పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి   | Police Lathi charge on Piligrims Opposition Demands Explaination | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో మళ్ళీ మొఘల్ చక్రవర్తులు పుట్టారా?

Published Mon, Jun 12 2023 7:58 AM | Last Updated on Mon, Jun 12 2023 8:03 AM

Police Lathi charge on Piligrims Opposition Demands Explaination  - Sakshi

ముంబై: మహారాష్ట్ర అలందిలోని శ్రీ క్షేత్ర దేవాలయంలో వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కేవలం 75 మంది భక్తులకు మాత్రం ప్రవేశమున్న ఆలయ ప్రాంగణంలోనికి ఒకేసారి 400 మంది భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీచార్జి చేశామని పూణే పోలీసులు తెలిపారు. దీంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొఘలులు మళ్ళీ పునర్జన్మ పొందారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.  
   
పూణే నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న శ్రీ క్షేత్రం దేవాలయంలో జరిగే తీర్థయాత్రలో ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. శ్రీ కృష్ణుడికి మరో రూపమైన విఠోబాకు పూజలు నిర్వహిస్తూ  ఉంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా మొదలైన ఈ ఉత్సవాలకు అనేక మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రోజున ఈ రద్దీ మరీ ఎక్కువైంది. 

ఇదే క్రమంలో కేవలం 75 మందికి మాత్రమే అనుమతున్న ఆలయ ప్రాంగణంలోకి సుమారు 400 మంది భక్తులు ఒకేసారి దూసుకొచ్చారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో లాఠీచార్జి చేశారు. పోలీసులు లాఠీచార్జి చేస్తున్న ఈ వీడియో బయటకు రావడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అరెరె.. హిందూత్వ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడింది. ముసుగు తొలగిపోయింది. ఔరంగజేబు ఇంత భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు మళ్ళీ జన్మించారా?" అని రాసి పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు.  

ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కూడా స్పందిస్తూ.. వార్కారీ సోదరులపై జరిగిన లాఠీచార్జి అమానుషం. వార్కారీల దైవస్వరూపం సాక్షాత్తు స్వామి జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో ఇలాంటి సంఘటన జరగడం ఖండించదగినది. వార్కారీల పట్ల ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటోందా? అనడిగారు.   

మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఆలయం వద్ద ఎటువంటి లాఠీచార్జి జరగలేదని అన్నారు. అక్కడ జరిగింది చిన్న  గొడవ మాత్రమే. గతేడాది జరిగిన తొక్కిసలాట వంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్.. 

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement