యాత్రకొచ్చేవారిని మాత్రమే అనుమతించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్థికంగా స్తోమత ఉండి, దైవ చింతనలో గడపాలనుకునేవారు జీవితంలో ఎన్నిసార్లయినా హజ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటారని, అటువంటివారికి సౌదీ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నదని విమర్శలు వచ్చాయి. అయితే ఏదో రకమైన పరిమితులు విధించకపోతే, అవసరమైన నియంత్రణా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి యాత్రల్లో అపశ్రుతులు దొర్లకుండా చూడటం సాధ్యం కాదన్నది సౌదీ అధికారులిస్తున్న సంజాయిషీ. ఆ వాదనలోని హేతుబద్ధత సంగతలా ఉంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న సౌదీ ప్రభుత్వం కొన్ని చిన్న చిన్న లోపాలను సరిగా పట్టించుకోలేదని, అందువల్లనే ఈ విషాదం చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా రెండు దారులు మూసేయడంవల్ల అటుగా వచ్చేవారికి తోవ లేకుండా పోయిందని చెబుతున్నారు. తొక్కిసలాటలు జరిగినప్పుడల్లా వినబడే కారణమే ఇది. మొన్న జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట సంభవించి 29మంది మరణించడానికి పుష్కర ఘాట్ వద్ద గేటు మూసి, భక్తుల్ని గంటల తరబడి నిలిపేసి ఒక్కసారిగా అనుమతించడమే కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా సాగించిన పూజ పూర్తయ్యేదాకా వారందరినీ కదలనీయలేదు. భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉండే ఇలాంటి సందర్భాలప్పుడు ప్రభుత్వాలు ప్రతి చిన్న అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రమాదాల నివారణ సాధ్యం కాదు. తొక్కిసలాటల విషయంలో ఒక అంతర్జాతీయ జర్నల్ ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. మన దేశంలో జరిగే తొక్కిసలాటల్లో 79 శాతం మతపరమైన కూడిక సందర్భంలోనే సంభవిస్తున్నాయని వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇందుకు భిన్నంగా క్రీడలు జరిగే స్టేడియంలలో, సంగీత ఉత్సవాల్లో, నైట్ క్లబ్‌లలో చోటుచేసుకుంటాయి. వ్యక్తులుగా ఉన్నప్పటి ప్రవర్తనకూ, సమూహంలో భాగంగా ఉన్నప్పటి ప్రవర్తనకూ ఎంతో తేడా ఉంటుందని...చుట్టూ ఉన్నవారి ప్రవర్తనకు ప్రభావితమై ఎవరైనా అందులో భాగంగా మారిపోతారని, ఈ క్రమంలో తమను తాము మరిచిపోయే తత్వం ఏర్పడుతుందని సమూహ ప్రవర్తనను విశ్లేషించే నిపుణులు చెబుతారు. కనుక ఈ సందర్భాల్లో ఎంతో అప్రమత్తత అవసరమవుతుంది. హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. 1930లో ఆ యాత్రలో 30,000మంది పాల్గొన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అది ఇప్పుడు దాదాపు 30 లక్షలకు చేరువవుతున్నది. కనుక సౌదీ సర్కారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి సంభవించకుండా చూడాలి. ఒక్క సౌదీకే కాదు... ప్రపంచ దేశాలన్నిటికీ ఈ విషాద ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. -
ఘనంగా ముగిసిన మహాపుష్కరాలు
-
ఏపీలో తొమ్మిదో రోజుకు చేరుకున్న పుష్కరాలు
-
ఏపీలో పదో రోజుకు చేరుకున్న పుష్కరాలు
-
ఏపీలో11 రోజుకు చేరుకున్న పుష్కరాలు
-
చివరి అంకం.. కావాలి అప్రమత్తం
పుష్కరాల ముగింపు.. రేపు, ఎల్లుండి పోటెత్తనున్న భక్తులు ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులే.. బాసరలో శోభాయమానంగా ముగింపు ఉత్సవం? సీఎం కేసీఆర్ జిలా పర్యటనపై సందిగ్ధత సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పుష్కరాలు చివరి అంకానికి చేరకున్నాయి. శనివారం సూర్యాస్తమయంతో పుష్కరాలు ముగియనున్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు. పుష్కర స్నానాలు చేసేందుకు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శుక్ర, శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల వంటి ప్రధాన ఘాట్లకు తాకిడి పెరగనుంది. భక్తుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం తప్పనిసరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాసర, సోన్, మంచిర్యాల, చెన్నూరు వంటి చోట్ల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి. బుధవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్లు బురదమయంగా తయారయ్యాయి. బాసర ఘాట్ వద్ద ఉండిపోయిన మ ట్టిదిబ్బలపై జారి పడకుండా ఇసుక బస్తాలు వేయడం వంటి ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోం ది. వర్షానికి బాసర ఆలయం మెట్ల వద్ద వర్షం నీటికి జారిపడి హైదరాబాద్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. చాలాచోట్ల షవర్లు పనిచేయడం లేదు. బురద పైపుల్లో ఇరుక్కుపోయి నీళ్లు రావడం లేదు. వెంటనే వీటి మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారిశుధ్యం విషయంలో పంచాయతీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా హోటళ్లలో శుభ్రమైన ఆహారం విక్రయించేలా తనిఖీలు చేపట్టని పక్షంలో భక్తుల ఆరోగ్యం ప్రశ్నార్థంగా మారనుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఉచిత బస్సుల సంఖ్యను పెంచుతున్నా, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రతి ట్రిప్పులోనూ కిక్కిరిసిపోతోంది. రెండు రోజులు మరింత రద్దీ పెరగనుండటంతో ఆ మేరకు బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో వచ్చీవెళ్లే రైళ్ల సమయానికి తగ్గట్టుగా ట్రిప్పులను పెంచాలని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా భక్తులు తరలివస్తే తోపులాట జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలయంలో కూడా క్యూలైన్ల క్రమబద్ధీకరణ విషయంలో అప్రమత్తంగా లేనిపక్షంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మంచిర్యాల సమీపంలోని ముల్కల్ల ఘాట్‌కు కేవలం వందల్లోనే భక్తులు వచ్చే అవకాశాలున్నాయని ముందు గా అంచనా వేశారు. ఈ అంచనాలు తారుమారయ్యాయి. నిత్యం వేలల్లో భక్తులు వస్తుండడంతో ఈ ఘాట్‌ను ఉన్నఫలంగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అవి తొందరగా పూర్తయ్యేలా చూడాలి. సౌకర్యాలపై కలెక్టర్ జగన్మోహన్ స్పందిస్తూ.. శుక్ర, శనివారాల్లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాం. పుష్కర విధులు నిర్వర్తిస్తున్న అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. బాసరలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా, రాత్రివేళల్లో వచ్చే రైళ్ల సమయానికి ఈ బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశాం. సీఎం కేసీఆర్ పర్యటన డౌటే..? పుష్కరాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో పర్యటిస్తారని అం దరూ భావించారు. పుష్కరాలు ముగిసేలోపు బాసరకు వచ్చే అవకాశాలున్నాయని అనుకున్నారు. మంత్రులూ ప్రకటించినా.. సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. శోభాయమానంగా ముగింపు.. పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించాలని బాసర దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి హారతి నిర్వహించాలని భావిస్తున్నారు. ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. అనంతరం గోదావరి తల్లికి, సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలనే యోచనలో ఉన్నారు. -
ఏపీలో ఏడో రోజుకు చేరుకున్న పుష్కరాలు
-
ఏడో రోజుకు చేరుకున్న పుష్కరాలు
రాజమండ్రి: ఏడో రోజు పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాలు కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వీరికి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో టీటీడీ రోజు లక్ష ఆహార పొట్లాలు అందించాని నిర్ణయించింది. కాగా, రాజమండ్రి, సామర్లకొట నుంచి పుష్కరాల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. -
రెండుకోట్లకు చేరిన పుష్కర స్నానాలు
హైదరాబాద్ సిటీ: గోదావరి పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కోట్ల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శని, ఆదివారం నాడే కోటి మందికి పైగా భక్తులు పుష్కరాలకు హాజరైనట్టు పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి రోజు వారీగా పుష్కరాలకు హాజరైన భక్తుల వివరాలు.. 14-07 15-07 16-07 17-07 18-07 19-07 మొత్తం (తూ.గో.గ్రామ 8,04,605 9,85,318 11,55,112 10,96,497 19,40,699 15,05,082 74,87,353 పట్టణ ప్రాంతం 9,97,329 6,46,969 10,87,587 11,15,062 19,54,619 14,35,267 72,36,833 (ప.గో.గ్రా,ప) 5,44,511 7,90,864 8,34,609 8,61,782 19,30,403 14,71,559 64,33,728 23,46,485 24,23,151 30,77,308 30,73,341 58,25,721 44,11,908 2,11,57,914 -
భక్తులతో యాదగిరికొండ కిటకిట
యాదగిరికొండ(నల్లగొండ):యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడం, పుష్కరాలకు వెళ్ళిన భక్తులు తిరుగు ముఖంలో గుట్టకు తరలిరావడంతో సందడి నెలకొంది. సంగీత భవనం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల క్యూలైన్లు బారులు తీరాయి. మరికొందరు భక్తుల ర ద్దీని చూసి స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. స్వామి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. -
పుష్కరాలలో ఏపీ, తెలంగాణలో ట్రాఫిక్ జామ్
-
ధర్మపురికి 4 లక్షల మంది భక్తులు!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కర ఘాట్ల వద్ద బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా తాకిడి పెరగటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. -
భక్తులను మెడపట్టి గెంటేసిన టీటీడీ ఉద్యోగులు
వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై భక్తులకు, టీటీడీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను వద్ద ఈ వివాదం చోటుచేసుకుంది. ఆన్లైన్లో గ్రూప్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను లోపలకు అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఆందోళనకు దిగిన భక్తులను టీటీడీ ఉద్యోగులు మెడపట్టి బయటకు గెంటేశారు. వారికి స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించలేదు. ఇంత గొడవ జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. రూ. 300 దర్శనం విషయంలో చాలాసార్లు ఇలా ఆందోళనలు జరిగాయి. క్యూలైన్ లోపలకు ప్రవేశించడానికి ముందే దర్శనానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని డిస్ప్లే బోర్డుల మీద రాయాలని భక్తులు పలు సందర్భాల్లో కోరినా టీటీడీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పేరుకే ప్రత్యేక ప్రవేశ దర్శనం తప్ప.. దీనికి కూడా గంటల తరబడి సమయం పడుతోందని భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
బద్రీనాథ్‌లో భయం భయంగా..
సాక్షి, న్యూఢిల్లీ, విజయవాడ బ్యూరో: గతేడాది ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రికులపై విరుచుకుపడ్డ భారీ వరదలు మరోసారి వణికిస్తున్నాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు భక్తులు అక్కడ చిక్కుకుపోయారు. జోరు వానలోనే నానా కష్టాలు పడి బద్రీనాథ్ చేరుకుని ప్రస్తుతం అక్కడి చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకుంటున్నా రు. మూడు రోజులుగా ఆశ్రమ నిర్వాహకులు వారికి భోజన వసతి కల్పించి ఆదుకుంటున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల వారు సుమారు 50 మంది యాత్రికులున్నారు. కరెంటు సదుపాయం, ఫోన్లు, ఏటీఎంలు పనిచేయక అవస్థలు పడుతున్నట్లు యాత్రికులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధులకు తెలిపారు. మరో 100 మందికి పైగా తెలుగువారు బద్రీనాథ్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పారు. వారిలో వృద్ధులు, మహిళలు ఉండటంతో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో తెలియక ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం జీయర్ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడింది. పోలీసులను పంపి తెలుగు యాత్రికుల వివరాలను సేకరిం చింది. ఇక్కడున్న యాత్రికుల్లో ఇద్దరి మొబైల్స్ 9701456187, 9560935988 మాత్రమే పని చేస్తున్నాయి. యాత్రికులు విజయవాడ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి బద్రీనాథ్‌లోని చినజీయర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఆశ్రమం మేనేజర్ కృష్ణారావు వీరికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం మెరుగుపడ్డాకే యాత్ర పునరుద్ధరణ ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగటంతోపాటు నదులు ఉప్పొంగటం, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రను తొలుత నిలిపివేయగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంగోత్రి, యమునోత్రి యాత్రను కూడా సాయంత్రం నిలిపివేశారు. దీంతో చార్ధామ్ యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఉత్తరాఖండ్‌కు రెండు ఎంఐ-17 హెలి కాప్టర్లు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించింది. జూలై 25వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. గత ఏడాది వరద బీభత్సం అనుభవాల నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. ఆరు సహా యక బృందాలను రంగంలోకి దించారు. అల్మోరా, పౌరి, రుద్రప్రయాగ, చమోలీ, హరిద్వార్‌లో యాత్రికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంత ప్రమాదమని తెలిస్తే వచ్చే వాళ్లం కాదు భారీ వర్షాల వల్ల కరెంటు సరఫరా నిలిచిపోయి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కొండప్రాంతాల్లోని రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు రోజులుగా యాత్రికులు నానా అవస్థలు పడుతున్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించలేదు. - బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం మూడు రోజుల క్రితం బద్రీనాథ్‌కి వచ్చాం. అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అంతా చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ఉన్నాం. - సాక్షితో హరిబాబు(కేపీహెచ్‌బీ, హైదరాబాద్) చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకున్నాం చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకోవటంతో బయటపడగలిగాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న తొమ్మిది మంది బంధువులతో కలిసి యాత్రకు వచ్చాం. - ఎస్వీఎస్ రావు (ఢిల్లీలో ఉంటున్న తెలుగు వ్యక్తి) చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న కొందరు తెలుగువారు.. తుంగల భాస్కరరావు, సావిత్రి, అరుణ, నగరాజకుమారి, రాధ, సాంబశివరావు, సుబ్బారావు, ఎస్వీఎస్ రావు (కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు) ఎస్. హరిబాబు (చిత్తూరు) సోమయాజులు, రజని దంపతులు. యల్లప్ప, తాయారమ్మ దంపతులు, సూర్యనారాయణ, సుహాసిని, మౌనిక, మాల్యాద్రి (వీరిది కేపీహెచ్‌బీ కాలనీ) విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది ఉత్తరాఖండ్‌లో నదుల పరవళ్లు గత 24 గంటల్లో నైనిటాల్లో గరిష్టంగా 152 మి.మీ. వర్షం కురిసింది. అలకనంద, మందాకినీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాలలో అన్ని పాఠశాలలను సోమవారం వరకు మూసివేశారు. ప్రమాదస్థాయిలో అలకనంద, గంగ, మందాకినీ నదులు యాత్రికులు క్షేమం: కంభంపాటి బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాత్రికులు బద్రీనాథ్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో క్షేమంగా ఉన్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు జాతీయ విపత్తుల సంస్థ సభ్యులతో మాట్లాడి వారికి సాయం అందించాలని కోరాం. ఏపీ భవన్ అధికారులూ యాత్రికులతో మాట్లాడుతున్నారు. - కంభంపాటి రామ్మోహన్రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి -
పర్యావరణంపై నిర్లక్ష్యం!
ప్రకృతి పట్ల మనిషి చేసిన అపచారం పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లో పెను విషాదం సంభవించి అప్పుడే ఏడాదైంది. నిరుడు జూన్ 15 కాళరాత్రి మొదలైన కుంభవృష్టి ఆ మర్నాడంతా కొనసాగడంతో ఆ రాష్ట్రంలోని చమోలీ, రుద్రప్రయాగ, ఉత్తరకాశి, పితోర్‌గఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని అనేకానేక నదులు కట్టలు తెంచుకుని జనావాసాలపై విరుచుకుపడ్డాయి. దాదాపు పదివేలమంది మరణించారని జాతీయ విపత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అంచనావేయగా... 4,251 మంది చనిపోయారని, మరో 1,497 మంది ఆచూకీ లేకుండా పోయారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లినవారితోసహా ఎన్నో రాష్ట్రాల యాత్రికులు న్నారు. యాత్రికులు మాత్రమే కాదు...వీరిపై ఆధారపడి జీవికను వెతుక్కునే స్థానికులు వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విలయంపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. మందా కిని, అలక్‌నందా నదులపై ఉన్న 24 జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్లనే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉన్నదా అనే సంగతిని తేల్చమన్నది. కమిటీలోని మెజారిటీ సభ్యులు ఈ ప్రాజెక్టులన్నిటినీ నిలిపేయవలసిం దేనని అభిప్రాయపడ్డారు. దీనిపై పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పంద నేమిటో ఇంకా తెలియాల్సే ఉన్నది. ఈ ఏడాదికాలంలో బాధిత కుటుం బాలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా విఫ లమైంది. కానీ, పునర్నిర్మాణం కోసమని వేల కోట్లరూపాయలు ఖర్చు చేశారు. రహదారులు, వంతెనల నిర్మాణం పనులు సాగుతున్నాయి. కానీ, విషాదమేమంటే ఈ పునర్నిర్మాణమంతా ఎప్పటిలానే పర్యా వరణాన్ని పట్టించుకోకుండా... దానికి వీసమెత్తు విలువీయకుండా సాగుతున్నది. పర్యావరణాన్ని కాపాడాలంటే, దాని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఏకరువు పెట్టిన అంశాలన్నీ కాగితాల్లో భద్రంగా ఉండిపోయాయి. వాటిని ఎవరైనా చదివారో లేదో కూడా అనుమానమే. ఈ విలయం మానవ తప్పిదం పర్యవసానమేనని గుర్తించి ఒక్క ఉత్తరాఖండ్‌ను మాత్రమే కాదు... హిమవ న్నగాల సమీపాన ఉండే రాష్ట్రాలన్నిటా ఎక్కడెక్కడ హఠాత్తుగా వర దలు పోటెత్తవచ్చునో అంచనా వేయాలనుకున్నారు. అలాంటి ప్రాంతాల్లో తగిన మార్పులు చేయాలనుకున్నారు. కానీ అవేమీ అమలుకాలేదు. రోడ్ల నిర్మాణం మొదలుకొని జల విద్యుత్తు ప్రాజెక్టుల వరకూ అభివృద్ధి ప్రక్రియలో విజ్ఞానశాస్త్ర భాగస్వామ్యాన్ని పెంచాలను కున్నారు. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని నదుల గమనాన్ని అధ్యయనం చేయించారు. నదీ గమనానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్తు ప్రాజెక్టుల గురించిన వివరాలూ రూపొందాయి. అయితే ఆ ప్రాజె క్టులను పూర్తిగా తొలగించడానికి లేదా కనీసం కుదించడానికి పాల కులు అంగీకరించలేదు. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిపు ణులు రెండు కీలకమైన సూచనలు చేశారు. అడ్డూ ఆపూ లేకుండా విస్త రిస్తున్న జల విద్యుత్తు ప్రాజెక్టులకూ, యాత్రికుల కోసమంటూ నిర్మి స్తున్న రహదారుల నిర్మాణానికీ కళ్లెం వేయాలని చెప్పారు. మిగిలిన వాటి సంగతలా ఉంచి ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తలు తీసు కుంటే మరో ప్రమాదాన్ని నివారించడానికి వీలవుతుందని సూచిం చారు. అయితే, జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ఆలోచన ఆగలేదు. యమునా వ్యాలీలో ఈమధ్య ఒక జల విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతి లభించడమే ఇందుకు తార్కాణం. ఉన్నవాటినే తగ్గించాలని చెబు తుంటే కొత్త ప్రాజెక్టులు అవతరిస్తున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్ అనే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసమని నిర్మించే సొరంగాలు, జలాశయాలు నదుల సహజ గమ నాన్ని అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు మొత్తుకున్నా ఫలితం లేదని దీన్నిబట్టి అర్థమవుతుంది. పుణ్య క్షేత్రాలనూ, తీర్థాలనూ సందర్శించి పునీతులమవుదామని వచ్చేవారివల్ల ఉత్తరాఖండ్‌కు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తు న్నది. పర్యాటకం అనేది ఇప్పుడక్కడ ప్రధాన ఆదాయ వనరైంది. కానీ అలాంటివారి ప్రాణాలకు పూచీపడేలా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఒక ఘోరకలి జరిగిన తర్వాతనైనా కర్తవ్య నిర్వహ ణపై శ్రద్ధవహించొద్దా? కొత్త జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో ఇంత ఆసక్తి కనబరిచిన ఉత్తరాఖండ్ వాతావరణ స్థితిగతులను అంచ నావేసే రాడార్లను సమకూర్చుకోవడంలో విఫలమైంది. నిరుడు ప్రమా దం సంభవించినప్పుడు కీలకమైన ప్రాంతాల్లో రాడార్లను ఏర్పాటుచే స్తామని, వాతావరణ అధ్యయనానికి అవసరమయ్యే ఇతర యంత్రా లను తెప్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇంతవరకూ వాటి ఆచూకీ లేదు. వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఇప్పటికీ న్యూఢిల్లీ, పాటియాలాల్లోని వాతావరణ కేంద్రాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతున్నది. అరణ్యాల విధ్వంసం, కొండలనూ, గుట్టలనూ నా శనం చేయడం, నదుల ప్రవాహాన్ని అడ్డుకోవడం వంటి చర్యలవల్లనే ప్రకృతి కన్నెర్రజేస్తున్నదని చెబుతున్నా అది ప్రభుత్వాల ముందు బధిర శంఖారావమే అవుతున్నది. ఏ నదికైనా అటూ ఇటూ ఉండే 10 కిలో మీటర్ల దూరాన్ని పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా పరిగణించా లన్న నిబంధనలున్నా వాటి అమలును పర్యవేక్షించే నాథుడు లేడు. ఉత్తరాఖండ్ విషాదం నుంచి మనం ఎలాంటి గుణపాఠాలూ నేర్చు కోలేదని అక్కడ సాగుతున్న తంతు నిరూపిస్తున్నది. అక్కడ మాత్రమే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ విష యంలో జనం చైతన్యవంతమై ప్రభుత్వాలను నిలదీస్తే తప్ప వారిలో మార్పు రాదు. అందుకు అవసరమైన కార్యాచరణే ఉత్తరాఖండ్ మృతులకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది. -
కారు ఢీకొని నలుగురు తిరుమల భక్తుల మృతి
చిత్తూరు జిల్లా పాకాల మండలం బైలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికని బయల్దేరి వెళ్తున్న భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.